'మీ కూతురితో నాకు పెళ్లి ఒక్కటే కాలేదు..' ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్! | Yendira Ee Panchayithi Trailer Released by Hero Srikanth | Sakshi
Sakshi News home page

Yendira Ee Panchayithi Trailer: 'మీ కూతురితో నాకు పెళ్లి ఒక్కటే కాలేదు..' ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!

Published Mon, Oct 2 2023 5:07 PM | Last Updated on Mon, Oct 2 2023 5:54 PM

Yendira Ee Panchayithi Trailer Released by Hero Srikanth - Sakshi

భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను కూడా చూపించబోతోన్నట్లు తెలుస్తోంది. తాజాగా హీరో శ్రీకాంత్ చేతులు మీదుగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ బాగుంది. కొత్త టీం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా.. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, గ్లింప్స్ ఆడియెన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement