ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డి, అతని సన్నిహితుల నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ కేసులో ఇంతగా హడావుడి చేస్తున్న అదికారులకు చంద్రబాబు నాయుడు కనబడడం లేదా అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌పై జరుగుతున్న దాడుల్లో బయటపడుతున్న ఆస్తులు ఎవరివని.. అనుమానం వ్యక్తం చేశారు.