సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోయాయని అమాయకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే, కేటీఆర్.. మీ రాజకీయ లబ్ధి కోసం సామాన్య ప్రజలను బలి చేయకండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ కేవలం విమర్శలనే ఎజెండా పెట్టుకుందని మండిపడ్డారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమలు పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా?. ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమా? లేక రుణమాఫీ ఇవ్వడమా?. ఏది ప్రభుత్వ వైఫల్యమో కేటీఆర్ చెప్పాలి. కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోయాయని అమాయకులను రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ మీ రాజకీయ లబ్ధి కోసం సామాన్య ప్రజలను బలిచేయకండి. పొల్యూషన్ సమస్య రాకూడదనే క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండరు. బీఆర్‌ఎస్ కేవలం విమర్శలు చేయడమే ఎజెండా పెట్టుకుంది.
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్థిక విధానాలు దేశంలో సమానత్వానికి నాంది పలికాయి. పంచవర్ష ప్రణాళికలు ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి. కొంతమంది కూహనా మేధావులు ఏమీ తెలియకుండా నెహ్రూపై విమర్శలు చేస్తున్నారు. సైన్స్ అభివృద్ధికి కూడా నెహ్రూ బాటలు వేసారు’ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: మొదటి ముద్దాయి కేటీఆర్.. శిక్ష తప్పదు: టీపీసీసీ చీఫ్
Comments
Please login to add a commentAdd a comment