స్టార్ హీరో న్యూ లుక్ అదుర్స్! | sudeep new look awesome in latest movie Hebbuli | Sakshi
Sakshi News home page

స్టార్ హీరో న్యూ లుక్ అదుర్స్!

Published Fri, Jun 10 2016 9:59 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

స్టార్ హీరో న్యూ లుక్ అదుర్స్!

స్టార్ హీరో న్యూ లుక్ అదుర్స్!

బెంగళూరు: కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ నటించిన కొత్త చిత్రం హెబ్బులి పోస్టర్ను గురువారం అధికారికంగా విడుదల చేసారు. హెబ్బులి ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరో తొలిసారి విభిన్నంగా కనిపించినందుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో హీరో కిచ్చా సుదీప్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విభిన్నంగా కనిపించడానికి సుదీప్ పలు జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. విభిన్నమైన హెయిర్ స్టయిల్, సరికొత్త కాస్టూమ్ తో ప్రేక్షకులను అలరించనున్నాడు.

ఇక హీరోయిన్ విషయానికి వస్తే తెలుగు, తమిళ చిత్రాల్లో మంచి నటిగా అటు అభినయంతోనూ, అందాల ఆరబోతతోనూ మంచి మార్కులు తెచ్చుకున్న అమలాపాల్ ఇందులో హీరోయిన్ గా నటించనుంది. పెళ్లయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి మునుపటి జోరుతో సినిమాలు చేసుకుపోతోంది. అయితే హీరోయిన్ పాత్ర తీరు తెన్నులు ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని ఇప్పటి వరకు సినియా యూనిట్ గోప్యంగా ఉంచడం విశేషం. గజకేసరి చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ నిర్దేశకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రేజీ స్టార్ రవిచంద్రన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement