సాక్షి, హైదరాబాద్: అధికారులపై దాడి అనేది హేయమైన చర్య.. ఈ కేసులో కేటీఆర్‌కు శిక్ష తప్పదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. దాడిలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్‌లో కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోంది. అధికారులపై దాడి హేయమైన చర్య.. కేటీఆర్‌కు శిక్ష తప్పదు. లగచర్లలో భూమిలేని వారు కలెక్టర్‌పై దాడి చేశారు. బీఆర్ఎస్ భారీ కుట్రలు చేస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగింది.
అభివృద్ధి వికేంద్రీకరణను బీఆర్‌ఎస్ అడ్డుకుంటోంది. కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్దారించారు. లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్. ఈ ఫార్ములా రేసులో డబ్బులు చేతులు మారాయి.. ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వారికి కట్టబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. లగచర్ల దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలి. నిందితులను శిక్షించండి.
ప్రభుత్వ ఉత్సవాలలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలి. డిసెంబర్ 2 లేదా 3వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. సంవత్సర కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని సభ ద్వారా ప్రజలకు వివరిస్తాం. ఈనెల 16 నుంచి జిల్లాల పర్యటన చేస్తాను. మొదట కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తాను’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment