binami
-
బినామీ రైతులది మొసలి కన్నీరు
తాడికొండ: విశాఖలో రాజధాని వద్దన్న అమరావతి బినామీ రైతులు.. ఉక్కు ఉద్యమానికి మద్దతంటూ మొసలి కన్నీరు కార్చడం హేయనీయమని బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు మండిపడ్డారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో 139 రోజు పలువురు ప్రసంగించారు. విశాఖలో రాజధాని వద్దు.. మాకే రాజధాని కావాలని ఏడాదికి పైగా ఉద్యమాలు చేస్తున్న వీరు.. ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికేందుకు విశాఖకు వెళ్లడం ఉక్కు ఉద్యమాన్ని అవమాన పర్చడమేనన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్ చూపించి రియల్ ఎస్టేట్ చేశాడని తేటతెల్లం కావడంతోనే అన్ని ఎన్నికల్లో ప్రజలు దిమ్మతిరిగే దెబ్బ కొట్టారని ఎద్దేవా చేశారు. నేతలు నత్తా యోనారాజు, మాదిగాని గురునాధం, ఊపూరి ఆదాం తదితర దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు. -
అక్కా, బావ, ఓ బామ్మర్ది.. కుచ్చుటోపి!
సాక్షి, అమరావతి: అమరావతి భూముల విషయంలో ‘ఇన్సైడ్ ట్రేడింగ్’ ఆరోపణలతో ఏసీబీ కేసులో మొదటి నిందితునిగా ఉన్న మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అపార్ట్మెంట్ ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్ పేరుతో దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య, బావమరిది నన్నపనేని సీతారామరాజు, మరికొందరు కలిసి తనను మోసం చేశారంటూ రిటైర్డ్ లెక్చరర్ కోడె రాజా రామమోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నాలుగవ నిందితునిగా చేర్చారు. ఈ ఫిర్యాదులోని అంశాలు ఇలా ఉన్నాయి. ► నేను ఓ రిటైర్డ్ లెక్చరర్ని. విజయవాడలో నాకు ఓ నివాస గృహం ఉంది. దానిని 2018 అక్టోబర్‌లో అమ్మేశాను. ఈ విషయం తెలుసుకుని నా పక్క ఊరుకు చెందిన వ్యక్తి కేవీజీ కృష్ణుడు అలియాస్ వేణు విజయవాడలోని ‘క్యాపిటల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్’ కార్యాలయానికి నన్ను తీసుకెళ్లాడు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నన్నపనేని సీతారామరాజుకు నన్ను పరిచయం చేశారు. ► సీతారామరాజు ‘లేక్ వ్యూ అపార్ట్మెంట్స్’పేరుతో తాము నిర్మిస్తున్న ప్రాజెక్ట్ బ్రోచర్‌ను నాకు చూపారు. ఈ ప్రాజెక్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబానికి సైతం భాగం ఉందని, వారి పలుకుబడి ద్వారా తమ కంపెనీ వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సమీపంలో దమ్మాలపాటి శ్రీనివాస్ భార్యకు సైతం భూమి ఉందని సీతారామరాజు చెప్పారు. ► ఆ కార్యాలయంలోనే నేను మొదటిసారి దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య నాగరాణిని కలిశాను. తాను రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా పనిచేస్తున్నానని, ప్రభుత్వంలో ఎవరినైనా ప్రభావితం చేయగలనని, ఏ పనైనా చేసుకురాగలనని దమ్మాలపాటి, ఆయన భార్య నాకు హామీ ఇచ్చారు. వీరి ప్రేరేపణతో నేను ‘లేక్‌వ్యూ అపార్ట్మెంట్స్’లో రెండు త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్లు కొనాలని నిర్ణయించుకున్నాను. దమ్మాలపాటిని చూసే రూ.50 లక్షలు చెల్లించా ► ఒక్కో ఫ్లాట్‌ను రూ.38.50 లక్షలకు అమ్ముతామని చెప్పారు. దీంతో నేను రెండ్లు ఫ్లాట్లకు అడ్వాన్సు కింద రూ.50 లక్షలు చెల్లించాను. వారు నాకు రెండు వేర్వేరు రసీదులు ఇచ్చారు. ఆ తర్వాత నేను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కోసం ఒత్తిడి తెచ్చాను. వారు అగ్రిమెంట్ చేయకుండా తప్పించుకు తిరగడం మొదలుపెట్టారు. ► నేను ఒత్తిడి చేస్తున్నట్లు ఎవరూ చేయలేదని, ఆయన చెప్పిన చోట పెట్టుబడి పెట్టేందుకు ఆయన కార్యాలయం బయట వందల మంది ఎదురు చూస్తున్నారని దమ్మాలపాటి మాట్లాడారు. గట్టిగా ఒత్తిడి చేయగా చివరకు 2019 ఫిబ్రవరి 22న ఫ్లాట్ నంబర్ 1001కు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేశారు. రెండో ఫ్లాట్‌కు త్వరలోనే అగ్రిమెంట్ పంపుతామని చెప్పారు. ► చెల్లించాల్సిన మిగిలిన మొత్తానికి రూ.19 లక్షలు, రూ.18.65 లక్షలు, రూ.10.50 లక్షలకు ఆంధ్ర బ్యాంక్ పేరు మీద ఉన్న చెక్కులు ఇచ్చాను. ఆ రోజునే సీతారామరాజు వాటిని నగదుగా మార్చుకున్నారు. స్టార్ హోటల్స్ వస్తాయంటూ.. ► ఆ తర్వాత సీతారామరాజు నాతో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు విస్తరణకు డబ్బు అవసరం ఉందన్నారు. అందువల్ల తాను, దమ్మాలపాటి శ్రీనివాస్ భార్య నాగరాణి సంయుక్తంగా కొన్న స్థలాన్ని అమ్ముతున్నామని, ఆ స్థలం చుట్టుపక్కల స్టార్ హోటల్స్ వస్తాయన్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్ ఆ స్థలాన్ని నాకు చూపారు. స్టార్ హోటల్స్ వస్తాయని ఆయన కూడా చెప్పారు. ► వాళ్ల మాటలు నమ్మి నా కుమార్తెను ఆ స్థలం కొనమని చెప్పాను. ఆమె ఎన్ఆర్ఐ ఖాతా నుంచి రూ.73 లక్షలు ఓపెన్ ప్లాట్ కోసం వారికి బదిలీ చేశాను. రెండు వారాల్లో రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చి, 2019 జూలై 24న లేక్ వ్యూ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ 1001ని మాత్రమే నా పేరు మీద రిజిష్టర్ చేశారు. మిగిలిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తప్పుడు కేసులు పెడతామని బెదిరింపు ► సేల్‌డీడ్‌ను పరిశీలిస్తే ఈ రిజిస్ట్రేషన్ సరైన రీతిలో చేయలేదని తెలిసింది. వారి ప్రవర్తనపై అనుమానంతో నా సోదరుడు సత్యప్రసాద్‌ను పంపి విచారించాను. ఈ ప్రాజెక్టుకు సమీపంలో వారికి ఎలాంటి ఓపెన్ ప్లాట్ లేదని కూడా తేలింది. దీంతో లేని ప్లాట్‌కు వాళ్లు నా ద్వారా నా కుమార్తెకు చెందిన రూ.73 లక్షలు తీసుకున్నారని అర్థమైంది. ► డబ్బు తిరిగి ఇవ్వమంటే న్యాయ వ్యవస్థలో, పోలీసుల్లో తమకు భారీ పలుకుబడి ఉందంటూ సీతారామరాజు, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు బెదిరిస్తున్నారు. నా డబ్బు కొట్టేసి, నాపైనే తప్పుడు కేసులు బనాయిస్తామంటున్నారు. ► లాక్డౌన్ వల్ల నేను హైదరాబాద్‌లోనే చిక్కుకుపోయాను. అందుకే ఇప్పుడు విజయవాడకు వచ్చి ఫిర్యాదు చేశాను. దమ్మాలపాటి శ్రీనివాస్, దమ్మాలపాటి నాగరాణి, నన్నపనేని సీతారామరాజు, కేవీజీ కృష్ణుడు, అడుసుమిల్లి తనూజ, పొట్లూరి అనంత లక్ష్మీలు నన్ను దారుణంగా మోసం చేశారు. -
సీఎం మేనల్లుడి ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరి, ఆయన కంపెనీలకు చెందిన రూ 254 కోట్ల విలువైన బినామీ ఆస్తులను ఆదాయ పన్ను శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయని ఐటీ అధికారులు పేర్కొన్నారు. అగస్టా వెస్ట్‌లాండ్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజేష్ సక్సేనా ద్వారా ఎఫ్‌డీఐల రూపంలో అక్రమ నగదును దేశానికి తీసుకువచ్చారని వెల్లడించారు. అగస్టా వెస్ట్‌లాండ్ ఒప్పందంలో సమకూరిన లంచాల సొమ్మును దారిమళ్లించడంలో రతుల్ పూరి పాత్రపై ఐటీ, ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. కాగా తాను రాజకీయ నేత బంధువనే కారణంతో ఈడీ తనను వేధిస్తోందని ఆరోపిస్తూ రతుల్ పూరీ ఈనెల 27న ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు రతుల్ పూరి దర్యాప్తునకు సహకరించడం లేదని, వాస్తవాలు వెల్లడించడం లేదని ఈడీ వాదిస్తోంది. పూరి బెయిల్ దరఖాస్తును ప్రస్తుతం ఢిల్లీ కోర్టు విచారిస్తోంది. -
చంద్రబాబు బినామీ సీఎం రమేష్
సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : చంద్రబాబు బినామీ సీఎం రమేష్ నాయుడు అని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుమల పాదయాత్ర సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ఆయన మండలంలోని కోనంపేట నుంచి బయల్దేరారు. పాదయాత్ర లక్కిరెడ్డిపల్లె చేరుకోగానే మహిళలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి హారతులతో స్వాగతం పలికారు. మండలంలోని మూడు రోడ్ల కూడలిలో బాణసంచా పేల్చారు. గజమాలతో సుధీర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ‘జోహార్ వైఎస్సార్’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మర్రిచెట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ పాలన వచ్చిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన 20ఏళ్లపాటు కొనసాగాలని, వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ తిరుమలకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ పాలన అంతా దొంగలమయమన్నారు. కేంద్ర మంత్రిగా పని చేసిన సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు చంద్రబాబు బినామీగా పని చేస్తూ ఆయన ఆస్తులను కాపాడేందుకు బీజేపీలోకి జంప్ అయ్యారని విమర్శించారు. అధికారం లేకపోతే అరగంట కూడా ప్రతి పక్షంలో ఉండలేరన్నారు. ఇంకా 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనేది బహిరంగ రహస్యమేనని ఆయన పేర్కొన్నారు. టీడీపీని స్థాపించిన మహనీయుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో ఆయన ఆత్మ క్షోభించక తప్పదన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఖాళీ అయిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందన్నారు. వైఎస్సార్ హయాంలో నిలిచిన కాలువల పనులను పూర్తి చేయించి సాగు నీటిని అందిస్తామన్నారు. వైఎస్ జగన్ సహకారంతో ఆరు నెలల్లోపు బ్రహ్మణి ఉక్కును ప్రారంభించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గండికోట ముంపు గ్రామాలలోని 7 గ్రామాలకు రూ.10లక్షలు పరిహారం అందజేస్తామన్నారు. జిల్లా వాసులు జగనన్నపై చూపిన అభిమానానికి వారి రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తామన్నారు. -
నడిపేది ఆటో ఉండేది విల్లా
అతనో ఆటోడ్రైవర్. ఉండేది మాత్రం విలాసవంతమైన భవనంలో. ఇదెలా సాధ్యం అని ఐటీ అధికారులు నివ్వెరపోయారు. సోదాల్లో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ఒక విదేశీ మహిళకు బినామీగా పెద్దఎత్తున ఆస్తులుకూడబెట్టినట్లు తేలింది. బనశంకరి: బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఆటోడ్రైవరు సుబ్రమణి నివాసముంటున్న విలాసవంత విల్లాపై ఐటీ అధికారుల దాడిలో లోగుట్లు బయటపడుతున్నాయి. ఒక విదేశీమహిళ డబ్బుతో ఆటోడ్రైవరు బంగ్లా కొనుగోలు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ఆటోడ్రైవరు సుబ్రమణి ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులు పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా సుబ్రమణి ఒక విదేశీ మహిళకు బినామీ అని తెలిసింది. ఒక విదేశీ మహిళ సుబ్రమణి పేరుతో ఆస్తులు కొని అతన్ని బినామీగా ఉంచారని ఐటీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో సుబ్రమణి విల్లా కొనుగోలు గురించి ఐటీ అధికారులు ఐటీ చట్టం 21 (1) సెక్షన్ ప్రకార సమాచారం అడిగారు. దీంతో ఐటీ అధికారులకు తన వద్ద ఉన్న పత్రాలను అందజేశాడు. బ్యాంకు ద్వారా నగదు బదిలీ విదేశీ మహిళ తనకు అనుకోకుండా పరిచయమైందని, ఆమె భారతదేశంలో ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెప్పిందని తెలిపాడు. తనకు ఎంతోమంది రాజకీయనేతలు పరిచయస్తులని, ఉన్నవి లేనివి కల్పించి మహిళను నమ్మించి ఆస్తులు కొనుగోలు చేయించి ఉంటాడని ఐటీ అధికారులు భావిస్తున్నారు. సుబ్రమణి మాటలు నమ్మిన విదేశీ మహిళ అతడి పేరుతో ఆస్తి కొనుగోలు చేయడానికి విదేశాల నుంచి బ్యాంక్ ద్వారా నగదు బదిలీ చేసినట్లు విచారణలో తేలింది. దీంతో సుబ్రమణి బంగ్లా కొనుగోలు చేశాడని వెల్లడైంది. కీలక పత్రాలు స్వాధీనం సుబ్రమణి ఉంటున్న విలాసవంతమైన విల్లాపై దాడిచేసిన ఐటీ అధికారులు కీలక ఫైళ్లను స్వాధీనం చేసు కుని పరిశీలించారు. ఈ సమయంలో కోట్లాది రూపాయల వి లువ చేసే ఆస్తిపత్రాలు లభించాయి. ప్రస్తు తం ఆస్తుల వివరాలు మొత్తం రూ.1 కోటి 60 లక్షలు అని అంచనా. ఐటీ అధికారులు సోదాల అనంతరం సుబ్రమణికి విచారణకు రావాలని నోటీస్‌లు జారీ చేశారు. -
మాయలోళ్లు
వరికుంటపాడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లోకసాని దుర్గా, లోకసాని రాజ్యలక్ష్మిలకు సర్వే నంబర్ 196లో 4 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూమి ఉంది. ఆ భూమిని సాగు చేసుకుంటూ వారు జీవనం సాగిస్తున్నారు. నాలుగు నెలల క్రితం కూడా భూములపై బ్యాంక్‌లో పంట రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు కనిపించడం లేదు. తహసీల్దార్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యలక్ష్మికి భర్త మరణించాడు. ఉన్న భూములు కూడా లేకుండా చేస్తే మా పరిస్థితి ఏమిటని బాధితురాలు రోదిస్తోంది. నెల్లూరు(పొగతోట): జిల్లాలోని దగదర్తి, బోగోలు, అల్లూరు తదితర మండలాల్లో వేల ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములు బినామీల పేర్లతో ఆక్రమణకు గురయ్యాయి. జిల్లాలో 787 సొసైటీలు ఉండగా 99,623 ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములు ఉన్నాయి. 65719 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సీజేఎఫ్ఎస్ సొసైటీలను రద్దు చేసి లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసేలా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రెవెన్యూ అధికారులు సీజేఎఫ్ఎస్ భూముల సర్వే పూర్తి చేశారు. లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ భూములు పొందిన వారిలో అనేక మంది భూముల్లో లేరు. భూస్వాములు ఈ భూములను కొనుగోలు చేశారు. కొన్నిచోట్ల లబ్ధిదారులు భూముల్లో లేకపోవడంతో బినామీ పేర్లతో భూములు స్వాహా చేసేందుకు అధికారపార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారపార్టీ నాయకులు చెప్పిన విధంగా అనేక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు నడుచుకుంటూ వారు సూచించిన పేర్లతో నివేదికలు సిద్ధం చేసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అనేక మంది మరణించారు. వారి వారసులు, కుటుంబ సభ్యులు భూములను సాగు చేసుకుంటున్నారు. మరణించిన వారి పేర్లను రికార్డుల నుంచి తొలగించి బినామీ పేర్లను చేర్చారు. పట్టాలు అర్హులైన వారి వద్ద ఉంటే రెవెన్యూ రికార్డుల్లో మాత్రం బినామీల పేర్లు దర్శనమిస్తున్నాయి. బినామీ పేర్లతో విలువైన పేదల భూములు కాజేసేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దాని ప్రకారం అధికారులతో చర్చించి బినామీల పేర్లు పట్టాలు మంజూరు చేయించేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోంది. రెవెన్యూ ఉద్యోగుల వసూళ్లు సొసైటీలను రద్దు చేసి లబ్ధిదారులకు పట్టాలు అందజేసే ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే మాటను రెవెన్యూ ఉద్యోగులు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. పట్టాలు కేటాయిస్తున్నామంటూ ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. తాము పేద ప్రజలమని, నగదు ఇవ్వలేమని లబ్ధిదారులు ప్రాధేయపడుతున్నా కనీసం రూ.2 వేలైనా ఇవ్వాలని, లేకుంటే పట్టాలు రావంటూ రెవెన్యూ ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలో అనేక పంచాయతీల్లో సీజేఎఫ్ఎస్ జాబితాల్లో రెవెన్యూ ఉద్యోగుల పేర్లు ఉన్నాయి. గూడూరు, ఆత్మకూరు, కావలి డివిజన్లలోని మండలాల్లో సీజేఎఫ్ఎస్ జాబితాలో రెవెన్యూ సిబ్బంది పేర్లు కూడా ఉన్నాయి. ఈ విషయంపై కొంతమంది తహసీల్దార్లు మాట్లాడుతూ సిబ్బంది తల్లిదండ్రులకు భూములు ఉంటే వాటిని కుమారులకు కేటాయించడం జరుగుతుందని సమాధానం ఇవ్వడం గమనార్హం. రెవెన్యూ సిబ్బంది తల్లిదండ్రులకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అందరి పేర్లు జాబితాలో ఉండాలి. రెవెన్యూ సిబ్బంది పేర్లు మాత్రమే జాబితాలో ఉండడం గమనార్హం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అక్రమంగా వసూలు చేస్తే కఠిన చర్యలు సీజేఎఫ్ఎస్ భూములకు సంబంధించి పట్టాలు కేటాయించే ప్రక్రియ జరుగుతోంది. సర్వే ప్రక్రియ పూర్తయింది. అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. పట్టాల మంజూరు విషయంలో లబ్ధిదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామంలోని సర్వే నంబర్లు 46/3, 46/4, 46/5లలో కొండయ్య, మాల్యాద్రి, వెంకటస్వామిలకు 1976వ సంవత్సరంలో సీజేఎఫ్ఎస్ భూములను కేటాయించారు. లబ్ధిదారులు ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2002వ సంవత్సరానికి ముందు ఈ భూములను ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. భూములు కేటాయించే సమయానికి ఇద్దరు లబ్ధిదారుల వయస్సు ఒకరికి 12, మరొకరికి 8 సంవత్సరాలు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి సీజేఎఫ్ఎస్ భూములు కేటాయించడం గమనార్హం. 1979, 1982లో జన్మించిన వ్యక్తులకు 1992లో భూములు కేటాయించినట్లు అధికారులు రికార్డులు సృష్టించారు. అధికారపార్టీ నాయకులు, అధికారులు తలచుకుంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు. భూములు ఆక్రమించిన వారు అధికారపార్టీ నాయకులకు కావాల్సిన వారు కావడంతో అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బాధితులు తమకు న్యాయం చేయాలని 16 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. -
బాపట్లలో సీబీఐ ప్రకంపనలు
బాపట్ల: నకిలీ పత్రాలు, బినామీ పేర్లతో ఐడీబీఐ బ్యాంకుకు టోకరా పెట్టిన వ్యవహారం బాపట్ల నియోజకవర్గాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు గండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు బాపట్లకు చెందినవారే. ఈ కేసులో బినామీలుగా ఉన్న 253 మంది కూడా బాపట్లకు చెందిన వారు కావడం, సీబీఐ అధికారులు కేసు దర్యాప్తును వేగవంతం చేయడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 2010 సంవత్సరంలో జరిగిన ఈ స్కాములో సీబీఐ అధికారులు విశాఖపట్నంలో మూడు కేసులు, హైదరాబాద్ ఒక కేసులో ప్రధాన నిందితులతోపాటు మరో 253 మందిని నిందితులుగా తేల్చారు. వారి నుంచి అసలు, వడ్డీ కలిపి రూ.141.12 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాన నిందితులుగండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు, ఐడీబీఐ బ్యాంకు అప్పటి మేనేజర్ హరీష్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో మరో ఎఫ్ఐఆర్ గండూరి మల్లికార్జునరావు, మడా సుబ్రహ్మణ్యం, మడా శ్రీనివాసరావు ఐడీబీఐ బ్యాంకులో నకిలీ పత్రాలు, బినామీ పేర్లుతో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోవటంతో సంస్థ జనరల్ మేనేజర్ ధనుంజయ్‌లాలే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చి 22వ తేదీన హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. రూ.33.81కోట్ల అసలు, వడ్డీతో కలిపి రూ.93.73కోట్లు బ్యాంకుకు చెల్లించాలని 142 మందిపై కేసు నమోదు చేశారు. విశాఖపట్నంలో గతేడాది జనవరి 23వ తేదీన రూ.10.42 కోట్లు అసలు, వడ్డీతో కలిపి రూ.20 కోట్ల బకాయిలు చెల్లించాల్సిన 45 మందిపై కేసు నమోదు చేశారు. గత ఏడాది జనవరి 28వ తేదీన రెండో ఎఫ్ఐఆర్లో అసలు, వడ్డీ కలిపి రూ.17.09 కోట్లు చెల్లించాలని 35 మందిపై, అసలు వడ్డీ కలిపి రూ.10.14కోట్లు చెల్లిం చాలని 25 మందిపై మూడో ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ప్రధాన నిందితులతోపాటు బ్యాం కులో ఆస్తులకు సంబంధించిన అంచనాలు వేసినవారిలో మరో ఆరుగురు సహా 253 మందిపై కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితులను అరెస్టు కావడంతో ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న నిందితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కువ మంది చిన్న, సన్నకారురైతులు, వ్యవసాయకూలీలే. పనికి వెళ్లకపోతే పూటగడవని కూలీలను కూడా బినామీలుగా చూపటం తీవ్ర చర్చానీయాంశమైంది. -
మెట్రోలో కేసీఆర్ అవినీతి పై విచారణ జరపాలి..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆస్తులు పెంచుకోవడానికి తెలంగాణ రాలేదన్నారు. గతంలో మెట్రో ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేసింది, సుల్తాన్ బజార్లో డిజైన్ మార్చాలన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. పురాతన సంపద పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పాత డిజైన్‌కే కేసీఆర్ ఎందుకు ఓకే చెప్పారో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ వాటాను అమ్మేందుకు కుట్ర ‘హైటెక్స్‌లో 52 ఎకరాలు, డెలాయిట్ బిల్డింగ్, విజయవాడలో ఎయిర్పోర్ట్ ముందు 31 ఎకరాలు, వైజాగ్‌లో 2 ఎకరాల భూములను, హైటెక్స్ బిల్డింగ్‌లో 15 వేల స్వ్కేర్ ఫీట్‌ని ఎల్ అండ్ టీ నుంచి కేసీఆర్ బినామీలు సొంతం చేసుకున్నారు. 1200 కోట్ల ఆస్తులు ఎల్ అండ్ టీ నుంచి బినామీ కంపెనీకి బదలాయింపు జరిగాకే పాత మెట్రో డిజైన్‌కు కేసీఆర్ ఓకే చెప్పారు. కేసీఆర్ ధన దాహంతో మెట్రోలోని ప్రభుత్వ వాటాలను కూడా అమ్మేందుకు కుట్ర జరుగుతుంది. ఆయన కుటుంబం ఎల్ అండ్ టీ ఆస్తులను బలవంతగా రాయించుకున్నది వాస్తవం. హెచ్ఎండీ ఆస్తులను అమ్మి మైహోం జూపల్లి కోసం రాయదుర్గం మెట్రోను నిర్మించాల్సిన అవసరం ఏముంది. నా ఆరోపణలపై స్పందించకుండా తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారు. స్పందిస్తే నిజాలు బయటపడతాయనే సీఎం, మంత్రులు మాట్లాడటం లేదు. తప్పుడు వాదనలు చేయలేకనే ఏజీ ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేశారు’ అని రేవంత్ ఆరోపించారు ఆంధ్ర ఉద్యోగులకు అందలాలు.. ‘మెట్రోలో కేసీఆర్ అవినీతికి అనుకూలంగా ఉన్నందుకే ఆంధ్రకు చెందిన ఎన్వీఎస్ రెడ్డిని మెట్రోకు శాశ్వత ఎండీగా నియమించారు. కేసీఆర్ పాలనలో ఆంధ్ర ఉద్యోగులకు అందలమెక్కిస్తున్నారు. అట్టడగు వర్గాలకు చెందిన విద్యార్థులను ఎవరెస్టు ఎక్కించిన తెలంగాణ బిడ్డ ఐసీఎస్ ప్రవీణ్ కేసీఆర్‌కు కనబడరు. కేటీఆర్ సెక్యూరిటీ లేకుండా అసదుద్దీన్‌తో చర్చలు జరిపింది పాతబస్తీ మెట్రో తరలింపును ప్రశ్నించకుండా ఉండటానికే. పాతబస్తీలో రావాల్సిన మెట్రోని రాయదుర్గంకు తరలిస్తున్నారు’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
ఎవరికి బినామీ?
-
అండర్‌గ్రౌండ్ రాజు
భూగర్భ(అండర్‌గ్రౌండ్) డ్రెయినేజీ పనుల్లో ఆయన చక్రం తిప్పుతున్నారు. తూరల సరఫరా, బినామీ కాంట్రాక్టులతో రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. నల్లజర్లకు చెందిన ఈ ముఖ్య ప్రజాప్రతినిధి అధికారాన్ని అడ్డంపెట్టుకుని నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఎంచక్కా జేబు నింపుకుంటున్నారు. ఆ కథాకమామిషు.. టాస్క్‌ఫోర్స్: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా భూగర్భ డ్రెయినేజీ పనులు చేపట్టారు. 70 శాతం ఉపాధి హామీ, 20 శాతం జెడ్పీ, 10 శాతం పంచాయతీ నిధులతో ఈ పనులు చేపట్టారు. కొన్నిచోట్ల పంచాయతీ వాటా భరించలేకపోతే దాతల ద్వారా సమకూరుస్తున్నారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగానికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. ‘తూతూర’మంత్రంగా నల్లజర్లకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి సొంత మండలం నల్లజర్లలోనే 23 గ్రామాల్లో ఏకంగా రూ.35 కోట్ల విలువైన పనులు చేస్తున్నారు. తొలుత 11 స్మార్ట్ గ్రామాల్లో పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో ఎక్కడా నిబంధనలు పాటించలేదని సమాచారం. ఉపాధి పనులను కూలీలతో చేయించాల్సి ఉన్నా.. పొక్లెయిన్లతోనే కాలువలు తవ్వించారు. జాబ్ కార్డులూ టీడీపీ కార్యకర్తల పేరుతో ఇప్పించి పనులు చేసిన తర్వాత వాళ్ల ఖాతాల్లో సొమ్ములను వెనక్కి తీసుకుంటున్నారు. ఒక్కో కిలోమీటరు భూగర్భ డ్రెయినేజీకి అవసరమైన తూరలకు రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఒక్క నల్లజర్ల మండలంలో సుమారు 120 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ పనులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అంటే సుమారు రూ.17 కోట్ల నుంచి రూ.18 కోట్ల మేరకు తూరల కోసం వెచ్చించినట్టు సమాచారం. ఇక తాడేపల్లిగూడెం, దేవరపల్లి, ద్వారకాతిరుమలతోపాటు మిగిలిన మండలాలకూ తూరలను ఈ ప్రజాప్రతిని«ధే సరఫరా చేశారు. ఈ తూరల నాణ్యత అంతంత మాత్రమేనని సమాచారం. ప్రజా ప్రతినిధి కావడంతో అధికారులూ నోరుమెదపట్లేదు. బినామీ పేర్లతో కాంట్రాక్టులు భూగర్భ డ్రెయినేజీ పనులన్నీ ఈ ప్రజాప్రతినిధి బినామీ కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తున్నారు. జగన్నాథపురం గ్రామాన్ని ఆయన సోదరుడు దత్తత తీసుకున్నారు. ఇక్కడ రూ.84.90 లక్షల విలువైన 9 పనులను ఆయనే బినామీ పేర్లతో చేపట్టారు. పుల్లలపాడులో రూ.60 లక్షల విలువైన పనులను అనుచరుడైన నామినేటేడ్ పదవిలో ఉన్న ఓ యువ నాయకుడు, స్థానిక ప్రజాప్రతినిధి చేశారు. నల్లజర్లలో పనులను నలుగురు టీడీపీ నేతలకు అప్పగించారు. ఇక్కడ రూ.2కోట్ల 94 లక్షల 50వేలతో 30 పనులు చేపట్టారు. మాజీ ప్రజాప్రతినిధికి ఐదు వార్డుల్లో పనులు అప్పగించారు. మరో ముగ్గురు స్థానిక ప్రజాప్రతినిధులకు మిగిలిన పనులు అప్పగించారు. గత ఎన్నికల్లో సహకరించడం వల్లే వారికి అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ మూడు గ్రామాల్లో రూ.4.39 కోట్లు విలువైన చేపట్టారు. దాదాపు ఇవి పూర్తయ్యాయి. అయితే నాణ్యత అంతంతే. పడమర చోడవరంలో రూ.52.10 లక్షల పనులు జరగ్గా, స్థానిక ప్రజా ప్రతినిధికి 20 శాతం వాటా ఇచ్చి 80 శాతం ముఖ్యప్రజాప్రతినిధికి ఇచ్చేట్టు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. అనంతపల్లి రూ.2 కోట్ల 75లక్షల 70 వేలు విలువైన పనులను స్థానిక మండల ప్రజాప్రతినిధి చేపట్టారు. గత ఎన్నికల్లో ఈయన ముఖ్య ప్రజాప్రతినిధికి రూ.60 లక్షలు సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. మారేళ్లమూడిలో రూ.85 లక్షల పనులు చేపట్టారు. ఇక్కడ ప్రజా ప్రతినిధి భర్తను అడ్డుపెట్టుకుని ముఖ్య ప్రజాప్రతినిధి స్వయంగా పనులు చేయిస్తున్నారు. శింగరాజుపాలెం రూ.1.35 లక్షల విలువైన పనులను ఓ ప్రజాప్రతినిధి భర్త ద్వారా చేస్తున్నారు. తిమ్మన్నపాలెంలో రూ.25 లక్షలతో చేపట్టిన పనులను నల్లజర్లకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ద్వారా చేయించారు. అచ్చన్నపాలెంలో రూ.54 లక్షల 50 వేలు స్థానిక ప్రజాప్రతినిధి భర్త ద్వారా కౌలూరులో రూ.59.40 లక్షల పనులను స్థానిక ప్రజాప్రతినిధి భర్త ద్వారా చేయిస్తున్నారు. పోతవరంలో రూ.3 కోట్ల విలువైన పనులను ముఖ్య ప్రజాప్రతినిధి సన్నిహితుడు చేపట్టారు. పట్టించుకోని నిబంధనలు నల్లజర్ల మండలంలో చేపట్టిన డ్రెయినేజీ పనులను చూస్తే నిబంధనలు పాటించలేదని స్పష్టమవుతోంది. ప్రధాన డ్రెయిన్ నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయి. కాంక్రీటు వేయకుండానే కేవలం ఇసుక వేసి దిమ్మెలు కట్టి పైపులు అమర్చారు. మురుగునీటి ప్రవాహానికి ఏర్పాట్లు చేయలేదు. సిమెంటు రోడ్లను ఇష్టారీతిన ధ్వంసం చేస్తున్నారు. నల్లజర్ల గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ అవుట్లెట్లను శివారున ఉన్న నల్ల, ఎర్ర చెరువులకు కలిపారు. ఇవి కలుషితమయ్యే దుస్థితి నెలకొంది. అయ్యవారి తూరలే..! డ్రెయినేజీ పనులకు సరఫరా చేసేందుకు ముఖ్య ప్రజాప్రతిని«ధి బినామీ పేర్లతో రెండు తూరల కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటిద్వారా సరఫరా అవుతున్న తూరల నాణ్యత అంతంతే. దీనికి జిల్లా ఉన్నతాధికారి ప్రోత్సాహం ఉందని సమాచారం. ఇబ్బందులే ఎక్కువ అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేపట్టిన గ్రామాల్లో మురుగునీరు సరిగా పారడం లేదు. దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో సుమారు రూ.4 కోట్లతో డ్రెయినేజీ పనులు చేపట్టారు. ఇక్కడ మురుగునీరు పారక స్థానికులు ఇబ్బందులు పడుతున్నా రు. మ్యాన్‌హోల్స్ పొంగుతున్నాయి. రోడ్లపై నీరు పారుతోంది. వసూళ్ల దందా ఈ ప్రజాప్రతినిధి వసూళ్ల దందా కూడా చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల నల్లజర్లలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు దాతల నుంచి చందాలు వసూలు చేసి రూ. పదిలక్షల మేర మిగుల్చుకున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం మండలంలో ఓ గ్రామంలో బస్‌షెల్టర్ కోసమని నల్లజర్లలో సంక్రాంతి కోడి పందేల నిర్వహణకు రూ.6 లక్షలకు వేలం పెట్టినట్టు సమాచారం. -
రైతు బజారుల్లో బినామిల హవా
హోటళ్లకు భారీగా సరఫరా ప్రజలకు దక్కని కూరగాయాలు జాడలేని రైతులు పట్టించుకోని అధికారులు దళారుల బారిన పడకుండా కష్టానికి తగిన ప్రతిఫలం పొందేందుకు రైతుల కోసం రెండు దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన రైతుబజారులు నేడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. రైతులే తమ పొలాల్లో పండించిన స్వచ్ఛమైన తాజా కూరగాయలను రైతు బజారుకు తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ అందంతా ఒకప్పటి మాట. ఇప్పుడు బినామీ పేర్లతో బయటి వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. రైతులు రైతుబజారుల బయట సైకిళ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారు. ఈ విషయం ఎస్టేట్ అధికారులతో పాటు, ఉన్నతాధికారులకు తెలిసిందే. కానీ పట్టించుకోరంతే - కోటగుమ్మం (రాజమహేంద్రవరం) జిల్లాలో రాజమహేంద్రవరంలో ఏడు, కాకినాడలో రెండు, అమలాపురంలో ఒకటి, కొత్తపేటలో ఒకటి, రామచంద్రపురంలో ఒకటి, రావులపాలెంలో ఒకటి, మండపేటలో ఒక రైతు బజారు ఉంది. రాజమహేంద్రవరానికి దోసకాయలపల్లి, కోరుకొండ, సీతానగరం, బొబ్బిల్లంక, మునగాల, తదితర ప్రాంతాలు, మిగిలిన రైతు బజార్లకు ఆయా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు కూరగాయలు పండించి తీసుకువస్తుంటారు. జిల్లా నలుమూలలకు చెందిన సుమారు 1200 మంది రైతులు, పొదుపు మహిళా సంఘాలకు, వారి ఆర్థికాభివృద్ధికి ఆసరాగా ఉన్న రైతు బజార్లు పర్యవేక్షణ లోపాల వల్ల అస్తవ్యస్తంగా మారుతున్నాయి. రైతుల స్థానంలో బినామీ వ్యాపారులు లాభపడుతున్నారు. మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, ఉద్యానశాఖ ఉద్యోగుల ఉదాసీన విధానం వల్ల సమస్యలు శృతి మించుతున్నాయి. గుర్తింపు కార్డులు లేకుండానే.. జిల్లాలో 14 రైతు బజార్లు ఉన్నాయి. అయితే పలు రైతు బజార్లలో చాలా మంది రైతులు గుర్తింపు కార్డులు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రశ్నిస్తే కార్డులు చిరిగిపోయాయంటున్నారు. మరికొందరు కార్డులు పోగొట్టుకున్నారు. ఇదే ఆసరాగా కొందరు ఎస్టేట్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధుల సిఫార్సుల నెపంతో బినామీ వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూరలు పక్కదారి.. ఉదయమే పార్లర్లు, రెస్టారెంట్ల సిబ్బంది వచ్చి అధిక పరిమాణంలో కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల తాము వచ్చేసరికి రైతుబజారులో కూరగాయాలు చాలా వరకు అయిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఇక తూనికల్లో తేడాలు సరేసరి. కొన్ని స్టాళ్లలో ఎలక్ట్రానిక్ కాటాలు మూలకు చేరాయి. మర్చిపోయిన జంబ్లింగ్ జాయింట్ కలెక్టర్లు మారిపోయినా బజార్లలో జంబ్లింగ్ జరగలేదు. గతంలో ఏడాదికోసారి జంబ్లింగ్ పద్దతిని పాటించే వారు. అయితే ఎనిమిదేళ్లుగా జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఫైలు ఉన్నతాధికారుల వద్ద ఉందంటూ మార్కెటింగ్ శాఖ సిబ్బందే చెబుతున్నారు. ఒక్కో రైతు బజారులో ఒక ఎస్టేట్ ఆఫీసర్, ఒక అటెండర్ మాత్రమే ఉండడంతో పని ఒత్తిడి అధికంగా ఉంటోంది. బియ్యం వ్యాపారులు దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. దాంతో పాత వ్యాపారులే ఇక్కడ పాతుకుపోయారన్న విమర్శలు ఉన్నాయి. సమస్యలతో సతమతమవుతున్న రైతు బజార్లను అధికారులు గాడిలో పెట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. -
లావాదేవీలకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష
బినామీ వ్యవహారంతో సంబంధమున్న అందరిపై చర్యలు: ఐటీ ♦ ఆస్పత్రులకు వెళ్లి నగదు మార్పిడి చేస్తున్న పోస్టల్ శాఖ ♦ నోట్ల రద్దుపై ఓటింగ్‌తో కూడిన చర్చ జరగాలి: ఖర్గే న్యూఢిల్లీ: అక్రమార్కుల భరతం పట్టేందుకు ఐటీ శాఖ ఉచ్చు బిగిస్తోంది. పాతనోట్ల రద్దు అనంతరం ఇతరుల ఖాతాల్లో భారీగా నల్లధనం డిపాజిట్ చేస్తున్న వారిపై బినామీ చట్టం ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ మరోసారి కొరడా ఝళిపించనుంది. లెక్క చూపని పాత నోట్లను అక్రమ పద్దతుల్లో మార్చుకునేందుకు ప్రయత్నిస్తే... బినామీ వ్యవహారాల చట్టం కింద పెనాల్టీ, విచారణతోపాటు ఏడేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష తప్పదని వెల్లడించింది. తనిఖీలు, నిఘా సమాచారం ద్వారా రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆదాయాన్ని రద్దైన నోట్ల రూపంలో మార్చుకున్నట్లు ఇప్పటికే గుర్తించామని ఐటీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 8 నుంచి దాదాపు రూ. 50 కోట్లను సీజ్ చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. నవంబర్ 8 నుంచి భారీగా నగదు డిపాజిట్ చేస్తున్న అనుమానాస్పద ఖాతాలపై నిఘా పెట్టిన ఐటీ ఇప్పటికే చాలా ఖాతాలు గుర్తించింది. ఆ సొమ్ము అక్రమమని తేలితే బినామీ చట్టం ప్రయోగిస్తామని, స్థిర, చరాస్తులు రెండిటికీ ఈ చట్టం వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. ఆస్తుల స్వాధీనంతో పాటు డిపాజిట్ చేసిన వ్యక్తి, అందుకు అనుమతించిన వారిపై చర్యలు తీసుకునేందుకు బినామీ చట్టం అధికారం కల్పిస్తోంది. జైలు శిక్షతో పాటు జరిమానా ఇతరుల ఖాతాలో నల్లధనం డిపాజిట్ చేసేవారిని బెనిఫిషియల్ ఓనర్ అని, నగదు వేసేందుకు అనుమతించిన వ్యక్తిని బినామీదారుగా ఈ చట్టం పేర్కొంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బినామీదారు, బెనిఫిషియల్ ఓనర్, బినామీ వ్యవహారంతో సంబంధమున్న ఇతర వ్యక్తులకు ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు, నగదును స్వాధీనం చేసుకుని 25 శాతం వరకూ జరిమానా విధించవచ్చు. ఇతరుల బ్యాంకు ఖాతాల్ని వాడుకుంటూ నల్లధనాన్ని సక్రమంగా మార్చుకునేవారిపై నిరంతర నిఘా పెట్టాలంటూ ఐటీ శాఖను సీబీడీటీ(ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు) ఇంతక ముందే కోరింది. నోట్ల రద్దుపై జీఎస్టీ భేటీలో రాష్ట్రాల ఆందోళన నోట్ల రద్దుతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం పడుతోందని ఢిల్లీలో జరిగిన జీఎస్టీ సమావేశంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుపడడంతో పాటు, పన్ను ఆదాయం తగ్గిందని బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా పేర్కొన్నారు. ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయంటూ యూపీ మంత్రి వెల్లడించగా, ఆదాయాలు కోల్పోతున్నామనే ఆందోళనలో చాలా రాష్ట్రాలు ఉన్నాయని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ చెప్పారు. ఆదాయాలు పడిపోయాయని, ఉపాధి రంగం దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తమైనా... నిర్ణయం వెనక్కి తీసుకోమని మాత్రం ఏ రాష్ట్రం కోరలేదని తెలిసింది. ఆస్పత్రులకే పోస్టల్ సిబ్బంది నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న రోగుల కోసం ఆస్పత్రులకే వెళ్లి నగదు మార్పిడిని పోస్టల్ శాఖ ప్రారంభించింది. ఇంతవరకూ రూ. 25 లక్షల నగదు మార్చినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇందు కోసం అనేక బృందాల్ని ఏర్పాటు చేశామని చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్(ఢిల్లీ సర్కిల్) ఎల్ఎన్ శర్మ చెప్పారు. డిసెంబర్ 30 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. రూల్ 56 మేరకు చర్చించాలి: ఖర్గే నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎలాంటి సన్నాహాలు లేకుండా హడావుడిగా తీసుకున్నారని, దీనిపై ఓటింగ్‌కు అవకాశముండే నిబంధనల మేరకు పార్లమెంట్లో పూర్తి స్థాయి చర్చ జరగాలని ప్రతిపక్షం కోరుతుందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ పార్టీ రూల్. 56 కింద చర్చ కోరుతుండగా... ప్రభుత్వం మాత్రం ఓటింగ్‌కు అవకాశం లేని రూల్ 193 కింద చర్చ జరగాలని కోరుతుందన్నారు. -
చంద్రబాబు మంత్రివర్గంలో నేరస్తులా?
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులు మహిళలను వేధించిన కేసుల్లో ఉండటం, దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి ఒకరు ఉండటం దారుణమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ ఒక నివేదికలో ఈ విషయాలను వెల్లడించిందని తెలిపారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె.అచ్చెన్నాయుడుపై మహిళలపై అఘాయిత్యం చేసిన కేసులున్నాయన్నారు. రాజధాని అమరావతి చుట్టూ భూములు కొనుగోలు చేసి, చంద్రబాబు బినామీగా వ్యవహరిస్తున్న పి.నారాయణ దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి అని ఏడీఆర్ సంస్థ వెల్లడించిందని భూమన తెలిపారు. చంద్రబాబు కాదు.. గాడ్సేబాబు విజయవాడలో గాంధీజీ విగ్రహాన్ని కూల్చి వేసి, ఇబ్రహీంపట్నం వద్ద బుడమేరులో పారేయడం దారుణమని, దీనిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని భూమన అన్నారు. జాతిపితకు చంద్రబాబు ఇస్తున్న గౌరవం దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు.బాబు, గాడ్సే కన్నా హీనుడని ఆయన మామ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.గాంధీ విగ్రహాన్ని కూల్చేడం చూస్తే ఆయనను చంద్రబాబు కాదు, గాడ్సేబాబు అనాలా? అని ప్రశ్నించారు. -
'మంత్రి నారాయణ చంద్రబాబు బినామీ'
హైదరాబాద్: దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి నారారాయణ చంద్రబాబు కేబినెట్ లో ఉన్నారని ఏడీఆర్ నివేదిక బయటపెట్టిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమరావతి చుట్టుపక్కల భూములను కొనేయడం ద్వారా భూ దందాకు తెర తీసి వేల కోట్లకు నారాయణ పడగలెత్తారని ఆరోపించారు. నారాయణ.. చంద్రబాబు బినామీ అని పునరుద్ఘాటించారు. రాజధాని భూ దందాపై సీబీఐ దర్యాప్తు చేయించాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతిని భూమన గుర్తు చేశారు. అవినీతి, భూ దందా, మహిళల పట్ల అమానవీయంగా ప్రవర్తించడంలో చంద్రబాబు దూసుకుపోతున్నారని దుయ్యబట్టారు. పుష్కర ఆహ్వానాలపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదా సాధనపై చంద్రబాబుకు లేదని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రైవేటు బిల్లు చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యవహరించి తీరు అభ్యంతకరమన్నారు. బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. విజయవాడలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గాడ్సే కంటే తన అల్లుడు హీనుడని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. జాతిపితకు ఇంత అవమానం జరిగినా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదన్నారు. గాడ్సే బాబు అని పిలవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని భూమన ధ్వజమెత్తారు. -
'మంత్రి నారాయణ చంద్రబాబు బినామీ'
-
ఇన్కమ్ డిక్లరేషన్‌పై అవగాహన అవసరం
ఇన్కమ్ సర్టిఫికెట్, ఫిక్కీ, బినామీలు బీచ్‌రోడ్ : బినామీ పేర్లు మీద ఆస్తులపై తమ పేరు ఉండాలి అంటే... ప్రతి ఒక్కరూ ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్‌లో భాగం కావాలని ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బి.జి.రెడ్డి కోరారు. ఒక ప్రైవేట్ హోటల్లో సోమవారం ఫిక్కీ ఆధ్వర్యంలో ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్‌లో ఇది వరకే తమ పూర్తి ఆదాయంపై పన్ను చెలించని వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా తమ అప్రకటిత ఆదాయన్ని లేదా ఆస్తులను తెలియపరచి పన్ను చెల్లించే అవకాశం ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ పథకం 30–09–2016 వరకు అందుబాటులో ఉంటుందని అప్పటికీ ఇంకా ఎవరైనా పన్ను చెల్లించకపోతే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. తమ వద్ద కేవలం విశాఖ నగరానికి చెందిన లక్ష అప్రకటిత లావాదేవీలు వివరాలు ఉన్నాయన్నారు. ఈ ప«థకం ద్వారా పన్ను చెల్లించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని, అలాగే మిగిలిన శాఖల నుండి ఎటువంటి ఇబ్బందులు వారికి రాకుండా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ శాఖలకు జీఓను జారీ చేసిందని వివరించారు. ఈ సదస్సులో సీహెచ్. ఓంకారాశ్వర్ మాట్లాడుతూ తమ వద్ద ఆరేళ్లుగా జరిగిన అప్రకటిత లావాదేవీలు వున్నాయి కాబట్టి ఎవరూ పన్ను చెల్లించకుండా తప్పించుకోలేరని హెచ్చరించారు. అందువల్ల ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకుని సక్రమంగా పన్ను చెల్లించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా సదస్సులో పలువురు వెలిబుచ్చిన సందేహాలకు బదులిచ్చారు. -
చంద్రబాబు బినామీకి రూ.320కోట్ల ప్రాజెక్టు..!
-
గ్రేటర్లో బినామీ రేషన్ డీలర్ల దందా
సిటీబ్యూరోః గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ చౌకధరల దుకాణాల నిర్వహణ అస్థవ్యస్తంగా తయారైంది. పలు దుకాణాలను అథికృత డీలర్లకు బదులు బినామీలు నిర్వహిస్తున్నట్లు బయటపడటంతో పౌరసరఫరాల శాఖ కన్నెర్ర చేసింది. సోమవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ అదేశాల మేరకు సంబంధిత అధికారులు సర్కిల్ వారిగా బినామీ షాపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ -రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల శాఖ పరిధిలో సుమారు 2252 పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. మొత్తం దుకాణాల్లో కనీసం 20 శాతం రేషన్ షాపుల అథికృత డీలర్‌కు బదులు మరొకరి నిర్వహణలో కొనసాగుతుండటంతో అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మరో 15 శాతం రేషన్ షాపుల డీలర్లు చనిపోవడం, సస్పెండ్ వంటి కారణాలతో ఇన్చార్జీల నిర్వహణలో కొనసాగుతున్నారు. 400 షాపులపైనే.. జంట జిల్లాల్లో సుమారు 20.28 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా. అందులో సుమారు 67.42 లక్షల మంది లబ్థిదారులు ఉన్నారు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా. ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపింణీ జరుగుతుంది. ఈ లెక్కన ప్రతి నెల పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం కోటా విడుదలవుతోంది. మొత్తం దుకాణాల్లో సుమారు 400పైగా బినామీల నిర్వహణలో ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. దీంతో సోమవారం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో సర్కిల్ వారిగా బినామీ నిర్వహణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.