Sagileti Katha Review: ‘సగిలేటి కథ’ మూవీ రివ్యూ | Sagileti Katha 2023 Movie Review And Rating In Telugu | Ravi Teja Mahadasyam | Vishika Kota - Sakshi
Sakshi News home page

Sagileti Katha Telugu Movie Review: ‘సగిలేటి కథ’ మూవీ రివ్యూ

Published Fri, Oct 13 2023 8:47 AM | Last Updated on Fri, Oct 13 2023 9:53 AM

Sagileti Katha Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: సగిలేటి కథ
నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని ,రాజశేఖర్ అనింగి, రమని, రమేష్, సుదర్శన్ తదితరులు
నిర్మాణ సంస్థ: షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌
నిర్మాతలు:  దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి 
సమర్పణ: నవదీప్‌
దర్శకత్వం:  రాజశేఖర్ సుడ్మూన్
సంగీతం: జశ్వంత్ పసుపులేటి
నేపథ్య సంగీతం: సనల్ వాసుదేవ్
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్
విడుదల తేది: అక్టోబర్‌ 13, 2023

కథేంటంటే..
రాయలసీమలోని సగిలేరు అనే గ్రామంలో 2007 ప్రాంతంలో జరిగే కథ ఇది. ఆ గ్రామ పెద్దలు చౌడప్ప(రాజ శేఖర్‌ అనింగి), ఆర్‌ఎంపీ డాక్టర్‌ దొరసామి(రమేశ్‌) మంచి స్నేహితులు. చౌడప్ప కొడుకు కుమార్‌ (రవి మహాదాస్యం) కువైట్‌ నుంచి అప్పుడే ఊరికి తిరిగొస్తాడు. తొలి చూపులోనే దొరసామి కూతురు కృష్ణవేణి(విషిక కోట)తో ప్రేమలో పడతాడు. ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. ఊర్లో గంగాలమ్మ జాతర ముగిసిన తర్వాత ఇంట్లో  ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటారు. ఓ కారణంగా చౌడప్ప తన స్నేహితుడు దొరసామిని నరికి చంపేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కుమార్‌, కృష్ణవేణిల ప్రేమ కథ ఎలా ముగిసింది? ఊర్లో గంగాలమ్మ జాతర జరిగిందా లేదా? తండ్రిని చంపిన చౌడప్పపై కృష్ణవేణి ఎలా పగ తీర్చుకుంది? చివరకు కుమార్‌, కృష్ణవేణి ఒక్కటయ్యారా? లేదా? మధ్యలో రోషం రాజు(నరసింహ ప్రసాద్ పంత గాని) చికెన్‌ కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
 సీనియర్‌ జర్నలిస్టు, రచయిత బత్తుల ప్రసాదరావు రాసిన ‘సగిలేటి కథలు’లోని ‘కూరకి సచ్చినోడు’ అనే కథను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాజశేఖర్ సుడ్మూన్.   విలేజ్‌ నెటివిటితో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. గ్రామాల్లో ఉండే ప్రేమ, పగ, ద్వేషాలు.. ఇవన్ని తెరపై చక్కగా చూపించాడు. కథ పరంగా సినిమాలో కొత్తగా ఏం ఉండదు. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ రొటీన్‌గా ఉంటుంది. కానీ రోషం రాజు కోడి కూర తినడం కోసం పడే పాట్లు మాత్రం నవ్వులు పూయిస్తాయి.

గంగాలమ్మ జాతర నిర్వహించాలని పెద్దలు నిర్ణయించకునే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే హీరో, హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిన తీరు రొటీన్‌గా ఉంటుంది. మధ్యలో వచ్చే ఫైట్‌ సీన్‌, కోడికి ఎత్తుకెళ్లే సన్నివేశం..అంతా సాగదీతగా అనిపిస్తుంది. చౌడప్ప తన స్నేహితుడిని నరికి చంపిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది.

అయితే ఆ చంపుకునే సన్నివేశమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ఇక చికెన్‌ కోసం రోష రాజు పడే పాట్లు, ఈ నేపథ్యంలో సాగే పాట నవ్వులు పూయిస్తుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే.. చివర్లో వచ్చే ట్విస్ట్‌ మరో ఎత్తు అని చెప్పాలి. అప్పటి వరకు సోసోగా సాగిన కథ, కొన్ని పాత్రలు.. క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. లాజిక్కులు వెతకకుండా చూసేవారికి, విలేజ్‌ నేటివిటీ స్టోరీలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. 

ఎవరెలా చేశారంటే..
కుమార్‌ పాత్రలో రవి మహాదాస్యం చక్కగా ఒదిగిపోయాడు. హీరోగా తనకు ఇది తొలి సినిమా అయినా.. యూట్యూబ్‌ వీడియోలు చేసిన అనుభవాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తెరపై చూడడానికి పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు. ఇక ఆర్‌ఎంపీ కూతురు కృష్ణవేణిగా విషిక తనదైన నటనతో మెప్పించింది. 
 రోషం రాజు పాత్రలో పంతగాని నరసింహ ప్రసాద్ పండించిన కామెడీ బాగుంది. మిలిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక టెక్నికల్ టీమ్స్ విషయానికి వస్తే ముఖ్యంగా సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి అందాలను చక్కగా చూపించారు. సంగీతం విషయానికొస్తే.. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Follow the Sakshi TV channel on WhatsApp

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement