
గ్రేటర్ హైదరాబాద్‌లో సమాజ్‌వాదీ పార్టీ బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడాలని ఏపీ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు పాశం వెంకటేష్ సూచించారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీ నేత, సామాజిక కార్యకర్త దండుబోయిన కళ్యాణ్ యాదవ్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు మదిరె నర్సింగ్‌రావుతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పార్టీలో చేరిన నేతలు వారి వారి ప్రాంతాల్లో శ్రేణులను ఐక్యం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని తీర్మానించారు.
త్వరలోనే సమాజ్‌వాదీపార్టీ జాతీయ అద్యక్షుడు అఖిలేష్ యాదవ్ సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో కమిటీలు వేస్తామని పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదును నిర్వహిస్తామని తెలిపారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో యూపీలో ఏ విధంగా అయితే సమాజ్‌వాదీ విజయం సాధించిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహా ఫలితాలు రాబట్టి యూపీలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment