![bhatti Vikramarka Challenge to CM KCR KTR Kavitha Harish Rao - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/28/bhatti.jpg.webp?itok=9oHL4CA0)
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి ఆగం కావద్దంటూ సీఎం కేసీఆర్ కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. ఆయన మాటలు విని ప్రజలు ఆగం కావద్దు. సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు, కుమార్తె కవితలకు కలిపి వోల్వో బస్సులోగానీ, విమానంలో కానీ టికెట్లు బుక్ చేస్తాం. కర్ణాటకకు తీసుకెళ్తాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచి్చన హామీలు అమలవుతున్నాయా లేదా? చూసి వద్దాం.. వస్తారా?’’అని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క సవాల్ చేశారు.
బీఆర్‌ఎస్‌లా ఇంటికో ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, కేజీ టు పీజీ, మూడెకరాల భూమి అంటూ హామీఇచ్చి మోసం చేయడం కాంగ్రెస్ పారీ్టకి తెలియదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీ కార్డు స్కీంలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు.
బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఎన్నికల వార్‌రూంను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో కలసి భట్టి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ సర్కారులా సగం మందికి పింఛన్లు కోతవేసి, మిగతా సగం మందికే ఇవ్వడం సామాజిక బాధ్యత కాదని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ నేతలది తప్పుడు ప్రచారం
కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లను అమలు చేయదంటూ కొందరు బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. రైతు, యూత్, దళిత డిక్లరేషన్‌లన్నింటినీ మేనిఫెస్టోలో పెడతామని, తుక్కుగూడలో ఇచి్చన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు ఈ మూడు నెలలూ తామిచి్చన గ్యారంటీ కార్డులను దాచిపెట్టుకోవాలన్నారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి లోతుగా అధ్యయనం చేశాకే గ్యారంటీ కార్డు స్కీంలు ప్రకటించామని భట్టి చెప్పారు. కర్ణాటకలో తామిచ్చిన హామీలను అమలు చేశామని, తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను బట్టే ఆ ఆలోచనలను అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. వార్‌రూం ప్రారంభ కార్యక్రమంలో ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్ మున్షీ, జ్యోతిమణి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి, మచ్చా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment