సాక్షి, ముంబై : వంట గ్యాస్ సిలిండర్ ఉన్న రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ నిలిపేయాలని ఆహార, పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 12 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు పొందుతున్న వారికి రేషన్ కార్డుపై కిరోసిన్ పంపిణీ చేయకూడదని జారీచేసిన సర్క్యులర్‌లో ఎఫ్‌డీ స్పష్టం చేసింది. సిలిండర్ లేని గ్రామీణ, పట్టణ వాసులకు కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. బాంబే హైకోర్టులో దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన నాగ్‌పూర్ బెంచి.. పట్టణ, గ్రామీణ ప్రజలకు సమాన కోటా ఇవ్వాలని తీర్పివ్వడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నా రు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి డి మాండ్ చేసిన కిరోసిన్‌లో ప్రస్తుతం 28 శాతం మాత్రమే లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నెలకు 1.77 లక్షల లీటర్ల కిరోసిన్ కావాలని డిమాండ్ చేస్తుండగా 46 వేల లీటర్లు మాత్రమే కేంద్రం పంపిణీ చేస్తోందని ఎఫ్‌డీ అధికారులు తెలిపారు.
వంట గ్యాస్ ఉంటే కిరోసిన్ బంద్
Published Sat, Aug 22 2015 3:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement