న్యూఢిల్లీ: సీఎం కేసీఆర్ పతనం కామారెడ్డి నుంచే మొదలవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సీఎం పోటీ చేసినా.. ఎవరు పోటీ చేసినా కామారెడ్డి అంటే షబ్బీర్ అని పేర్కొన్నారు. నేను కామారెడ్డి బిడ్డను, ఆశీర్వదించండి అని అడుగుతానన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గెలిస్తే ఫామ్‌హౌస్‌కు వెళ్తారు.. నేను గెలిస్తే ప్రజల్లో ఉంటానని తెలిపారు.
సంబంధిత వార్త: KCR Press Meet: బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
అభ్యర్థుల ప్రకటనపై కేసీఆర్ ముందే కూశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న భయంతోనే లిస్ట్ అనౌన్స్ చేశారని విమర్శించారు. గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ మరోచోటికి వెళ్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌కే దిక్కు లేకుండా పోయిందని, ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని అన్నారు.
పీపుల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చిందని తెలిపారు. సీఎల్పీ లీడర్‌గా పీపుల్స్ మార్చ్ చేశాక నేడు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు చెప్పారు. పాదయాత్ర అనుభవాలు, రాష్ట్ర రాజకీయాల గురించి ఖర్గేతో చర్చించినట్లు తెలిపారు. ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
చదవండి: మైనంపల్లి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సీరియస్..
Comments
Please login to add a commentAdd a comment