ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: అక్రమంగా పోలీసులు తమ తండ్రిని నిర్భందించారన్న ఆగ్రహంతో ఇద్దరు యువతులు టవర్, వాటార్ ట్యాంక్ మీదకు ఎక్కేశారు. పులియరై పోలీస్‌స్టేషన్ సిబ్బంది నిర్వాకం వల్ల కేవలం 10 కేజీల బియ్యం వ్యవహారం, చివరకు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టేంచే పరిస్థితికి తీసుకొచ్చింది. తెన్‌కాశి జిల్లా సెంగోట్టై సమీపంలోని పులియరైకు చెందిన ప్రాన్సీస్ (55) కూలి కార్మికుడు. కరోనా కష్టాలతో కుటుంబ భారం పెరిగింది. దీంతో రేషన్ దుకాణం నుంచి తెచ్చుకున్న బియ్యంలో ఓ పది కేజీల్ని సమీపం బంధువుకు ఇచ్చి, ఆయన ఇచ్చే సొమ్ముతో ఇంటికి కావాల్సిన కూరగాయాల్ని కొనేందుకు నిర్ణయించాడు.
ఆమేరకు సైకిల్ మీద పది కేజీల బియ్యంతో వెళ్తుండగా, పులియరై పోలీసులు రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్నాడని పేర్కొంటూ, కేసు నమోదు చేశారు. అంతేకాదు, ఆయన్ని చితకొట్టి నేరాన్ని అంగీకరించేలా చేశారు. సోమవారం రాత్రి ఈతంతం సాగింది. మంగళవారం ఈ సమాచారం తెలుసుకున్న బాధితుడి కుమార్తెలు అజిత(22), అభితాలు(19) ఆగ్రహానికి లోనయ్యాడు. తామే కష్టాల్లో ఉంటే, పోలీసులు ఈ విధంగా వేధించడాన్ని తీవ్రంగా పరిగణించారు. తమ తండ్రిని విడిపించాలని పోలీసు ల్ని వేడుకున్నా ఫలితం లేదు. పోలీసులు కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పిన ప్రాన్సీస్‌ను సెంగోట్టై ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తండ్రి పరిస్థితిని చూసిన ఆ ఇద్దరు కుమార్తెలు న్యాయం కోసం ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యారు.
సెల్ టవర్, వాటర్ ట్యాంకర్ ఎక్కేశారు..
ఆస్పత్రికి సమీపంలోని వాటర్ ట్యాంక్ మీదకు చిన్నకుమార్తె, సెల్ టవర్ మీదకు పెద్దకుమార్తె ఎక్కేశారు. తము న్యాయం చేయాలంటూ నినాదించారు. దీనిని గుర్తించిన పోలీసులు వారిని బుజ్జగించే యత్నం చేశారు. అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి ఆ ఇద్దర్ని కిందకు దించేలోపు పొద్దు పోయింది. అయితే తమకు హామీ ఇచ్చిన పోలీసులు పత్తా లేకుండా పోవడంతో బుధవారం మరోమారు ఆ ఇద్దరు నిరసనకు దిగారు. ప్రాన్సీస్‌ను అక్రమంగా అరెస్టు చేసిన ఎస్‌ఐ మురుగేషన్, కానిస్టేబుల్ ముజీబ్‌పై చర్యలు తీసుకోవాలని, తమ తండ్రిని చితక్కొట్టిన వారిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం దిగొచ్చింది. ప్రాన్సిన్ మీద దాడి చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించారు.
చదవండి: 'ఆ రూపాయి నాణేం కోటికి కొంటాను'
Comments
Please login to add a commentAdd a comment