Vishika Laxman
-
Sagileti Katha Review: ‘సగిలేటి కథ’ మూవీ రివ్యూ
టైటిల్: సగిలేటి కథ నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని ,రాజశేఖర్ అనింగి, రమని, రమేష్, సుదర్శన్ తదితరులు నిర్మాణ సంస్థ: షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మాతలు: దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సమర్పణ: నవదీప్ దర్శకత్వం: రాజశేఖర్ సుడ్మూన్ సంగీతం: జశ్వంత్ పసుపులేటి నేపథ్య సంగీతం: సనల్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్ విడుదల తేది: అక్టోబర్ 13, 2023 కథేంటంటే.. రాయలసీమలోని సగిలేరు అనే గ్రామంలో 2007 ప్రాంతంలో జరిగే కథ ఇది. ఆ గ్రామ పెద్దలు చౌడప్ప(రాజ శేఖర్ అనింగి), ఆర్ఎంపీ డాక్టర్ దొరసామి(రమేశ్) మంచి స్నేహితులు. చౌడప్ప కొడుకు కుమార్ (రవి మహాదాస్యం) కువైట్ నుంచి అప్పుడే ఊరికి తిరిగొస్తాడు. తొలి చూపులోనే దొరసామి కూతురు కృష్ణవేణి(విషిక కోట)తో ప్రేమలో పడతాడు. ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. ఊర్లో గంగాలమ్మ జాతర ముగిసిన తర్వాత ఇంట్లో ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటారు. ఓ కారణంగా చౌడప్ప తన స్నేహితుడు దొరసామిని నరికి చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కుమార్, కృష్ణవేణిల ప్రేమ కథ ఎలా ముగిసింది? ఊర్లో గంగాలమ్మ జాతర జరిగిందా లేదా? తండ్రిని చంపిన చౌడప్పపై కృష్ణవేణి ఎలా పగ తీర్చుకుంది? చివరకు కుమార్, కృష్ణవేణి ఒక్కటయ్యారా? లేదా? మధ్యలో రోషం రాజు(నరసింహ ప్రసాద్ పంత గాని) చికెన్ కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సీనియర్ జర్నలిస్టు, రచయిత బత్తుల ప్రసాదరావు రాసిన ‘సగిలేటి కథలు’లోని ‘కూరకి సచ్చినోడు’ అనే కథను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాజశేఖర్ సుడ్మూన్. విలేజ్ నెటివిటితో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గ్రామాల్లో ఉండే ప్రేమ, పగ, ద్వేషాలు.. ఇవన్ని తెరపై చక్కగా చూపించాడు. కథ పరంగా సినిమాలో కొత్తగా ఏం ఉండదు. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. కానీ రోషం రాజు కోడి కూర తినడం కోసం పడే పాట్లు మాత్రం నవ్వులు పూయిస్తాయి. గంగాలమ్మ జాతర నిర్వహించాలని పెద్దలు నిర్ణయించకునే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే హీరో, హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిన తీరు రొటీన్‌గా ఉంటుంది. మధ్యలో వచ్చే ఫైట్ సీన్, కోడికి ఎత్తుకెళ్లే సన్నివేశం..అంతా సాగదీతగా అనిపిస్తుంది. చౌడప్ప తన స్నేహితుడిని నరికి చంపిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఆ చంపుకునే సన్నివేశమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ఇక చికెన్ కోసం రోష రాజు పడే పాట్లు, ఈ నేపథ్యంలో సాగే పాట నవ్వులు పూయిస్తుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే.. చివర్లో వచ్చే ట్విస్ట్ మరో ఎత్తు అని చెప్పాలి. అప్పటి వరకు సోసోగా సాగిన కథ, కొన్ని పాత్రలు.. క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. లాజిక్కులు వెతకకుండా చూసేవారికి, విలేజ్ నేటివిటీ స్టోరీలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. కుమార్ పాత్రలో రవి మహాదాస్యం చక్కగా ఒదిగిపోయాడు. హీరోగా తనకు ఇది తొలి సినిమా అయినా.. యూట్యూబ్ వీడియోలు చేసిన అనుభవాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తెరపై చూడడానికి పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. ఇక ఆర్ఎంపీ కూతురు కృష్ణవేణిగా విషిక తనదైన నటనతో మెప్పించింది. రోషం రాజు పాత్రలో పంతగాని నరసింహ ప్రసాద్ పండించిన కామెడీ బాగుంది. మిలిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నికల్ టీమ్స్ విషయానికి వస్తే ముఖ్యంగా సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా చూపించారు. సంగీతం విషయానికొస్తే.. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. Follow the Sakshi TV channel on WhatsApp -
'మీ కూతురితో నాకు పెళ్లి ఒక్కటే కాలేదు..' ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!
భరత్, విషికా లక్ష్మణ్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను కూడా చూపించబోతోన్నట్లు తెలుస్తోంది. తాజాగా హీరో శ్రీకాంత్ చేతులు మీదుగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ బాగుంది. కొత్త టీం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా.. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, గ్లింప్స్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రేమ పంచాయితీ
భరత్, విషికా లక్ష్మణ్ జంటగా టి. గంగాధర దర్శకత్వంలో తెరకెక్కిన విలేజ్ లవ్ ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘ఏందిరా ఈ పంచాయితీ’. ఎం.ప్రదీప్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ బాగుంది.. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘సాక్ష్యాలు ఉన్నవన్నీ నిజం కావు.. ఆధారాలు లేనివి అబద్ధాలు కావు’, ‘కొన్ని ప్రేమలు పెళ్లితో మొదలవుతాయి, కొన్ని పెళ్లికి ముందే ఆగిపోతాయి.. ఆగిపోయిన ప్రేమను వద్దనుకుంటే.. పెళ్లితో మొదలయ్యే ప్రేమను నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
‘ఏందిరా ఈ పంచాయితీ’ ఎప్పుడంటే..?
గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. భరత్, విషికా లక్ష్మణ్ జంటగా టి. గంగాధర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఎం. ప్రదీప్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 6న విడుదల కానుంది. ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కు, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ స్వరకర్త. -
విలేజ్ బ్యాక్ డ్రాప్లో ‘ఏందిరా ఈ పంచాయితీ’
గ్రామీణ నేపథ్యంలో వస్తున్న చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ లభిస్తోంది. బలగం లాంటి సినిమాలు ఆ నేపథ్యంలోనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఆ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ అంటూ ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్లో తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇది వరకు ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్గా విడుదల చేసిన టీజర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. సునీత పాడిన పాట అయితే అందరినీ కదిలించింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మీద వచ్చిన ఆ పాట అందరినీ మెప్పించింది. ఇలా ప్రతీ విషయంలో సినిమా మీద ఆసక్తిని పెంచేలా ప్రమోషన్స్ చేసింది యూనిట్.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదిని ప్రకటించారు. అక్టోబర్ 6న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
రాయలసీమ నేపథ్యంలో సినిమా..అక్టోబరు 6న విడుదల
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సగిలేటి కథ’. హీరో నవదీప్ సి–స్పేస్ సమర్పణలో దేవీ ప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి నిర్మించారు. ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లు యూనిట్ వెల్లడించింది. ‘‘రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, కెమెరా, ఎడిటింగ్: రాజశేఖర్ సుద్మూన్, సంగీతం: జశ్వంత్ పసుపులేటి, నేపథ్య సంగీతం: సనల్ వాసుదేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: నరేష్ మాదినేని, లైన్ ప్రోడ్యూసర్: చందు కొత్తగుండ్ల. -
రీలిజ్కి సిద్ధమైన సగిలేటికథ.. సెన్సార్ పూర్తి
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్,పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి యూ/ఏ(U/A) సర్టిఫికేట్ జారీ చేశారు.ఈ చిత్రం చాలా న్యాచురల్ గా సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారని చిత్రబృందం పేర్కొంది. అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది.