BRS MLA Candidates List 2023
-
అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం..
సాక్షి, యాదాద్రి: మాజీ మంత్రి,సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ తొలి జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలనుకున్న మోత్కుపల్లికి అవకాశం దక్కకపోవడంతో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. గురువారం యాదగిరిగుట్టలో తన అనుచరులతో సమావేశం అవుతున్నారు. అవమానంగా భావించి దళితబంధు పథకం ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ మోత్కుపల్లి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆరు నెలలుగా కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తున్నారు. టికెట్లు ప్రకటించే సమయంలోనైనా సిట్టింగులకే ఇ స్తున్నామని మాట వరుసకైనా చెప్పలేదన్న ఆవేదన ఆయనలో ఉందని అనుచరులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే నకిరేకల్ టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. చదవండి: అసంతృప్తులకు గాలం నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు: వైరా: ‘నేను నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు. నాకు టికెట్ రాకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు బరువెక్కిన హృదయంతో ఉన్నారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా’అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. బుధవారం ఆయన వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని, అయితే వృద్ధాప్యంలో ఉన్నందున వద్దన్నానని తెలిపారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, అందరితో కలిసి పని చేస్తానని, వైరా టికెట్ కేటాయించిన మదన్‌లాల్ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ భగవంతుడి కంటే ఎక్కువని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని చెప్పారు. చీకటి తర్వాత వెలుగు వస్తుందంటూ కేసీఆర్ ఆశీర్వాదం ఎప్పటికైనా తనకు లభిస్తుందని దీమా వ్యక్తం చేశారు. -
గల్లంతైన ఎమ్మెల్యే ఆశలు.. హెల్త్ డైరెక్టర్ అడుగులు ఎటువైపు?
కొత్తగూడెం బీఆర్ఏస్ ఎమ్మెల్యే టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు ఆశలు గల్లంతయ్యాయి. టికెట్ ఆశించి భంగపాటే మిగిలింది. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసిన వర్క్ అవుట్ కాలేదన్న భావనలో ఉన్నారు గడల. ఎమ్మెల్యే చాన్స్ చేజారడటంతో గడల సైలెంట్ అయిపోతారా? లేక వేరే దారి చూసుకుంటారా? గడల పొలిటికల్ రూట్ మ్యాప్ ఏవిధంగా ఉండబోతుంది? ఒక్కరోజు ముందు కూడా హడావిడి బీఆర్ఏస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ రావు నిరాశే మిగిలింది. టికెట్‌పై ఏన్నో ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ దీవెనెలు సైతం తనకే ఉంటాయన్నారు. బీఆర్ఏస్ అభ్యర్థుల ప్రకటనకు ఒక్క రోజు ముందు కూడ కొత్తగూడెంలో హడావుడి చేశారు. కొత్త కొత్తగూడెం నినాదంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో పాదయాత్ర ప్రారంభించారు. రాజకీయం అంటేనే సేవ.. కట్ చేస్తే! 23 వ వార్డులోని అమ్మవారి ఆలయంలో పూజ నిర్వహించి జీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులతో కలిసి గడప గడపకి పాదయాత్ర చేపట్టారు. గడప గడపకు వెళ్తూ అడపడుచులకు పసుపు-కుంకుమ, గాజులు, కరపత్రంతో కలిగిన ప్యాకెట్ ఇస్తూ వార్డులో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై డాక్టర్ గడల శ్రీనివాస రావు స్పందిస్తూ రాజకీయం అంటేనే సేవ అని, కొత్తగూడెంలో ప్రజలకు సేవ చేయటం తన కర్తవ్యంగా భావిస్తున్నానన్నారు. ఇంటింటికీ పాదయాత్ర భారీ ఆర్భాటంతో చేపట్టడంతో అధికార బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలోనూ పెద్ద చర్చకే దారి తీసింది. సీన్ కట్ చేస్తే.. హెల్త్ డైరెక్టర్‌గానే కొనసాగుతారా? లేక మరుసటి రోజే బీఆర్ఏస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో కొత్తగూడెం టికెట్ సిట్టింగ్ ఏమ్మేల్యే వనమా వెంకటేశ్వర్ రావుకే దక్కింది. దీంతో గడల ఆశలు గల్లంతై పోయాయని కొత్తగూడెం నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తుంది. టికెట్ దక్కకపోవడంతో గడల కార్యచరణ ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ నడుస్తుంది. హెల్త్ డైరెక్టర్ గానే కోనసాగుతారా? లేక వేరే దారి చూసుకుంటారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. చదవండి: కరీంనగర్: బీఆర్ఎస్కు షాక్.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రాజీనామా వేరే పార్టీలోకి! ఒకవేళ వేరే పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకునే అవకాశం ఉంటే.. హెల్త్ డైరెక్టర్ పదవి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పట్లో వర్క్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో సైలెంట్‌గా ఉండే వచ్చేసారి ఏమైనా గుర్తించండి అని కేసీఆర్ నుంచి హమీ తీసుకొని తన పని చేసుకుంటారా అన్న చర్చ నడుస్తుంది. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా.. తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు సొంత ప్రాంతమైన కొత్తగూడెంలో కొన్ని నెలలుగా జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కేవలం వికెండ్‌లో మాత్రమే ఉంటాయి. అయితే గడల వ్యవహరంపై గతంలో ప్రతిపక్షాలు తీవ్రస్తాయిలో పైర్ అయ్యాయి. హెల్త్ డైరెక్టర్‌గా ఉండి రాజకీయాలు చేయడం ఏంతవరకు సబబని నిలదిశాయి. అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలను సైతం గడల పెద్దగా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటు వెళ్లారు. చేయాల్సిన ప్రయత్నాలు చేసినా.. చివరికి భంగపాటే జీఎస్ఆర్ ట్రస్ట్ పేరుతో గడల కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచి అనేక వివాదాలు గడల చుట్టు తిరుగుతూ వచ్చాయి. ఓ ఏంపీపీ ఇంట్లో మిరపకాయ పూజలు చేయడం, అనేక కార్యక్రమాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పెద్ద దూమారమే రేపాయి. అంతేకాదు ప్రగతి భవన్లో నిమిషం వ్యవధిలో రెండు సార్లు సీఏం కేసీఆర్ కాళ్లు మొక్కడంపై సైతం ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఇలా నిత్యం వివాదాల్లోనే ఉంటు వచ్చారు గడల.. ఇవన్నీ పక్కన పెట్టి కొత్తగూడెం టికెట్ కోసం చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసినా చివరకు భంగపాటే మిగిలిందన్న భావనలో ఉన్నారు గడల శ్రీనివాస్ రావు.. మరి హెల్త్ డైరెక్టర్ పొలిటికల్ ఎంట్రీ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. -
కేసీఆర్ వ్యూహం.. ఇది ప్రత్యర్దులకు రాజకీయ సవాల్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోసారి సాహసోపేతంగా ప్రత్యర్దులకు రాజకీయ సవాల్ విసిరారు. ఈసారి ఎలాగైనా అధికారం సాధించాలని ఆశిస్తూ, వ్యూహరచన చేస్తున్న కాంగ్రెస్‌కు, అలాగే గట్టి పోటీ ఇవ్వాలని సంకల్పించిన బీజేపీకి ఒక రకంగా షాక్ ఇచ్చే విధంగా అభ్యర్దుల జాబితాను ప్రకటించారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 115 నియోజకవర్గాలకు టికెట్లు ఇచ్చేశారు. దీంతో పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్ధులకు ఒక భరోసా ఇచ్చినట్లయింది. విశ్వాసమా? బలహీనతా! బహుశా ఈ జాబితాలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మహా అయితే పరిస్థితిని బట్టి, సర్వేలను బట్టి ఎక్కడైనా రెండు, మూడు చోట్ల అభ్యర్ధులను మార్చితే మార్చవచ్చు. ఉదాహరణకు మంత్రి హరీష్ రావుపై ఘాటైన ఆరోపణలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ ప్రకటించినా, దానిని ఖరారు చేస్తారా అన్న డౌట్ ఉంది. ఆయన తన కుమారుడికి మెదక్ టిక్కెట్ అడుగుతుండడం విశేషం. కొన్ని విశ్లేషణలలో ఈ రకంగా కేసీఆర్ దాదాపు పూర్తి స్థాయిలో సీట్లు ప్రకటించడం విశ్వాసమా?బలహీనతా అన్న చర్చకు ఆస్కారం ఇచ్చినా, ఆయనకు ఉన్న సర్వేల సమాచారంతోనే ఇలా చేసి ఉండవచ్చు. లేదా ఎవరినైనా మార్చవలసివస్తే అది తన చేతిలోనే ఉంటుంది కదా అన్న ధీమా కావచ్చు. అందుకే అవసరమైతే మార్చుతామని షరతు పెట్టి జాబితాను ప్రకటించారు. టికెట్లురాని వారిలో ఐదుగురు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే సమయంలో మరికొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు ఉన్నా,వారికి టికెట్లుఇవ్వడంపై విమర్శలు ఉన్నాయి. దళిత బందు వంటి స్కీంలో పలువురు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన గతంలో విమర్శించినా, ఆ పాయింట్ ఆధారంగా టిక్కెట్లను నిరాకరించడం జరిగినట్లు లేదు. చదవండి: నర్సాపూర్‌లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ కేవలం ఏడుగురికే టికెట్లు నిరాకరణ 108 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. తొమ్మిది ఏళ్ల పాలన తర్వాత ఇంత ధైర్యంగా కేసీఆర్ టికెట్లు ఇవ్వడం ఆయనలోని ఆత్మ విశ్వాసాన్ని తెలియ చేస్తుంది. ఈసారి ఎన్నిక కేసీఆర్‌పాలన కావాలా?వద్దా అన్నదానిపైనే జరుగుతుందని, ఎమ్మెల్యేల పాత్ర అంతగా ఉండకపోవచ్చన్నది ఒక అంచనా కావచ్చు. సాధారణంగా రెండు టర్మ్‌లు పూర్తి అయ్యాక కొంత ఎక్కువ సంఖ్యలో సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చుతుంటారు. ఒక్కోసారి అది మూడో వంతు కావచ్చు. రెండో వంతు కావచ్చు. కాని కేసీఆర్ కేవలం ఏడుగురికే టికెట్లునిరాకరించారు. గంపా గోవర్దన్‌ను మార్చినట్లు అనుకోనవసరం లేదు అందులో ఒక చోట కామారెడ్డిలో తానే పోటీలో దిగుతున్నందున అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్దన్‌ను మార్చినట్లు అనుకోనవసరం లేదు. కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీకి తలపడుతున్నారు. దీనిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటెల రాజేందర్లు ఓటమి భయంతోనే అని కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తున్నా, సీఎం హోదాలో ఉన్న ఆయనకు ఆ సందేహం ఉంటుందని అనుకోజాలం. ఆయన తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా రెండు సీట్లలో పోటీచేస్తున్నారు. కాకపోతే గతంలో రెండుసార్లు అసెంబ్లీకి, లోక్‌సభ కలిపి పోటీచేశారు. చదవండి: Jangaon: ‘పల్లా’కు టికెట్ ఇస్తే అగ్నిగుండమే..! కరీంనగర్ నుంచి లోక్‌సభకు గెలిచి కేంద్ర మంత్రి ఇంతవరకు 1985, 1989, 1994, 1999 లలో టీడీపీ పక్షాన , 2001,2004,2014,2019 లలో టీఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాధించారు. ఈసారి పేరు మారిన బీఆర్ఎస్ పక్షాన నిలబడుతున్నారు. 2004, 2014లలో ఆయన అసెంబ్లీతో పాటు లోక్‌సభకు కూడా పోటీచేశారు. 2004లో కరీంనగర్ నుంచి లోక్‌సభకు గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. తదుపరి రెండుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో గెలుపొంది ఒక రికార్డు నెలకొల్పారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి లోక్‌సభకు గెలిచారు. 2014లో గజ్వేల్ తో పాటు మెదక్ నుంచి లోక్‌సభకు విజయం సాదించి, ముఖ్యమంత్రి బాద్యత తీసుకున్న తర్వాత లోక్‌సభకు రాజీనామా చేశారు. 8 సార్లు గెలిచిన రికార్డు కేసీఆర్ సొంతం తెలంగాణలో ఎనిమిది సార్లు అసెంబ్లీకి గెలిచిన రికార్డు కేసీఆర్ సొంతం. ఆరుసార్లు సిద్దిపేట నుంచి రెండుసార్లు గజ్వేల్ నుంచి విజయం సాదించారు. ఈసారి గెలిస్తే తొమ్మిదో సారి గెలిచినట్ల అవుతుంది. అలాగే తెలంగాణ నుంచి రెండుచోట్ల గెలిచిన నేతగా కూడా నమోదు అవుతారు. గతంలో ఎన్టీఆర్. 1983లో రెండు చోట్ల, 1985లో మూడు చోట్ల పోటీచేసి విజయం సాదించారు. 1989లో రెండుచోట్ల పోటీచేసి ఒక చోట ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి 1994లో రెండు చోట్ల పోటీచేసి గెలిచారు. అంటే నాలుగు ఎన్నికలలో తొమ్మిది చోట్ల పోటీచేసి ఎనిమిది స్థానాలలో గెలిచారన్నమాట. పోచారం శ్రీనివాసరెడ్డి వైపే కేసీఆర్ మొగ్గు కేసీఆర్1983లో మాత్రం ఓటమి చెందినా, ఆ తర్వాత ఆయనకు అపజయం అన్నది లేదు. 2004లో సిద్దిపేట నుంచి గెలిచి రాజీనామా చేసిన తర్వాత ఆయన మేనల్లుడు తన్నీరు హరీష్‌రావుకు ఆ సీటు కేటాయించారు.కేసీఆర్ కుమారుడు, మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి సిరిసిల్ల నుంచి రంగంలో దిగుతున్నారు. ఆయన ఒక ఉప ఎన్నికతో సహా ఐదోసారి పోటీలో ఉంటున్నారన్నమాట. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మళ్లీ బాన్సువాడ నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు. ఆయన కుమారుడికి ఈసారి టిక్కెట్ ఇస్తారని అనుకున్నా, కేసీఆర్‌మాత్రం ఈయన వైపే మొగ్గు చూపారు. ఏడోసారి ఎన్నికల బరిలో హరీష్ రావు పోచారం ఏడోసారి ఎన్నికల గోదాలో నిలబడుతున్నారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి ఏడోసారి ఎన్నికల బరిలో ఉంటున్నారు. హరీష్ రావు మూడు ఉప ఎన్నికలలో గెలవడం ఒక ప్రత్యేకత. 2004లో ఉప ఎన్నిక ద్వారా శాసనసభలో ప్రవేశించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2008, 2011 లలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి గెలిచారు. ఆరోసారి తలసాని మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆరోసారి పోటీలో ఉంటున్నారు. ఇక మూడోసారి, నాలుగోసారి పోటీచేసేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. టికెట్లురానివారిలో డాక్టర్ టి.రాజయ్య ఉన్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాద్యతలు కొంతకాలం నిర్వహించినా, అనతికాలంలోనే పదవి పోగొట్టుకున్నారు. పెండింగ్‌లో జనగామ కాంగ్రెస్‌కు,ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లోకి వచ్చిన రాజయ్య నాలుగుసార్లు గెలిచినా, ఈసారి టిక్కెట్ పొందలేకపోయారు. ఆయన ఒక మహిళతో వివాదంలో చిక్కుకోవడం టికెట్ రాకపోవడానికి కారణమయి ఉంటుందని భావిస్తున్నారు. దేశ పౌరసత్వ వివాదంతోనే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నమనేని రమేష్ ఈసారి టికెట్ సాధించలేకపోయారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉన్న వ్యతిరేకత రీత్యా టికెట్ ఇవ్వలేదు. ఈ మధ్యకాలంలో పార్టీలో గొడవ జరుగుతున్న జనగామ సీటును పెండింగ్‌లో ఉంచారు. కేసీఆర్ తన మంత్రివర్గ సభ్యులందరికి టికెట్లు ఇచ్చేశారు. వివాదాలున్న మళ్లీ ఆయనకే టికెట్ ఇటీవలి కాలంలో ఆయా చోట్ల ఎమ్మెల్యేలకు కొందరు పోటీ అభ్యర్ధులు సిద్దమైనా, వారిని పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై కాన్ఫిడెన్స్ అయి ఉండాలి, లేదా తన నాయకత్వంపై విశ్వాసంతోనే ప్రజలు అబ్యర్దిని పట్టించుకోకుండా ఓట్లు వేస్తారని అనుకుని ఉండవచ్చు. ఉదాహరణకు బెల్లంపల్లి ఎమ్మెల్యేపై కొన్ని ఆరోపణలు వచ్చినా కేసీఆర్ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చేశారు. అలాగే బీజేపీ కొనుగోలుకు ప్రయత్నించినట్లు ప్రచారంలోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలకు తిరిగి బీఆర్ఎస్ టికెట్లు లభించాయి. ముందుగా ప్రకటన వల్ల అభ్యర్ధులు తమపై ప్రజలలో ఏదైనా నెగిటివ్ ఉంటే పోగొట్టుకునే యత్నం చేయవచ్చు. మంత్రి వర్గంలోకి పట్నం లేదా మరీ ఎక్కువ వ్యతిరేకత ఉందనుకుంటే కాండిడేట్‌ను మార్చవచ్చు. అయితే అదే సమయంలో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీలవైపు చూడవచ్చు. కాగా తాండూరు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఆయనను బుజ్జగిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఎన్నికల రాజకీయాలలో ఇలాంటివి తప్పవు. బీఆర్ఎస్ ఈ స్థాయిలో టికెట్లు ఇచ్చేస్తుందని కాంగ్రెస్, బీజేపీలు ఊహించి ఉండకపోవచ్చు.గతంలో ఇంత ముందుగా కాదు కానీ, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రధాన నాయకుడిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో 290 సీట్లకు ఓకే సారి టిక్కెట్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. రేవంత్ గట్టి ప్రయత్నం ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి కాంగ్రెస్‌కు ఉంటుందని ఇప్పటికైతే చెప్పజాలం. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. నిజానికి గ్రామాలలో ప్రభుత్వంపై కొంత నెగిటివ్ ఉందని అంటారు. కాని ఇటీవల లక్ష రూపాయలలోపు రైతుల రుణాల మాఫీ, పలు సంక్షేమ పథకాల అమలు ద్వారా దానిని కొంత తగ్గించే యత్నాన్ని కేసీఆర్ చేశారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇంకోవైపు పార్టీని దూకుడుగా ముందుకు తీసుకు వెళ్లడానికి కేసీఆర్ వ్యూహరచన చేసినట్లుగా ఉంది. కసరత్తులోనే బీజేపీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించేవారి దరఖాస్తులను కోరింది. బీజేపీ ఇంకా కసరత్తులోనే ఉంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్లు పొందినవారికి ధీటైన్ అభ్యర్థులను వెతకవలసి ఉంటుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు వెళ్లడానికి చాలా సమయం దొరుకుతుంది. కాకపోతే కొంత అధిక ఖర్చు అవుతుంది. అదే సమయంలో ప్రత్యర్ది పార్టీలకు వీరికి పోటీ ఇవ్వగల నేతలను వెతుక్కోవడం కూడా సులువు కావచ్చు. బీఆర్ఎస్లో టికెట్లుదొరకని వారు కాంగ్రెస్,బీజేపీలవైపు చూడవచ్చు.అయితే ఇప్పటికే కాంగ్రెస్‌లో గ్రూపులు అధికంగా ఉన్న పరిస్థితిలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి ఎంత మేర అవకాశం ఇస్తారన్నది చెప్పలేం. అయితే బీజేపీ ఇలాంటి వారిని ఆకర్షించవచ్చు. ఏది ఏమైనా కేసీఆర్వేసిన ఈ వ్యూహానికి కాంగ్రెస్,బీజేపీలు కాస్త విలవిలలాడతాయన్న అభిప్రాయం లేకపోలేదు. --కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
కామారెడ్డి నుంచే కేసీఆర్ పతనం: షబ్బీర్ అలీ
న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుంచే మొదలవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సీఎం పోటీ చేసినా.. ఎవరు పోటీ చేసినా కామారెడ్డి అంటే షబ్బీర్ అని పేర్కొన్నారు. నేను కామారెడ్డి బిడ్డను, ఆశీర్వదించండి అని అడుగుతానన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గెలిస్తే ఫామ్‌హౌస్‌కు వెళ్తారు.. నేను గెలిస్తే ప్రజల్లో ఉంటానని తెలిపారు. సంబంధిత వార్త: KCR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అభ్యర్థుల ప్రకటనపై కేసీఆర్ ముందే కూశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతోనే లిస్ట్ అనౌన్స్ చేశారని విమర్శించారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ మరోచోటికి వెళ్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్లో కేసీఆర్‌కే దిక్కు లేకుండా పోయిందని, ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు. పీపుల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చిందని తెలిపారు. సీఎల్పీ లీడర్‌గా పీపుల్స్ మార్చ్ చేశాక నేడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు చెప్పారు. పాదయాత్ర అనుభవాలు, రాష్ట్ర రాజకీయాల గురించి ఖర్గేతో చర్చించినట్లు తెలిపారు. ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చదవండి: మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్.. -
మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. మంత్రిపై మైనంపల్లి వ్యాఖ్యలు సరికాదని, తామంతా హారీష్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించారనే ఆవేశంతో మన ఎమ్మెల్యే ఒకరు హరీష్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తున్నా అంతేగాక మేమంతా హరీష్ రావుకు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నాను. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఆయన పార్టీకి మూలస్తంభంగా కొనసాగుతున్నారు.’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ కవిత సైతం మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.‘తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు నిబద్ధత,BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు. చదవండి: మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్ తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీష్ రావు గారి నిబద్ధత మరియు BRS పార్టీకి, ప్రజలకు వారు చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. హరీష్ రావు గారి పై చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. — Kavitha Kalvakuntla (@RaoKavitha) August 21, 2023 One of our MLAs who was denied a ticket to his family member in an outburst has made some derogatory comments on Minister Harish Rao Garu I not only strongly condemn the MLA’s behaviour and also want to make it clear that we all stand with @BRSHarish Garu He has been an… — KTR (@KTRBRS) August 21, 2023 మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ లభించిన వారందరికీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అదే విధంగా సిరిసిల్ల అభ్యర్థిగా తనకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాజీవిత ప్రయాణంలో నిరాశను ఒక అడుగుగా భావించి ముందుకుసాగాలని టికెట్ లభించని వారిని ఉద్ధేశిస్తూ పేర్కొన్నారు. చాలా సామర్థ్యం, అర్హత ఉన్న కే.కృష్ణ (కంటోన్మెంట్ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తి) లాంటి కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం. ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం దక్కని వారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తప్పక లభిస్తుంది’ అని కేటీఆర్ అన్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఉద్వాసన ఎవరికో? -
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఉద్వాసన ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. మొత్తం 119 స్థానాలకు గానూ ఒకే విడతలో 115 మందితో కూడిన తొలి విడత అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. వీరిలో తొమ్మిదిమంది సిట్టింగ్‌లకు హ్యండ్ ఇచ్చారు. మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో భారీ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో తెలంగాణ కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుధవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరణ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈటల స్థానంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి కేబినెట్లో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కామారెడ్డి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో టికెట్ కోల్పోయిన స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ను కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. చదవండి: 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో మంత్రి వర్గంలో 18 మందికి ఛాన్స్ ఉంది. ఎన్నికల వేళ అసంతృప్తితో రగలిపోతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోనున్నారు. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ ప్రకటించారు. అదే స్థానాన్ని కోరుకున్న మహేందర్ రెడ్డిని ఏదోవిధంగా సర్ధుబాటు చేయాలని భావించారు. బుధవారం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో 2014 తెలంగాణ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన సబితారెడ్డి.. కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్ప్ దక్కించుకోవడంతో… మహేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకదశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ముందు సడెన్ గా పట్నంకు కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. ఇక గంపా గోవర్ధన్ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరిని తీసుకోవాలంటే ఎవరో ఒకరికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం కెసిఆర్ మంత్రి వర్గంలో ముగ్గురు (సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి) రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే .. సమీకరణాలు మారుతాయి కాబట్టి ఓ రెడ్డి మంత్రిని తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మూడు నెలలే ఉంది కాబట్టి ఒకరిని బుజ్జగించి మంత్రి పదవి నుంచి తప్పుకోమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాబట్టి అదే జిల్లాకు చెందిన సబితాకు నచ్చజెపుతారా అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరికి ఉధ్వాసన పలుకనున్నారు? లేదా కేవలం మహేందర్ రెడ్డి వరకే పరిమితం చేసి విస్తరణ చేస్తారా అనేది తెలియాల్సి ఉండాలి. కేబినెట్ విస్తరణపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పాండిచ్చేరి నుంచి ఈ రాత్రికి గవర్నర్ హైదరాబాద్ రానున్నారు. -
‘కమ్యూనిస్టు పార్టీని కేసీఆర్ కరివేపాకులా పడేశారు’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూసి కాంగ్రెస్గెలుపు ఖాయమనే నమ్మకం తెలంగాణ ప్రజలకు కలిగిందని కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం అంటే.. తన ఓటమిని అంగీకరించినట్లే. ఓటమి భయం ఉన్న కేసీఆర్ కచ్చితంగా ఓడిపోతారు. మధ్యాహ్నం 12.08కి అభ్యర్థులను ప్రకటిస్తామని ముందుగా చెప్పారు. కానీ, ఆ టైంకి లిక్కర్ టెండర్ల డ్రా తీశారు. మహిళల టికెట్ల విషయంలో ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చి మాట్లాడాలి. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో దోస్తానా చేసుకుని.. ఇప్పుడు కరివేపాకులా కమ్యూనిస్టు పార్టీలను వాడుకొని పారేశారు. మోసం చేసిన కమ్యూనిష్టులు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయాలి. తెలంగాణ కోసం అత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లిని కేసీఆర్ అవమానించారు అని రేవంత్ మండిపడ్డారు. 12,500 గ్రామ పంచాయతీలకు విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్, మెట్రో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బినామీల భూముల విలువ పెంచడానికే ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో వేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు రేవంత్. నాడు వైఎస్ హయాంలో హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి గా షబ్బీర్ ఆలీ సేవలు అందించారు. మైనార్టీ నాయకుడిని ఓడించాలనే కేసీఆర్ కామారెడ్డి లో పోటీ చేస్తున్నారు. ఉచిత విద్యుత్ అంటే నాడు కొందరు బట్టలు అరేసుకోవాలని వెటకారం చేశారు. తెలంగాణ కాడి కేసీఆర్ కింద పడేస్తేనే జానారెడ్డి, కోదండ రామ్ కలిసి JAC ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ హయంలోనే చాలా ప్రాజెక్టులు పూర్తి చేశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ ఎం చేసిందో కేసీఆర్ చర్చకు వస్తే చెప్పడానికి సిద్దంగా ఉన్నా అంటూ ప్రతిసవాల్ విసిరారు రేవంత్. రెండు పంటలకు మాత్రమే రైతు బంధు ఎందుకు ఇస్తున్నారు. మూడో పంటకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదు. పేదలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం.. కేసీఆర్ గోడ మీద రాసి పెట్టుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ అగ్రిమెంట్ చేసుకున్నా.. వారంలోపే విదేశాలకు వెళ్తారు. ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంచబోము అని యదాద్రి, నాంపల్లి దర్గా, మెదక్ చర్చిలో ప్రమాణం చేయడానికి సిద్దమా ! అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరిన రేవంత్.. పార్టీ ఆదేశిస్తే, కార్యకర్తలు కోరితే నేను ఎక్కడైనా పోటీచేస్తానని ప్రకటించారు. ఇదీ చదవండి: అధిష్టానం చెప్పింది అందుకే కామారెడ్డిల పోటీ- కేసీఆర్ -
BRS List: వివాదాలున్నా... వాళ్లకే టికెట్లు
సాక్షి, హైదరాబాద్: విజయంపై పూర్తి ధీమాతో ఉన్నామని, అందుకే ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులకు ప్రకటిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. అలాగే తమది క్రమశిక్షణ ఉన్న పార్టీ అని, పూర్తి స్థాయి వడపోత తర్వాత అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారాయన. అందుకే కేవలం.. ఏడు మార్పులు మాత్రమే చేసినట్లు హైలెట్ చేశారు. అయితే.. చెన్నమనేని లాంటి ఉత్తముడికి పౌరసత్వ వివాదం కారణంగా సీటు కేటాయించలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు మాత్రం గట్టి షాకే ఇచ్చారు. ఒకవైపు మహిళా సర్పంచ్ ఆరోపణలు, మరోవైపు కడియంతో పొసగక పోవడం.. చివరకు పిలిపించుకుని అధిష్టానం మందలించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. దీంతో.. ఆయన స్థానంలో అంతే దూకుడుగా ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్న కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చింది. అయితే.. ఏకంగా లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. శేజల్ అనే బాధితురాలు వరుసగా చిన్నయ్యపై ఆరోపణలు చేయడం, ఏకంగా ఆత్మహత్యకు యత్నించడం, ఢిల్లీకి చేరి చిన్నయ్యపై వేటు వేయాలంటూ బీఆర్ఎస్ అధినేతకు సైతం విజ్ఞప్తి చేస్తూ రకరకాల రూపాల్లో నిరసనలు కొనసాగించింది. అయినా కూడా దుర్గయ్యకే మరో అవకాశం ఇచ్చారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా విషయంలోనూ అలాగే జరిగింది. పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు ఏకంగా అరెస్ట్ అయ్యాడు. ఈ వివాదం ఆధారంగా ప్రతిపక్షాలు ఎమ్మెల్యేపై పలు ఆరోపణలతో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి కూడా. మరోవైపు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు ఏకంగా హైకోర్టు ఆయన ఎమ్మెల్యే ఎన్నికపై అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది కూడా. అయినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం వనమాకే మళ్లీ టికెట్ కేటాయించడం గమనార్హం. వీళ్లతో పాటు చిన్న చిన్న వివాదల్లో నిలిచిన మరికొందరికి.. పెద్ద కంప్లయింట్లాగా పరిగణించకుండానే అసెంబ్లీ టికెట్ తిరిగి కేటాయించడం గమనార్హం. మరోవైపు జనగాంలో కిరికిరి జరుగుతున్న నేపథ్యంలో ఆ టికెట్‌ను జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇవ్వకుండా.. పెండింగ్‌లో ఉంచినట్లు బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. ముత్తిరెడ్డి చుట్టూ వివాదాలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: కల్వకుంట్ల కవితకు టికెట్ అందుకే ఇవ్వలేదా? బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా.. 1. శ్రీ. కోనేరు కోనప్ప, సిర్పూర్ 2. శ్రీ బాల్క సుమన్, చెన్నూర్ (SC) 3. శ్రీ దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి (SC) 4. శ్రీ నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల 5. శ్రీమతి కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ (ఎస్టీ) 6. శ్రీ భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, ఖానాపూర్ (ST) 7. శ్రీ జోగు రామన్న, ఆదిలాబాద్ 8. శ్రీ అనిల్ జాదవ్, బోత్ (ST) 9. శ్రీ. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ 10. శ్రీ గడ్డిగారి విట్టల్ రెడ్డి, ముధోలే 11. శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆర్మూర్ 12. శ్రీ మహమ్మద్ షకీల్ అమీర్, బోధన్ 13. శ్రీ హన్మంత్ షిండే, జుక్కల్ (SC) 14. శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ 15. శ్రీ జాజాల సురేందర్, ఎల్లారెడ్డి 16. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), కామారెడ్డి 17. శ్రీ బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ 18. శ్రీ గోవర్ధన్ బాజిరెడ్డి, నిజామాబాద్ రూరల్ 19. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ 20. శ్రీ డా. సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల 21. శ్రీ డా. ఎం. సంజయ్ కుమార్, జగిత్యాల 22. శ్రీ కొప్పుల ఈశ్వర్, ధర్మపురి (SC) 23. శ్రీ కోరుకంటి చందర్, రామగుండం 24. శ్రీ పుట్ట మధు, మంథని 25. శ్రీ దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి 26. శ్రీ గంగుల కమలాకర్, కరీంనగర్ 27. శ్రీ సుంకే రవిశంకర్, చొప్పదండి (SC) 28. శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు, వేములవాడ 29. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), సిరిసిల్ల 30. శ్రీ ఎరుపుల బాలకిషన్ (రసమయి), మానకొండూర్ (SC) 31. శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ 32. శ్రీ వొడితెల సతీష్ కుమార్, హుస్నాబాద్ 33. శ్రీ తన్నీరు హరీష్ రావు, సిద్దిపేట 34. శ్రీమతి ఎం. పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ 35. శ్రీ మహారెడ్డి భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్ 36. శ్రీ చంటి క్రాంతి కిరణ్, ఆందోల్ (SC) 37. -------------------- నర్సాపూర్ (పెండింగ్) 38. శ్రీ కొణింటి మాణిక్ రావు, జహీరాబాద్ (SC) 39. శ్రీ చింతా ప్రభాకర్, సంగారెడ్డి 40. శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు 41. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక 42. శ్రీ కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్), గజ్వేల్ 43. శ్రీ చామకూర మల్లా రెడ్డి, మేడ్చల్ 44. శ్రీ మైనంపల్లి హనుమంత రావు, మల్కాజిగిరి 45. శ్రీ కూన పాండు వివేకానంద్, కుత్బుల్లాపూర్ 46. శ్రీ మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి 47. శ్రీ బండారు లక్ష్మా రెడ్డి, ఉప్పల్ 48. శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం 49. శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎల్.బి.నగర్ 50. శ్రీ పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం 51. శ్రీ తొలకంటి ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ 52. శ్రీ అరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి 53. శ్రీ కాలె యాదయ్య, చేవెళ్ల (SC) 54. శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి 55. శ్రీ డా. మెతుకు ఆనంద్, వికారాబాద్ (SC) 56. శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు 57. శ్రీ ముటా గోపాల్, ముషీరాబాద్ 58. శ్రీ తీగల అజిత్ రెడ్డి, మలక్ పేట 59. శ్రీ కాలేరు వెంకటేష్, అంబర్పేట్ 60. శ్రీ దానం నాగేందర్, ఖైరతాబాద్ 61. శ్రీ మాగంటి గోపీనాథ్, జూబ్లీ హిల్స్ 62. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్‌నగర్ 63. -------------నాంపల్లి (పెండింగ్) 64. శ్రీ ఐందాల కృష్ణయ్య, కార్వాన్ 65. ---------------- గోషామహల్(పెండింగ్) 66. శ్రీ ఇబ్రహీం లోడి, చార్మినార్ 67. శ్రీ ఎం. సీతారాం రెడ్డి, చాంద్రాయణగుట్ట 68. శ్రీ సామ సుందర్ రెడ్డి, యాకుత్‌పురా 69. శ్రీ అలీ బక్రి, బహదూర్‌పురా 70. శ్రీ టి పద్మారావు, సికింద్రాబాద్ 71. జి. లాస్య నందిత, సికింద్రాబాద్ కాంట్ (SC) 72. శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ 73. శ్రీ ఎస్. రాజేందర్ రెడ్డి, నారాయణపేట 74. శ్రీ శ్రీనివాస్ గౌడ్ వీరసనోళ్ల, మహబూబ్ నగర్ 75. శ్రీ చర్లకోల లక్ష్మ ర్‌రెడ్డి, జడ్చర్ల 76. శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, దేవరకద్ర 77. శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మక్తల్ 78. శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి 79. శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల్ 80. శ్రీ వి.ఎం. అబ్రహం, అలంపూర్ (SC) 81. శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూల్ 82. శ్రీ గువ్వల బాలరాజు, అచ్చంపేట (SC) 83. శ్రీ గుర్కా జైపాల్ యాదవ్, కల్వకుర్తి 84. శ్రీ అంజయ్య యెలగానమోని, షాద్‌నగర్ 85. శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి, కొల్లాపూర్ 86. శ్రీ రవీంద్ర కుమార్ రమావత్, దేవరకొండ (ఎస్టీ) 87. శ్రీ నోముల భగత్, నాగార్జున సాగర్ 88. శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, మిర్యాలగూడ 89. శ్రీ శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ 90. శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ 91. శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి, సూర్యాపేట 92. శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ 93. శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు 94. శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి, భోంగిరి 95. శ్రీ చిరుమర్తి లింగయ్య, నక్రేకల్ (SC) 96. శ్రీ గాదరి కిషోర్ కుమార్, తుంగతుర్తి (SC) 97. శ్రీమతి గొంగిడి సునీత, అలైర్ 98. ------------- జనగాం(పెండింగ్) 99. శ్రీ కడియం శ్రీహరి, ఘన్పూర్ స్టేషన్ (SC) 100. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి 101. శ్రీ D.S. రెడ్యా నాయక్, డోర్నకల్ 102. శ్రీ బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ (ST) 103. శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట 104. శ్రీ చల్లా ధర్మారెడ్డి, పర్కల్ 105. శ్రీ దాస్యం వినయ భాస్కర్, వరంగల్ వెస్ట్ 106. శ్రీ నన్నపునేని నరేందర్, వరంగల్ తూర్పు 107. శ్రీ అరూరి రమేష్, వర్ధన్నపేట (SC) 108. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి 109. శ్రీమతి బడే నాగజ్యోతి, ములుగు (ఎస్టీ) 110. శ్రీ రేగా కాంత రావు, పినపాక (ఎస్టీ) 111. శ్రీమతి బానోత్ హరిప్రియ నాయక్, యెల్లందు (ఎస్టీ) 112. శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం 113. శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, పాలేరు 114. శ్రీ లింగాల కమల్ రాజు, మధిర (SC) 115. శ్రీ బానోత్ మదన్‌లాల్, వైరా (ST) 116. శ్రీ సండ్ర వెంకట వీరయ్య, సత్తుపల్లి (SC) 117. శ్రీ వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం 118. శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు, అశ్వారావుపేట (ఎస్టీ) 119. శ్రీ డా. తెల్లం వెంకట్ రావు, భద్రాచలం (ఎస్టీ) -
95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో
సాక్షి, హైదరాబాద్: అక్టోబరు 16న వరంగల్‌లో సింహగర్జన సభ ఏర్పాటు చేసి.. అదే రోజు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు శ్రావణ మాసం మంచి ముహూర్తం కావడంతో ఇదే శుభఘడియగా భావించి మధ్యాహ్నం 2.38 గంటలకు తర్వాత అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులూ చేయలేదని తెలిపారు. అయితే మొత్తంగా తొమ్మిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు. ఇదిలా ఉండగా సీఎం గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీలోకి దిగనున్నారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్ పెట్టారు. చదవండి: BRS List: వివాదాలున్నా వాళ్లకే టికెట్లు బీఆర్ఎస్ సముద్రం లాంటింది అవకాశాలు రాని అభ్యర్థులు హడావిడీ చేసి భవిష్యత్తును పాడుచేసుకోవద్దు అని హితవు పలికారు. పార్టీలోనే ఉండి, అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో తమకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు. టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. బీఆర్ఎస్ సముద్రం లాంటిదని, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికీ అవకాశాలుంటాయని చెప్పారు. రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పని చేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్.. ఇలా అనేక అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. చాలా మంది జిల్లా పరిషత్ ఛైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందని, గతంలో అలా చేశాం కూడా అని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించి తెలంగాణను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ‘హైదరాబాద్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్ఎస్, మజ్లిసే గెలుపు’ ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ మాకు మాత్రం ఒక టాస్క్ - బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/PQcfVb0kI6 — BRS Party (@BRSparty) August 21, 2023 ఎన్నికలంటే బీఆర్ఎస్కు ఓ టాస్క్ ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్ గేమ్ అని, బీఆర్ఎస్కు మాత్రం ఓ టాస్క్ అని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలను ఒక పవిత్రమైన యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామన్నారు. పూర్తి స్థాయిలో చర్చించి, సంపూర్ణ అవగాహనతోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. నర్సాపుర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే నాలుగు రోజుల్లో కమిటీ మరోసారి భేటీ అయ్యి, ఈ స్థానాల్లోనూ అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే గుర్తింపు ఇచ్చి మరోసారి టికెట్లు కేటాయించామన్నారు. టికెట్లు పొందిన వారందరికీ అభినందనలు తెలుపుతూ.. అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
‘హైదరాబాద్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్ఎస్, మజ్లిసే గెలుపు’
సాక్షి, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్, తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల్లోని మొత్తం 29 స్థానాల్లో ఇరవై తొమ్మిది తామే గెలుస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్ గెలుస్తాయి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మొత్తం 17 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధిస్తాయని తెలిపారు. 2014 నుంచి ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తమ మధ్య స్నేహం అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే మిత్రపక్షాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. మరింత ఉజ్వలమైన తెలంగాణ సాధన కోసంప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. చదవండి: Kavitha : కూతురు కవిత విషయంలో కేసీఆర్ వ్యూహమేంటీ? -
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీట్లు పోయిన సిట్టింగ్‌లు వీరే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. మొత్తం తొమ్మిది చోట్ల సిట్టింగ్ అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. వేములవాడ, స్టేషన్ ఘన్పూర్, కోరుట్ల, ఉప్పల్, ఖానాపూర్, అసిఫాబాద్, కామారెడ్డి, బోథ్,వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలంటే ఇతర పార్టీలకు ఒక గేమ్ మాకు మాత్రం ఒక టాస్క్ - బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ pic.twitter.com/PQcfVb0kI6 — BRS Party (@BRSparty) August 21, 2023 వీరిలో 2009 నుంచి కామారెడ్డిలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన గంపగోవర్దన్ రెడ్డి.. కేసీఆర్ కోసం సీటు త్యాగం చేశారు. ఇక కోరుట్లలో ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన కొడుకు డాక్టర్ సంజయ్‌కు టికెట్ కేటాయించారు. మిగిలిన ఏడుచోట్ల అభ్యర్థులను మార్చారు. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీరే ►ఉప్పల్ - సుభాష్ రెడ్డి ►బోథ్ - రాథోడ్ బాపూరావు ►ఖానాపూర్ - రేఖా నాయక్ ►అసిఫాబాద్ - ఆత్రం సక్కు ►వైరా - రాములు నాయక్ ►కామారెడ్డి - గంప గోవర్ధన్ ►స్టేషన్ ఘన్పూర్ - రాజయ్య పెండింగ్ స్థానాలు ఇవే ►నర్సాపుర్ ►జనగామ ►నాంపల్లి ►గోషామహల్ కోర్టు కేసు కారణంగా నిరాకరణ ►వేములవాడ - చెన్నమనేని రమేష్ సిట్టింగ్ ల వారసులు వీరే ►కోరుట్ల - ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్ సంజయ్ ►సికింద్రాబాద్ కంటోన్మెంట్ - దివంగత సాయన్న కూతురు లాస్య ఇక హుజూరాబాద్ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కామారెడ్డి, గజ్వేల్ స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని(నర్సాపుర్, జనగామ, నాంపల్లి, గోషామహల్) , ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే మరోసారి టికెట్లు కేటాయించామని, వారందరికీ అభినందనలు తెలుపుతూ.. మరోసారి అద్భుత విజయం సాధించాలని కోరారు. మొత్తం 119 స్థానాల్లో ప్రస్తుతం 114 మంది అభ్యర్థులను ప్రకటించగా.. నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. ఎమ్మెల్యే మైనంపల్లికి మల్కాజ్ గిరిలో టికెట్ ఇచ్చామని, ఆయన కొడుకు రోహిత్ కు మెదక్ లో అడిగినా ఇవ్వలేకపోయామన్నారు. ఇవ్వాళ తిరుమలలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడిన కెసిఆర్.. మైనంపల్లి పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టానికే వదిలేస్తున్నామని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలా? వద్దా? అన్నది మైనంపల్లి నిర్ణయించుకోవాలని చెప్పారు. చదవండి: CR Press Meet: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల -
CM KCR : కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం కూడా సీఎం కెసిఆర్ పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్యులు సూచించినట్టు తెలిసింది. గజ్వేల్ వేడేక్కిన రాజకీయం ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ఇప్పటికే గజ్వేల్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకరు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే మరొకరు బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రకటించారు. వీరిద్దరు కూడా గజ్వేల్ లో సీఎం కెసిఆర్ పై పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనితో సంబంధం లేకుండా.. కెసిఆర్ మరో నియోజకవర్గం కూడా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణపై కామారెడ్డి ఎఫెక్ట్ కామారెడ్డి ఓ రకంగా భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉంది. ఉత్తర తెలంగాణలో పార్టీకి ఉన్న ఊపు కొనసాగాలంటే కామారెడ్డి నుంచి పోటీ చేయడం సరైన నిర్ణయం అని భావించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ విజయం సాధించారు. కామారెడ్డిలో పోటీపై కాంగ్రెస్ విమర్శలు కామారెడ్డిలో పోటీ చేయాలన్న సీఎం కెసిఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. గజ్వేల్ లో ఓడిపోతననే భయంతోనే కామారెడ్డి వస్తున్నట్లు తెలుస్తోంది, కామారెడ్డిలో ఎవరు పోటీ చేసినా నేనే గెలుస్తానని షబ్బీర్ అలీ తెలిపారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగు నీరు వచ్చేదని, సాగు నీరు కామారెడ్డి లో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చారో చెప్పి కేసీఆర్ నామినేషన్ వేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ తొలి జాబితా ఇదే.. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా 1. సిర్పూర్ - కోనేరు కోనప్ప 2. చెన్నూర్ (SC) - బాల్క సుమన్ 3. బెల్లంపల్లి (SC) - దుర్గం చిన్నయ్య 4. మంచిర్యాల - నడిపల్లి దివాకర్ రావు 5. ఆసిఫాబాద్ (ST) - కోవా లక్ష్మి 6. ఖానాపూర్ (ST) - భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ 7. ఆదిలాబాదు - జోగు రామన్న 8. బోథ్ (ST) - అనిల్ జాదవ్ 9. నిర్మల్ - అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి 10. ముధోల్ - జి.విఠల్ రెడ్డి ఉమ్మడి నిజామాబాదు జిల్లా 11. ఆర్మూర్ - ఆశన్నగారి జీవన్ రెడ్డి 12. బోధన్ - షకీల్ అహ్మద్ 13. జుక్కల్ (SC) - హన్మంతు షిండే 14. బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి 15. ఎల్లారెడ్డి - జాజల సురేందర్ 16. కామారెడ్డి - సీఎం కెసిఆర్ 17. నిజామాబాదు (పట్టణ) - గణేష్ గుప్తా బిగాల 18. నిజామాబాదు (రూరల్) - బాజిరెడ్డి గోవర్థన్ 19. బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా 20 కోరుట్ల - కల్వకుంట్ల సంజయ్ 21 జగిత్యాల - డాక్టర్ సంజయ్ కుమార్ 22 ధర్మపురి (SC) - కొప్పుల ఈశ్వర్ 23 రామగుండం - కోరుకంటి చందర్ 24 మంథని - పుట్టా మధు 25 పెద్దపల్లి - దాసరి మనోహర్ రెడ్డి 26 కరీంనగర్ - గంగుల కమలాకర్ 27 చొప్పదండి (SC) - సుంకె రవిశంకర్ 28 వేములవాడ - చలిమెడ లక్ష్మీ నర్సింహారావు 29 సిరిసిల్ల - కె.తారక రామారావు 30 మానుకొండూరు (SC) - రసమయి బాలకిషన్ 31 హుజురాబాద్ - పాడి కౌశిక్ రెడ్డి 32 హుస్నాబాద్ - వడితెల సతీష్ ఉమ్మడి మెదక్ జిల్లా 33 సిద్దిపేట - తన్నీరు హరీష్ రావు 34 మెదక్ - పద్మాదేవేందర్ రెడ్డి 35 నారాయణ్‌ఖేడ్ - మహారెడ్డి భూపాల్ రెడ్డి 36 ఆందోల్ (SC) - చంటి క్రాంతి కిరణ్ 37 నర్సాపూర్ - పెండింగ్ 38 జహీరాబాద్ (SC) - కొనింటి మాణిక్‌రావు 39 సంగారెడ్డి తూర్పు - జయప్రకాశ్ రెడ్డి 40 పటాన్చెరు - గూడెం మహిపాల్ రెడ్డి 41 దుబ్బాక - కొత్తా ప్రభాకర్ రెడ్డి 42 గజ్వేల్ - సీఎం కెసిఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉప్పల్ మినహా మిగతా సీట్లలో అభ్యర్థులు యధాతధంగా ఉన్నారు. తనయులకు ఛాన్స్ ఇవ్వాలని సబితారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్ కోరినా.. సీఎం కెసిఆర్ అంగీకరించలేదు. సామాజిక పరంగా చూస్తే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 7 రెడ్డిలకు, 2 గౌడ్స్, ఒకటి కమ్మ, ఇద్దరు వెలమ, ఇద్దరు మాదిగ ఉన్నారు. 43 మేడ్చల్ చామకూర మల్లారెడ్డి 44 మల్కాజ్గిరి మైనంపల్లి హన్మంతరావు 45 కుత్బుల్లాపూర్ కూన పండు వివేకానంద 46 కూకట్పల్లి మాధవరం కృష్ణారావు 47 ఉప్పల్ బండారు లక్ష్మా రెడ్డి 48 ఇబ్రహింపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి 49 ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి 51 రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ 52 శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ 53 చేవెళ్ళ (SC) కాలె యాదయ్య 54 పరిగి కొప్పుల మహేశ్వర్ రెడ్డి 55 వికారాబాద్ (SC) మెతుకు ఆనంద్ 56 తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి ఉమ్మడి హైదరాబాదు జిల్లా హైదరాబాద్ లో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలుండగా.. రెండు స్థానాలు పెండింగ్ ఉంచారు. ఇద్దరు మైనార్టీలు, ఐదుగురు బీసీలు ( మున్నూరు కాపు, వంజెర, యాదవ్, గౌడ్, గంగపుత్ర), ఒకటి కమ్మ , ఇద్దరు రెడ్డి , ఒకటి మాదిగ అభ్యర్థులు ఉన్నారు. 57 ముషీరాబాద్ ముఠా గోపాల్ 58 మలక్‌పేట్ తీగల అజిత్ రెడ్డి 59 అంబర్పేట్ కాలేరు వెంకటేశ్ 60 ఖైరతాబాద్ దానం నాగేందర్ 61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ 62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ 63 నాంపల్లి పెండింగ్ 64 కార్వాన్ అయిందాల కృష్ణయ్య 65 గోషామహల్ పెండింగ్ 66 చార్మినార్ ఇబ్రహీం లోడి 67 చాంద్రాయణగుట్ట సీతారాం రెడ్డి 68 యాకుత్‌పురా సామా సుందర్ రెడ్డి 69 బహదుర్‌పురా అలీ బక్రీ 70 సికింద్రాబాదు టి.పద్మారావు 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (SC) - లాస్య నందిత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా 72 కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి 73 నారాయణపేట - ఎస్.రాజేందర్ రెడ్డి 74 మహబూబ్ నగర్ - శ్రీనివాస్ గౌడ్ 75 జడ్చర్ల - చర్లకోల లక్ష్మారెడ్డి 76 దేవరకద్ర - ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి 77 మఖ్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి 78 వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 79 గద్వాల - బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 80 ఆలంపూర్ (SC) - అబ్రహాం 81 నాగర్‌కర్నూల్ - మర్రి జనార్థన్ రెడ్డి 82 అచ్చంపేట్ (SC) - గువ్వల బాలరాజ్ 83 కల్వకుర్తి - గుర్క జైపాల్ యాదవ్ 84 షాద్‌నగర్ - అంజయ్య యాదవ్ 85 కొల్లాపూర్ - బీరం హర్షవర్థన్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా 86 దేవరకొండ (ST) రమావత్ రవీంద్రనాయక్ 87 నాగార్జున సాగర్ నోముల భగత్ 87 మిర్యాలగూడ నల్లమోతు భాస్కర్ రావు 88 హుజుర్నగర్ శానంపూడి సైది రెడ్డి 89 కోదాడ బొల్లం మల్లన్నయాదవ్ 90 సూర్యాపేట గుంటకండ్ల జగదీశ్ రెడ్డి 91 నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి 92 మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 93 భువనగిరి పైళ్ళ శేఖర్ రెడ్డి 94 నకిరేకల్ (SC) చిరుమర్తి లింగయ్య 95 తుంగతుర్తి (SC) గ్యాదరి కిశోర్ 96 ఆలేరు గొంగడి సునీత ఉమ్మడి ఖమ్మం జిల్లా 110 పినపాక (ST) రేగా కాంతారావు 111 ఇల్లెందు (ST) బానోత్ హరిప్రియ నాయక్ 112 ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్ 113 పాలేరు కందాల ఉపేందర్‌రెడ్డి 114 మధిర (SC) లింగాల కమల్ రాజు 115 వైరా (ST) బానోత్ మదన్ లాల్ 116 సత్తుపల్లి (SC) సండ్ర వెంకట వీరయ్య 117 కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు 118 అశ్వారావుపేట (SC) మచ్చా నాగేశ్వరరావు 119 భద్రాచలం (ST) తెల్లం వెంకట్ రావు I congratulate all the nominees of the @BRSparty for ensuing assembly elections Also thank the Hon’ble Party President Sri KCR Garu for renominating me as a candidate from Siricilla 🙏 Disappointments are to be taken in stride in public life. Unfortunately some very deserving,… — KTR (@KTRBRS) August 21, 2023