request document
-
పరిహారం ఇవ్వకుండా పనులా..
అక్కన్నపేట(హుస్నాబాద్): గౌరవెల్లి భూ నిర్వాసితులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహించారు. పునరావాస నష్ట పరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభించడం సరికాదని, తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని శుక్రవారం తహసీల్దార్‌కు వినతిప్రతం అందజేశారు. ఈసందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ..ప్రాజెక్టు నిర్మిస్తే పదిమంది బతుకులు బాగుపడుతాయని మా విలువైన పంట భూములిచ్చేశాం. ఊరొదిలి వెళ్లేందుకు అంగీకరించామని ఇంత చేసినా రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పనుల అడ్డగింత.. ఈ సందర్భంగా పునరావాస ప్యాకేజీలు ఇవ్వకుండా పనులు సాగించడంపై నిర్వాసితులు ఆందోళనలకు దిగారు. సుమారు గంటపాటు టిప్పర్ల ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజ్‌లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కొమ్ముల పర్శరాములు, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణకంటి నరేశ్, తహసీల్దార్ తుల రాంచందర్, సీఐ శ్రీనివాస్‌జీ, ఎస్సైలు బానోతు పాపయ్యనాయక్, సుధాకర్, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. -
ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ నేతల అరెస్టు
► సీఎంకు వినతిపత్రం ఇవ్వాలనుకున్న ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు ► మఖ్దూం భవన్లో కమిటీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఇందిరా పార్కువద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేయవద్దని కోరేందుకు సీఎం కేసీఆర్‌ను కలసి వినతి పత్రం ఇవ్వాలనుకున్న ‘ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ’ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. గురువారం ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎంను కలవనున్నామని కమిటీ నేతలు ప్రకటించిన వెంటనే సీపీఎం, సీపీఐ కార్యాలయాల వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తదితరులను ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిని విడుదల చేశాక సీపీఐ కార్యాలయం మఖ్దూం భవన్లో ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరు 10 వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. కోదండ రామ్ మాట్లాడుతూ..ధర్నా చౌక్ ఎత్తివేసినప్పట్నుంచీ ప్రగతి భవన్ ధర్నాభవన్గా మారిందన్నారు. ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ఈ నెల 22న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతామని, ప్రతిపక్ష పార్టీల నేతలనూ ఈ ధర్నాకు ఆహ్వానించామన్నారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం పోలీసులతో అణచివేయిస్తుందన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతుందని, రజకార్ల కంటే అధ్వాన్నంగా ఉందని ఎద్దేవా చేశారు. ధర్నాచౌక్ మార్చడానికి కారణాలు చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే మేధావుల సదస్సులో మేధావులందరినీ ఏకం చేస్తామన్నారు. అనంతరం చాడా మాట్లాడుతూ..ధర్నాచౌక్ పరిరక్షణ కోసం వినతిపత్రం సమర్పించేందుకు కూడా సీఎం అవకాశం ఇవ్వడం లేదన్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తోంది :నారాయణ వామపక్ష పార్టీల నేతల అరెస్టును సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. కార్యాలయాల్లోకే వచ్చి అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలవడమనేది కలలో కూడా తలవద్దనే సందేశాన్ని కేసీఆర్ ప్రభుత్వం పంపుతోందని, ఇది నిరంకుశత్వానికి పరాకాష్ట అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరుగెత్తిన చాడ ధర్నాచౌక్‌ను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ.. సీఎంను కలసి వినతి పత్రం ఇవ్వాల నుకున్న ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మఖ్దూం భవన్ నుంచి కారులో బయటకు వెళ్లేందుకు బయటకు రాగా ప్రధాన గేటు వద్దే పోలీసులు కారుని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే చాడ కారు దిగి పరుగెత్తుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. -
రేషన్ డీలర్ల మౌన ప్రదర్శన
నల్ల బ్యాడ్జీలతో నిరసన సిరిసిల్ల : జిల్లా కేంద్రంలో రేషన్ డీలర్లు బుధవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. డీలర్లు శాంతియుతంగా హైదరాబాద్‌లో ఆమరణ దీక్ష చేస్తుంటే పోలీసులు భగ్నం చేయడం దారుణమని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని, నెలకు రూ.30వేల వేతనం ఇవ్వాలని, హెల్త్‌కార్డులు అందించాలని, బ్యాంకింగ్ కార్పొరేట్ ఏజంట్‌గా గుర్తించాల ని, మరణించిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరి హారం అందించాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నంచేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిమల్ల హన్మయ్య, ప్రధాన కార్యదర్శి వి.వంశీకృష్ణారావు, కోశాధికా రి జిల్లా కృష్ణమూర్తి, వావిలాల ఆనందం, నాయిని రవీందర్, బుర్ర మల్లేశం, శీలం మునిరెడ్డి, వాసాల శ్రీనివాస్, గుడ్ల సుభాష్, ఎం.మహేశ్, ఎం.భూమేశ్, కె.శ్రీనివాస్, విజయ, ఎం.రాజు, లక్ష్మణ్, ఎండీ.బాబు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
► డీపీవోకు చింతల్‌పేట్ గ్రామస్తుల వినతి నిర్మల్‌రూరల్ : ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఖానాపూర్ మండలం బా దన్ కుర్తి పంచాయతీ పరిధిలోని చింతలపేట్ గ్రామస్తులు విన్నవించారు. ఈమేరకు వారు బుధవారం డీపీవో నారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో మూడేళ్లుగా తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వాటర్ ట్యాంక్‌లకు నీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. వెంటనే తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డీపీవోను కోరారు. ఇందులో టీడీపీ మండలాధ్యక్షుడు గుడాల రాజన్న, వార్డ్‌మెంబర్ బండి వెంకటి గ్రామ స్వచ్ఛంద సంస్థ సభ్యులు బైర మధు, ఎర్ర గంగన్న, మాదస్తు నవీన్ పాల్గొన్నారు. -
‘రెవెన్యూ’ సమస్యలు పరిష్కరించండి
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్‌కు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అసోసియేషన్ బృందం గురువారం వినతి పత్రం సమర్పిం చింది. అనంతరం సచివాలయం మీడియా పాయింట్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు 67 రకాల విధులు నిర్వహిస్తున్నా సంక్షేమ పథ కాల అమలులో స్వార్థ రాజకీయాలకు, అసాంఘిక శక్తుల దాడులకు బలైపోతూ ఆర్థికంగా, మానసికంగా అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లుగా పని చేస్తున్న వీఆర్వోలకు పదోన్నతి, ప్రభుత్వ ఖర్చుతో ద్విచక్ర వాహనాలు మంజూరు చేయాలని కోరారు. కొత్త జిల్లా కలెక్టర్‌కు కార్యాలయాలను నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కాందారి బిక్షపతి, ఉపాధ్యక్షుడు ఎస్కే మౌలానా, కోశాధికారి రమేశ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, వీఆర్ఏల అధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి
ఆదిలాబాద్ రూరల్ : మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి జయంతుత్సవాలను ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచైనా అధికారికంగా నిర్వహించేందకు కృషి చేయాలని మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం దస్నాపూర్ కాలనీలో నిర్వహించిన పూలే వర్ధంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి రామన్నకు మాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుకుమార్ పేట్కులే మాట్లాడుతూ 2008 సంవత్సరం నుంచి పూలే వర్ధంతి, జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో అధికారికంగా నిర్వహించలేదన్నారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా చూడాలని కోరారు. గత ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ మాలీ కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చుతామాని హమీ ఇచ్చారని, తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే పూలే దంపతుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్పించేలా కృషి చేయాలని కోరారు. -
ముంపు గ్రామాలను రీసర్వే చేయాలి
మెదక్: ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో పాపన్నపేట మండలంలో ముంపునకు గురయ్యే గ్రామాలపై రీ సర్వే చేయాలని ఘనపురం ఆనకట్ట ముంపు బాధితుల పోరాట కమిటీ బాధితులు శనివారం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం మాట్లాడుతూ మంజీరానదిపై గల ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపువల్ల ముంపునకు గురయ్యే పాపన్నపేట మండలంలోని గ్రామాల్లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పటికీ అందులో చాలా లోపాలున్నాయన్నారు. ముంపునకు గురవుతున్న భూములను సగమే గుర్తించారని ఆరోపించారు. దీనిపై మరోసారి సర్వేచేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి బాలమణి, మండల కార్యదర్శి కె.మల్లేశం బాధిత రైతులు వెంకట్‌గాంధీ, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.