సిటీబ్యూరోః గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ చౌకధరల దుకాణాల నిర్వహణ అస్థవ్యస్తంగా తయారైంది. పలు దుకాణాలను అథికృత డీలర్లకు బదులు బినామీలు నిర్వహిస్తున్నట్లు బయటపడటంతో పౌరసరఫరాల శాఖ కన్నెర్ర చేసింది. సోమవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అదేశాల మేరకు సంబంధిత అధికారులు సర్కిల్ వారిగా బినామీ షాపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ -రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల శాఖ పరిధిలో సుమారు 2252 పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. మొత్తం దుకాణాల్లో కనీసం 20 శాతం రేషన్ షాపుల అథికృత డీలర్‌కు బదులు మరొకరి నిర్వహణలో కొనసాగుతుండటంతో అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మరో 15 శాతం రేషన్ షాపుల డీలర్లు చనిపోవడం, సస్పెండ్ వంటి కారణాలతో ఇన్‌చార్జీల నిర్వహణలో కొనసాగుతున్నారు.
400 షాపులపైనే..
జంట జిల్లాల్లో సుమారు 20.28 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా. అందులో సుమారు 67.42 లక్షల మంది లబ్థిదారులు ఉన్నారు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా. ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపింణీ జరుగుతుంది. ఈ లెక్కన ప్రతి నెల పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం కోటా విడుదలవుతోంది. మొత్తం దుకాణాల్లో సుమారు 400పైగా బినామీల నిర్వహణలో ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. దీంతో సోమవారం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో సర్కిల్ వారిగా బినామీ నిర్వహణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రేటర్‌లో బినామీ రేషన్ డీలర్ల దందా
Published Mon, May 25 2015 9:27 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement
Advertisement