- సమస్యల పరిష్కారానికి మంత్రి ఈటెల హామీ
రేషన్ డీలర్ల ఆమరణ దీక్ష విరమణ
Published Thu, Aug 25 2016 12:05 AM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
హన్మకొండ : తమను ప్రభుత్వ ఉద్యోగులుగానైనా గుర్తించాలని, లేదా నెలకు కనీస వేతనం రూ.20 వేలు చెల్లించాల ని డిమాండ్ చేస్తూ హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ముగిసింది. రేషన్ డీలర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం మూడో రోజుకు చేరింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ దీక్ష విరమింపజేయించేందుకు టీఆర్‌ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిని శిబిరం వద్దకు పంపించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి దీక్ష చేపడుతున్న డీలర్లకు మంత్రి ఈటెల రాజేందర్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, దీక్ష విరమింపజేయాలని మంత్రి ఈటెల ఫోన్‌లో కోరారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి.. రమేష్‌బాబు, మోహన్‌కు నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేయించారు. అంత కు ముందు దీక్ష శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్లఅశోక్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చుక్కయ్యతో పాటు ఆయా పార్టీల నాయకులు సందర్శించి సంఘీబావం తెలిపారు.
Advertisement
Advertisement