‘మిర్చి’సినిమా రీమేక్‌లో చేస్తున్న సుదీప్
‘మిర్చి’సినిమా రీమేక్‌లో చేస్తున్న సుదీప్
Published Mon, Aug 5 2013 2:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
‘‘రవిచంద్రన్‌గారు ప్రధాన పాత్రలో నేనో సినిమాకి దర్శకత్వం వహించబోతున్న మాట నిజమే. ఈ సినిమా గురించి చెప్పగానే ఆయన ఓకే చెప్పడానికి ఒక్క నిమిషం కూడా తీసుకోలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ నెల 19న షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు కన్నడ నటుడు, దర్శకుడు సుదీప్. వీర మడకరి, కెంపెగౌడ, జస్ట్ మాత్ మాతల్లి.. ఇలా సుదీప్ పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
వీటిలో రీమేక్స్ శాతం ఎక్కువ. కాగా, రవిచంద్రన్ కీలక పాత్రలో తను నటించి, దర్శకత్వం వహించబోతున్న చిత్రం తెలుగు ‘మిర్చి’కి రీమేక్ అని సమాచారం. ఈ చిత్రాన్ని ఎన్. కుమార్ నిర్మించబోతున్నారట. తెలుగు ‘మిర్చి’ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఆల్రెడీ రీమేక్ రాజాగా కన్నడంలో గుర్తింపు ఉన్న సుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటంతో అంచనాలు ప్రారంభమయ్యాయి. క్రేజీ స్టార్ రవించంద్రన్, సుదీప్ కాంబినేషన్ కూడా కావడంతో క్రేజ్ నెలకొంది.
Advertisement
Advertisement