బాన్సువాడ : ‘నువ్వు ఆధార్ కార్డును ఇప్పటి వరకు ఇవ్వలేదు.. గవర్నమెంట్ నీకు రేషన్ సరుకు విడుదల చేయలేదు.. ఇంటికి వెళ్లిపో.. ఆధార్ తెస్తేనే రేషన్ సరుకు ఇస్తాం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..’ అంటూ రేషన్ డీలర్లు లబ్ధిదారులను రేషన్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతలో భాగంగా రా ష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వారు ఆధార్ కా ర్డును నమోదు చేయాలని ఆదేశించడం, రేషన్ డీల ర్లకు ఒకవైపు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెట్టగా, మరోవైపు ఆధార్ లేదని చెబుతూ లబ్ధిదారులకు రేషన్ ఇవ్వకుండా డీలర్లు లబ్ధి పొందుతున్నారు.
ఇంకా రేష న్ కార్డుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమే కాలేదు. కేవలం ఆధార్ కార్డుల ఫీడింగ్ మాత్రమే చేస్తుండగా, రే షన్ సరుకు మాత్రం ప్రస్తుతం ఉన్న కార్డులకు సరిప డా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే గత జూలై, ఆగస్టు నెలల సరుకుల్లో ప్రభుత్వం కోత విధించిందని, ఆధార్ కార్డు ఇవ్వని వారికి సరుకు ఇచ్చేది లేదని రేషన్ డీలర్లు మోసం చేయడం గమనార్హం. బాన్సువాడతోపాటు బిచ్కుంద, బీర్కూర్, కోటగిరి, వర్నీ, పిట్లం తదితర మండలాల్లో రేషన్ డీలర్లు కోత విధిస్తూ చతురతను ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆధార్ కార్డుల కోసం నమోదు కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నా, ఇప్పటి వరకు కార్డులు రాని వారు వేల సంఖ్యలో ఉన్నారు.
వారికి ఈఐడీనంబర్ మాత్రమే వచ్చింది. దీంతో వారు శాశ్వత నంబర్ కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. ఇప్పటికే ఆధార్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఆధార్ కార్డులు ఇస్తేనే తమ రేషన్ కార్డులు ఉంటాయని, లేని పక్షంలో ప్రభుత్వం బోగస్ కార్డు కింద లెక్క కట్టి, తొలగిస్తారని తెలుసుకొన్న నిరుపేద లబ్ధిదారులు ఒక్క బాన్సువాడలోనే సుమారు 4వేలకు పైగా ఉన్నారు. వీరికి ఆధార్ కార్డు ఇంకా రాకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన చెందుతున్నారు.
అయితే ఆధార్ కార్డునే సాకుగా చేస్తున్న రేషన్ డీలర్లు, ఇప్పటి నుంచే చేతివాటాన్ని ప్రద ర్శించి రేషన్‌లో కోత విధించారంటూ వారి పేరిట వచ్చిన రేషన్‌ను దబాయించుకోవడం శోచనీయం. ఈ విషయమై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురాగా, వారు సైతం పట్టించుకోవడంలేదని వార్డు సభ్యుడు అక్బర్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి రోజు అనేక మంది లబ్ధిదారులు తమకు రేషన్ సరుకులు ఇవ్వడం లేదంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, తాము సైతం అధికారులకు ఫిర్యాదు చేసినా వారు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. అధికారులు స్పం దించి రేషన్‌లో కోత విధించకుండా అందరికీ రేషన్ సరుకులు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
‘ఆధార్’ తెస్తేనే రేషన్ సరుకులు
Published Mon, Aug 11 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM
Advertisement
Advertisement