సాక్షి, హైదరాబాద్: నకిలీ వేలిముద్రల స్కాంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. స్కాం నిందితులు రేషన్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ వేలముద్రలతో బియ్యం అక్రమ రవాణా చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పౌరసరఫరాల ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రంగంలోకి దిగి నలుగురు రేషన్ డీలర్లను అదుపులోకి తీసుకుంది.
కాగా, నకిలీ వేలిముద్రల స్కాంలో నిందితుడు పాత సంతోష్ కుమార్‌ను పోలీసులు రెండవరోజు విచారణ జరుపుతున్నారు. సంతోష్‌ను గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం తరలించిన ఎస్సార్ నగర్ పోలీసులు ధనలక్ష్మీ కమ్యునికేషన్‌లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న వేలుముద్రలతో పాటు కొన్ని కీలక పత్రాలు, ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు స్వాదీనం చేసుకున్నారు. ఓ కంప్యూటర్, నకిలీ వేలిముద్రల తయారీ యంత్రాన్ని కూడా గుర్తించారు. కాగా ఈరోజుతో సంతోష్ పోలీస్ కస్టడీ ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment