kerosene distribution
-
కిరోసిన్ ఆవిరవుతోంది
♦ పంపిణీ కాకుండా డీలర్ల వద్ద 3 లక్షల లీటర్ల నిల్వ ♦ జూన్ నెల నుంచి ఇదే పరిస్థితి ♦ ప్రమాద భయంతో రేషన్ డీలర్లు ప్రభుత్వ అర్ధంతర ఉత్తర్వులతో డీలర్ల వద్ద మూడు నెలలుగా కిరోసిన్ నిల్వ అలాగే ఉంటోంది. జూన్ నుంచి పొగ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికే డీలర్లకు సరఫరా అయిన కిరోసిన్ పంపిణీని ఆపేసింది. ఇది పక్క దారి పడుతున్నట్లు సమాచారం. మదనపల్లె రూరల్ : జూన్ నెలలో జిల్లా వ్యాప్తంగా చౌక దుకాణ డీలర్లకు కిరో సిన్ సరఫరా చేశారు. అంతలోనే పొగ రహిత రాష్ట్రంగా ప్రభుత్వం ప్రకటిం చింది. దీంతో కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ ఆగిపోయింది. ప్రభుత్వం పంపిణీ చేసిన కిరోసిన్‌ను ఏం చేయా లో తెలియక డీలర్లు సతమతమవుతున్నారు. డీలర్ల వద్ద నిల్వ ఉన్న కిరోసిన్ ఇటు లబ్ధి్దదారులకు అందక, అటు ప్రభుత్వం వెనక్కు తీసుకోకపోవడంతో డీలర్లకు దిక్కుతోచడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల్లో బియ్యం, కిరోసిన్, పంచదార, గోధు మ, కంది పప్పు, ఉప్పు, చింతపండు పంపిణీని ప్రారంభించారు. కిరణ్‌కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కిలో బియ్యం రూపాయికి ఇస్తూ పంచదార, కిరోసిన్‌తో పాటు తొమ్మిదిరకాల వస్తువులను పంపిణీ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మొదట్లో వీటిని కొనసాగించినా, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈ–పోస్ విధా నం అమలులోకి తెచ్చి రేషన్ దుకా ణాల్లో ఒక్కొక్క సరుకుకు కోత విధిం చింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం చక్కెరపై ఇస్తున్న రాయితీని ఎత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ఇస్తున్న చక్కెర పంపిణీని నిలి పేసింది. ప్రస్తుతం చౌక దుకాణాల్లో బియ్యం, గోధుమపిండి మాత్రమే సరఫరా చేస్తున్నారు. జూన్ వరకు తెలుపు రంగు రేషన్‌కార్డులు ఉన్న గ్యాస్ కనెక్షన్ లేని వారికి 2లీటర్లు, ఉన్న వారికి లీట ర్లు పంపిణీ చేసే వారు. ఉన్నట్లుండి కిరోసిన్ పంపిణీ నిలిపేసిన ప్రభుత్వం డీలర్ల వద్ద ఉన్న కిరోసిన్‌ను ఏంచేయాలనే దానిపై మార్గదర్శకాలు ఇవ్వలేదు. లక్షలాది లీటర్లు డీలర్ల వద్దే నిల్వ ఉండిపోయాయి. కొన్నిచోట్ల ప్రభుత్వం తిరి గి తీసుకోదన్న ధీమాతో కొందరు బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు సమాచా రం. కిరోసిన్‌ను తమకే పంపిణీ చేయా లని లబ్ధిదారులు కోరుతున్నారు. -
తేలని లెక్కలు
అధికారులు, డీలర్ల మధ్య కుదరని పొంతన ఆగిన కిరోసిన్ సరఫరా గడువున్నది రెండు రోజులే... 6.85లక్షల మందికి ఇబ్బందులు విజయనగరం కంటోన్మెంట్: అధికారుల ధీమా, డీలర్ల నిర్లక్ష్యంతో జిల్లాలోని 6.85 లక్షల వినియోగదారులకు కిరోసిన్ పంపిణీ నిలిచిపోయింది. ప్రతీ నెలా జిల్లాకు 12,48,000లీటర్ల నీలి కిరోసిన్ పంపిణీ అవుతున్నది. ఈ-పాస్ ద్వారా కాకుండా మామూలుగా ఇవ్వడం వల్ల గత నెల జిల్లాలోని అన్ని డిపోల్లో 77,451లీటర్ల కిరోసిన్ మాత్రమే మిగిలింది. ఇది డీలర్ల లెక్క. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,85,649 లీటర్లు మిగిలి ఉండాలి. అదే ఉద్దేశంతో దానిని కలుపుకుని తాజాగా 9,84,900 లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేశారు. ఇది ఎలా సరిపోతుందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పాస్ ద్వారా కిరోసిన్ సరఫరా కాకపోయినా... గత నెల 20, 21 తేదీల్లో కిరోసిన్ పంపిణీ చేశారనీ, 22వ తేదీకి క్లోజ్ చేశారనీ చెప్పారు. ఈ కొద్ది రోజుల్లో కిరోసిన్ ఈ పాస్ ద్వారా కిరోసిన్‌ను ఎలా పంపిణీ చేస్తామనీ డీలర్లు ప్రశ్నిస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఈ పాస్ విధానం మొదలైంది. కానీ కిరోసిన్ మాత్రం మామూలుగానే అందజేస్తున్నారు. ఇది అధికారులకు తెలుసు. రెండు నెలల క్రితం ఈ పాస్‌లోనే కిరోసిన్ ఇవ్వాలని జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్, డీఎస్ఓ నాగేశ్వరరావు రేషన్ డీలర్లకు ఆదేశించారు. ఎప్పుడూ చెప్పేదే కదా అని డీలర్లు పట్టించుకోలేదు. కొంత మంది ప్రారంభంలో ఈపాస్ ద్వారా ఇవ్వడం ప్రారంభించినా ఆలస్యమవుతున్నదనే కారణంతో మాన్యువల్ పద్ధతిలోనే ఇచ్చేశారు. ఈ నెల ఈ పాస్‌లో ఎంత పంపిణీ అయిందో చూసుకుని ఆ మేరకే కిరోసిన్ కేటాయించారు. దీంతో క్లోజింగ్ బ్యాలెన్స్‌లో తేడా వచ్చింది. అధికారుల లెక్కలతో అయితే తాము సరఫరా చేయలేమని డీలర్లు తేల్చి చెప్పేశారు. దీనివల్ల కిరోసిన్ కేటాయించి దాదాపు 15 రోజులు దాటినా సరఫరా చేపట్టలేదు. ఈ నెల 18లోగా పంపిణీ పూర్తిచేయాలి. కానీ అలా అయ్యే అవకాశం కనిపించలేదు. దీనిపై మంగళవారం ఉదయం జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్‌ను కలసి డీలర్లు వినతిపత్రాన్ని అందించారు. ఆయన సాయంత్రం కలువమన్నారని రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సముద్రపు రామారావు చెప్పారు. సాయంత్రం డీఎస్‌ఓతో కలసి రావాలన్నారనీ, కానీ డీఎస్ఓ సాలూరు వెళ్లిపోవడంతో పంచాయతీ తేలలేదని తెలిసింది. -
వంట గ్యాస్ ఉంటే కిరోసిన్ బంద్
సాక్షి, ముంబై : వంట గ్యాస్ సిలిండర్ ఉన్న రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ నిలిపేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 12 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పొందుతున్న వారికి రేషన్ కార్డుపై కిరోసిన్ పంపిణీ చేయకూడదని జారీచేసిన సర్క్యులర్‌లో ఎఫ్డీ స్పష్టం చేసింది. సిలిండర్ లేని గ్రామీణ, పట్టణ వాసులకు కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. బాంబే హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన నాగ్‌పూర్ బెంచి.. పట్టణ, గ్రామీణ ప్రజలకు సమాన కోటా ఇవ్వాలని తీర్పివ్వడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి డి మాండ్ చేసిన కిరోసిన్‌లో ప్రస్తుతం 28 శాతం మాత్రమే లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నెలకు 1.77 లక్షల లీటర్ల కిరోసిన్ కావాలని డిమాండ్ చేస్తుండగా 46 వేల లీటర్లు మాత్రమే కేంద్రం పంపిణీ చేస్తోందని ఎఫ్డీ అధికారులు తెలిపారు. -
పక్కదారి పడుతున్న రేషన్ కిరోసిన్
వీరఘట్టం, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు రేషన్ డిపోల ద్వారా రాయితీపై అందించాల్సిన నీలి కిరోసిన్ పక్కదారి పడుతోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిరోసిన్‌ను డీలర్లు కొద్దిమంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేసి, మిగిలిన దాన్ని నల్లబజారుకు తరలించేస్తున్నారు. ముం దుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు స్టాకు రాగానే అక్రమ వ్యాపారులతో లాలూచీ పడుతున్నారు. కిరోసిన్ అందని లబ్ధిదారులు దీనిపై ప్రశ్నిస్తే లేనిపోని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. సకాలంలో వచ్చి తీసుకోకపోతే తామేం చేస్తామంటూ తిరగబడుతున్నారు. అంతేకాకుండా రెండు నెలలకు ఒకసారి మాత్రమే కిరోసిన్ ఇస్తామని ఖరాఖండీగా చెబుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవటం లేదు. వేసవి, విద్యుత్ కోతలతో పెరిగిన డిమాండ్ అసలే వేసవి కాలం.. పైగా వేళాపాళా లేని విద్యుత్ కోతల కారణంగా కిరోసిన్‌కి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గ్రామీణులు చాలామంది కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు. కొందరు వంట కోసం కూడా కిరోసిన్‌నే వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితి అటు రేషన్ డీలర్లకు, ఇటు అక్రమ వ్యాపారులకు వరంగా మారింది. కిరోసిన్ లోడ్ వ స్తోందని తెలిసిన వెంటనే అక్రమ వ్యాపారులు డీలర్ల వద్ద వాలిపోతున్నారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో మొత్తం 1987 రేషన్ డిపోలు ఉన్నా యి. వీటి పరిధిలో మొత్తం 7,77,875 మంది రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,81,940 తెలుపు రేషన్‌కార్డులు కాగా, రచ్చబండ-2లో ఇచ్చిన కార్డులు 41,892, ఏఏవై కార్డులు 52,722, ఏపీ కార్డులు 1321 ఉన్నాయి. వీరి కోసం ప్రతి నెలా 1,320 కిలోలీటర్ల కిరోసిన్ విడుదల చేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన కార్డుదారునికి నెలకు 2 లీటర్ల చొప్పున కిరోసిన్ అందజేయాలి. అయితే డీలర్లు అలా ఇవ్వటం లేదు. కొందరు డీలర్లు లీటరు చొప్పున, మరికొందరు లీటరున్నర చొప్పున ఇస్తున్నారు. ఇదేంటని కార్డుదారులు ప్రశ్నిస్తే ఇంతే వచ్చింది ఏంచేయమంటారని దబాయిస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ పౌరసరఫరాల శాఖాధికారులు రేషన్ సరుకులను డీలర్లకు చేర్చేందుకు రూట్ అధికారులను నియమించారు. వీరితో డీలర్లు అవగాహన కుదుర్చుకుని కిరోసిన్నురాత్రి వేళ తరలిస్త్తున్నారు. దీంతో కిరోసిన్ తరలింపుపై ఎలాంటి పర్యవేక్షణ ఉండటం లేదు. మరో వైపు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసినపుడు కిరోసిన్ కూడా అందుకున్నట్టు సంతకాలు చేయించుకుని జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు ఈ అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిర్యాదులు వస్తే చర్యలు: డీఎస్వో ఆనందకుమార్ కిరోసిన్ అక్రమ తరలింపుపై జిల్లా పౌరసరఫరాల అధికారి ఆనందకుమార్‌ను న్యూస్‌లైన్ ప్రశ్నించగా కిరోసిన్ పంపిణీపై ఇప్పటి వరకు తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ఫిర్యాదులేమైనా వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కిరోసిన్ సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.