బాసూ రెడీయా...  | Mark Antony Trailer Launched By Rana Daggubati | Sakshi
Sakshi News home page

బాసూ రెడీయా... 

Published Mon, Sep 4 2023 12:18 AM | Last Updated on Mon, Sep 4 2023 12:19 AM

Mark Antony Trailer Launched By Rana Daggubati - Sakshi

‘ఏం బాసూ రెడీయా.. వెల్‌ కమ్‌ టు ది వరల్డ్‌ ఆఫ్‌ మార్క్‌ ఆంటోని’ అనే డైలాగ్స్‌తో ‘మార్క్‌ ఆంటోని’ ట్రైలర్‌ ఆరంభం అయింది. విశాల్‌ పలు షేడ్స్‌లో టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ఇది. పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మించారు. ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో మంచివాడిగా, విలన్‌గా, గుండుతో స్టైలిష్‌గా, తండ్రిని కాపాడుకోవాలనుకునే వ్యక్తిగా... ఇలా పలు షేడ్స్‌లో విశాల్‌ కనిపిస్తారు. ఓ టైమ్‌ మిషన్‌ కాకుండా ఓ ఫోన్‌ హీరోని గతానికి తీసుకెళ్తే తనేం చేశాడనే కథాంశంతో ‘మార్క్‌ ఆంటోని’ని రూపొందించాం’’ అన్నారు. ఈ చిత్రంలో ఎస్‌.జె. సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ తదితరులు కీలక పాత్రలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement