సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం కూడా సీఎం కెసిఆర్ పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్యులు సూచించినట్టు తెలిసింది.
గజ్వేల్ వేడేక్కిన రాజకీయం
ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ఇప్పటికే గజ్వేల్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకరు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే మరొకరు బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రకటించారు. వీరిద్దరు కూడా గజ్వేల్ లో సీఎం కెసిఆర్ పై పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనితో సంబంధం లేకుండా.. కెసిఆర్ మరో నియోజకవర్గం కూడా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
ఉత్తర తెలంగాణపై కామారెడ్డి ఎఫెక్ట్
కామారెడ్డి ఓ రకంగా భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉంది. ఉత్తర తెలంగాణలో పార్టీకి ఉన్న ఊపు కొనసాగాలంటే కామారెడ్డి నుంచి పోటీ చేయడం సరైన నిర్ణయం అని భావించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ విజయం సాధించారు.
కామారెడ్డిలో పోటీపై కాంగ్రెస్ విమర్శలు
కామారెడ్డిలో పోటీ చేయాలన్న సీఎం కెసిఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. గజ్వేల్ లో ఓడిపోతననే భయంతోనే కామారెడ్డి వస్తున్నట్లు తెలుస్తోంది, కామారెడ్డిలో ఎవరు పోటీ చేసినా నేనే గెలుస్తానని షబ్బీర్ అలీ తెలిపారు.
వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగు నీరు వచ్చేదని, సాగు నీరు కామారెడ్డి లో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారో చెప్పి కేసీఆర్ నామినేషన్ వేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment