కిరోసిన్ ఆవిరవుతోంది
♦ పంపిణీ కాకుండా డీలర్ల వద్ద 3 లక్షల లీటర్ల నిల్వ
♦ జూన్ నెల నుంచి ఇదే పరిస్థితి
♦ ప్రమాద భయంతో రేషన్ డీలర్లు
ప్రభుత్వ అర్ధంతర ఉత్తర్వులతో డీలర్ల వద్ద మూడు నెలలుగా కిరోసిన్ నిల్వ అలాగే ఉంటోంది. జూన్ నుంచి పొగ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికే డీలర్లకు సరఫరా అయిన కిరోసిన్ పంపిణీని ఆపేసింది. ఇది పక్క దారి పడుతున్నట్లు సమాచారం.
మదనపల్లె రూరల్ : జూన్ నెలలో జిల్లా వ్యాప్తంగా చౌక దుకాణ డీలర్లకు కిరో సిన్ సరఫరా చేశారు. అంతలోనే పొగ రహిత రాష్ట్రంగా ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ ఆగిపోయింది. ప్రభుత్వం పంపిణీ చేసిన కిరోసిన్‌ను ఏం చేయా లో తెలియక డీలర్లు సతమతమవుతున్నారు. డీలర్ల వద్ద నిల్వ ఉన్న కిరోసిన్ ఇటు లబ్ధి్దదారులకు అందక, అటు ప్రభుత్వం వెనక్కు తీసుకోకపోవడంతో డీలర్లకు దిక్కుతోచడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల్లో బియ్యం, కిరోసిన్, పంచదార, గోధు మ, కంది పప్పు, ఉప్పు, చింతపండు పంపిణీని ప్రారంభించారు. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కిలో బియ్యం రూపాయికి ఇస్తూ పంచదార, కిరోసిన్‌తో పాటు తొమ్మిదిరకాల వస్తువులను పంపిణీ చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదట్లో వీటిని కొనసాగించినా, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈ–పోస్ విధా నం అమలులోకి తెచ్చి రేషన్ దుకా ణాల్లో ఒక్కొక్క సరుకుకు కోత విధిం చింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం చక్కెరపై ఇస్తున్న రాయితీని ఎత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ఇస్తున్న చక్కెర పంపిణీని నిలి పేసింది. ప్రస్తుతం చౌక దుకాణాల్లో బియ్యం, గోధుమపిండి మాత్రమే సరఫరా చేస్తున్నారు.
జూన్ వరకు తెలుపు రంగు రేషన్‌కార్డులు ఉన్న గ్యాస్ కనెక్షన్ లేని వారికి 2లీటర్లు, ఉన్న వారికి లీట ర్లు పంపిణీ చేసే వారు. ఉన్నట్లుండి కిరోసిన్ పంపిణీ నిలిపేసిన ప్రభుత్వం డీలర్ల వద్ద ఉన్న కిరోసిన్‌ను ఏంచేయాలనే దానిపై మార్గదర్శకాలు ఇవ్వలేదు. లక్షలాది లీటర్లు డీలర్ల వద్దే నిల్వ ఉండిపోయాయి. కొన్నిచోట్ల ప్రభుత్వం తిరి గి తీసుకోదన్న ధీమాతో కొందరు బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు సమాచా రం. కిరోసిన్‌ను తమకే పంపిణీ చేయా లని లబ్ధిదారులు కోరుతున్నారు.