CM KCR Shock to 7 Sitting Mlas Ahead of Assembly Polls, List Here - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన.. సీట్లు కోల్పోయిన సిట్టింగ్‌లు వీరే

Published Mon, Aug 21 2023 3:25 PM | Last Updated on Thu, Aug 24 2023 4:02 PM

Cm KCR Shock To 7 Sitting MLAs Ahead Of Assembly Polls List here - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ షాక్‌ ఇచ్చారు. మొత్తం తొమ్మిది చోట్ల సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు. వేములవాడ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, కోరుట్ల, ఉప్పల్‌, ఖానాపూర్‌, అసిఫాబాద్‌, కామారెడ్డి, బోథ్‌,వైరా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

వీరిలో 2009 నుంచి కామారెడ్డిలో  వరుసగా నాలుగు సార్లు గెలిచిన గంపగోవర్దన్‌ రెడ్డి.. కేసీఆర్‌ కోసం సీటు త్యాగం చేశారు. ఇక కోరుట్లలో  ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన కొడుకు డాక్టర్ సంజయ్‌కు టికెట్‌ కేటాయించారు. మిగిలిన ఏడుచోట్ల అభ్యర్థులను మార్చారు.

టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వీరే

►ఉప్పల్‌ - సుభాష్‌ రెడ్డి
►బోథ్‌ -  రాథోడ్‌ బాపూరావు
►ఖానాపూర్‌ - రేఖా నాయక్‌
►అసిఫాబాద్ - ఆత్రం సక్కు
►వైరా - రాములు నాయక్‌
►కామారెడ్డి - గంప గోవర్ధన్‌
►స్టేషన్‌ ఘన్‌పూర్‌ - రాజయ్య

పెండింగ్ స్థానాలు ఇవే

►నర్సాపుర్‌
►జనగామ
►నాంపల్లి
►గోషామహల్

కోర్టు కేసు కారణంగా నిరాకరణ

►వేములవాడ - చెన్నమనేని రమేష్‌ 

సిట్టింగ్ ల వారసులు వీరే

►కోరుట్ల - ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కొడుకు డాక్టర్ సంజయ్
►సికింద్రాబాద్ కంటోన్మెంట్   -  దివంగత సాయన్న కూతురు లాస్య

ఇక హుజూరాబాద్‌ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. కామారెడ్డి, గజ్వేల్‌ స్థానాల నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్నారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని(నర్సాపుర్‌, జనగామ, నాంపల్లి, గోషామహల్) , ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే మరోసారి టికెట్లు కేటాయించామని, వారందరికీ అభినందనలు తెలుపుతూ.. మరోసారి అద్భుత విజయం సాధించాలని కోరారు.  మొత్తం 119 స్థానాల్లో ప్రస్తుతం 114 మంది అభ్యర్థులను ప్రకటించగా.. నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. 

ఎమ్మెల్యే మైనంపల్లికి మల్కాజ్ గిరిలో టికెట్‌ ఇచ్చామని, ఆయన కొడుకు రోహిత్ కు మెదక్ లో అడిగినా ఇవ్వలేకపోయామన్నారు. ఇవ్వాళ తిరుమలలో మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడిన కెసిఆర్.. మైనంపల్లి పోటీ చేయడం, చేయకపోవడం ఆయన ఇష్టానికే వదిలేస్తున్నామని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలా? వద్దా? అన్నది మైనంపల్లి నిర్ణయించుకోవాలని చెప్పారు.
చదవండి: CR Press Meet: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement