దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రి నారారాయణ చంద్రబాబు కేబినెట్ లో ఉన్నారని ఏడీఆర్ నివేదిక బయటపెట్టిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమరావతి చుట్టుపక్కల భూములను కొనేయడం ద్వారా భూ దందాకు తెర తీసి వేల కోట్లకు నారాయణ పడగలెత్తారని ఆరోపించారు.