15న తిరుమణం ఎన్నుం నిఖా | thirumanam ennum nikkah on 15th may | Sakshi
Sakshi News home page

15న తిరుమణం ఎన్నుం నిఖా

Published Sat, May 10 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

15న తిరుమణం ఎన్నుం నిఖా

15న తిరుమణం ఎన్నుం నిఖా

తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువజంట జయ్, నజ్రియా నజీమ్ నటించిన చిత్రం తిరుమణం ఎన్నుం నిఖా చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. దీని ద్వారా నాజర్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన అనిస్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. చిత్ర దర్శకుడు అనిస్ మాట్లాడుతూ తిరుమణం ఎన్నుం నిఖా రొమాంటిక్ లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ కథా చిత్రమన్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే జయ్, నజ్రియా మధ్య ప్రేమ ఎలా మొదలైంది, ఆ ప్రేమ పెళ్లికి దారి తీసిందా? లేదా? అన్నదే చిత్ర ఇతివృత్తమని తెలిపారు.

చిత్రం ఆస్కార్ ఫిలింస్ స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని తెలిపారు. రంజాన్ వేడుకలను చెన్నై నగరంలో ఒకరకంగాను, ఉత్తర చెన్నై రాయపురంలో మరో విధంగాను నిర్వహిస్తారన్నారు. ఈ రెండు ప్రాంతాల రంజాన్ నిజ వేడుకలను తిరుమణం ఎన్నుం నిఖా చిత్రం కోసం చిత్రీకరించామని తెలిపారు. చిత్ర ఆలస్యానికి ఇదే కారణంగా పేర్కొన్నారు. అదే విధంగా మోహరం వేడుకలను యథాతథంగా చిత్రీకరించామని చెప్పారు.

చిత్రంలో పలువురు నూతన తారలను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి నటింప చేశామని వెల్లడించారు. కరెక్టుగా చెప్పాలంటే ఈ చిత్రాన్ని లేటెస్ట్ కాదల్‌కోట్టై గా చెప్పవచ్చునని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు. సంగీత దర్శకుడు జిబ్రాన్ అందించిన సంగీత బాణీలు చిత్రానికి హైలెట్‌గా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement