ఆత్మహత్యను అడ్డుకున్న కుక్క! | The dog refused to suicide! | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యను అడ్డుకున్న కుక్క!

Published Fri, Jul 22 2016 1:23 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఆత్మహత్యను అడ్డుకున్న కుక్క! - Sakshi

ఆత్మహత్యను అడ్డుకున్న కుక్క!

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సేలం జిల్లాలో వాళప్పాడి అగ్రహారానికి చెందిన రవిచంద్రన్ (50) అనే కూలీ ఒక కుక్క (పేరు బిసీ)ను పెంచుకుంటున్నాడు. ఇంట్లో గొడవలతో మనస్తాపం చెందిన రవి మూడు రోజుల క్రితం ఇల్లు వదిలి వె ళ్లాడు. బిసీ గురువారం అతని వాసన పసిగడుతూ వీధుల్లోకి వచ్చింది. ఊరి శివార్లలోని తాళ్ల పరిశ్రమలో రవిని కనుగొంది. రవి దగ్గరికి వెళ్లగా అతను బిసీని చేరదీయకపోవడంతో కుక్కకు అనుమానం వచ్చింది. వెంటనే ఇంటికి పరుగులు పెట్టింది. నిద్రపోతున్న రవిచంద్రన్ కొడుకు కుమార్‌ను లేపి రవి ఉన్నచోటుకి తీసుకెళ్లింది. అప్పటికే రవిచంద్రన్ ఉరి వేసుకునేందుకు తాళ్లు సిద్ధం చేసుకున్నాడు. కుమార్ వెంటనే తండ్రికి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. యజమానిని కాపాడిన బిసీకి కుటుంబ సభ్యులంతా మంచి విందునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement