బాధ్యత మరవొద్దు..లక్ష్యాలను వీడొద్దు
ప్రతి మొక్కకూ బాధ్యుడు
♦ నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు
♦ 3.64 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
♦ అటవీశాఖ మంత్రి జోగు రామన్న
♦ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం
సంగారెడ్డి మున్సిపాలిటీ : విద్యారంగ సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి సూచించారు. మంగళవారం విద్యారంగ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తామన్నా అభ్యర్థులు ముందుకు రావడం లేదని ఆర్ఐఓ కిషన్ విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దృష్టికి తెచ్చారు. దీనిపై ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ జిల్లాలో చాలామంది ఎమ్మెస్సీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారని, నోటిఫికేషన్ వేయనందునే భర్తీ కావడంలేదన్నారు.
దీంతో పాటే ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటారన్నారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఐఓ ఇప్పటి వరకు జిల్లాలోని ఏ ఒక్క కళాశాలనైనా పరిశీలించారా అని ప్రశ్నించారు. అందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. జోగిపేట జూనియర్ కళాశాలలో ఏడు సంవత్సరాలుగా విద్యార్థులు చెట్ల కిందే చదువుకుంటున్నారని, పలు మార్లు ఆర్‌ఎంఎస్‌ఏ ఈఈతోపాటు మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పనులు పూర్తి చేయలేదన్నారు. తన విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అదనంగా రూ. 1.50 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ విలువైన స్థలం ఉన్నందున, ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రహరీ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆరో తరగతిలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరినా అధికారులు ప్రభుత్వ అనుమతి లేదని చెబుతున్నారన్నారు. దీంతో మంత్రి కడియం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని డీఈఓను ఆదేశించారు.
శిథిలావస్థకు చేరిన పాఠశాలల భవనాలను కూల్చివేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, బాబూ మోహన్ మంత్రిని కోరగా, కలెక్టర్‌తో చర్చించి పాత భవనాలను కూల్చివేసేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీ చేస్తామని హామీ ఇచ్చారు. సమీక్ష సమావేశంలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ వాణీప్రసాద్, పాఠశాలల డెరైక్టర్ కిషన్‌తోపాటు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు, జేసీ వెంకట్రాంరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి తదితరులు పాల్గొన్నారు.