
విషిక, శ్రీకాంత్, భరత్
భరత్, విషికా లక్ష్మణ్ జంటగా టి. గంగాధర దర్శకత్వంలో తెరకెక్కిన విలేజ్ లవ్ ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘ఏందిరా ఈ పంచాయితీ’. ఎం.ప్రదీప్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ బాగుంది.. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘సాక్ష్యాలు ఉన్నవన్నీ నిజం కావు.. ఆధారాలు లేనివి అబద్ధాలు కావు’, ‘కొన్ని ప్రేమలు పెళ్లితో మొదలవుతాయి, కొన్ని పెళ్లికి ముందే ఆగిపోతాయి.. ఆగిపోయిన ప్రేమను వద్దనుకుంటే.. పెళ్లితో మొదలయ్యే ప్రేమను నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా’ అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment