వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి
ఆదిలాబాద్ రూరల్ : మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి జయంతుత్సవాలను ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచైనా అధికారికంగా నిర్వహించేందకు కృషి చేయాలని మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం దస్నాపూర్ కాలనీలో నిర్వహించిన పూలే వర్ధంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి రామన్నకు మాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుకుమార్ పేట్కులే మాట్లాడుతూ 2008 సంవత్సరం నుంచి పూలే వర్ధంతి, జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో అధికారికంగా నిర్వహించలేదన్నారు.
ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా చూడాలని కోరారు. గత ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ మాలీ కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చుతామాని హమీ ఇచ్చారని, తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే పూలే దంపతుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్పించేలా కృషి చేయాలని కోరారు.