గౌరవెల్లి రిజర్వాయర్ పనులను అడ్డుకున్న ఆందోళనకారులు
అక్కన్నపేట(హుస్నాబాద్): గౌరవెల్లి భూ నిర్వాసితులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహించారు. పునరావాస నష్ట పరిహారం ఇవ్వకుండా పనులు ప్రారంభించడం సరికాదని, తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని శుక్రవారం తహసీల్దార్‌కు వినతిప్రతం అందజేశారు. ఈసందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ..ప్రాజెక్టు నిర్మిస్తే పదిమంది బతుకులు బాగుపడుతాయని మా విలువైన పంట భూములిచ్చేశాం. ఊరొదిలి వెళ్లేందుకు అంగీకరించామని ఇంత చేసినా రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పనుల అడ్డగింత..
ఈ సందర్భంగా పునరావాస ప్యాకేజీలు ఇవ్వకుండా పనులు సాగించడంపై నిర్వాసితులు ఆందోళనలకు దిగారు. సుమారు గంటపాటు టిప్పర్ల ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్‌లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పరిహారం ఇవ్వకుండా పనులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ కొమ్ముల పర్శరాములు, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణకంటి నరేశ్, తహసీల్దార్ తుల రాంచందర్, సీఐ శ్రీనివాస్‌జీ, ఎస్సైలు బానోతు పాపయ్యనాయక్, సుధాకర్, భూ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment