- ∙రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్‌బాబు
డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
Published Thu, Aug 11 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
కురవి : ప్రభుత్వం రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రేషన్‌డీలర్ల సంక్షే మ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలో డివిజన్ సం ఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీల ర్లకు నెలకు రూ.3700 ఆదాయం వస్తుందని, నెలకు ఖర్చు రూ.8700 వస్తున్నందున ఎలా బతకాలని ప్రశ్నించారు. ఒక్కో డీలర్‌కు 80 క్వింటాళ్ల బియ్యం వస్తే 2 నుంచి 3 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వస్తున్నాయన్నారు. నెలకు భారీ ఎత్తున నష్టం వస్తున్నట్లు తెలిపారు. డీలర్లు రోజు కూలీకి వెళ్లాల్సిన దుస్థితి నెల కొందన్నారు. ప్రభుత్వం ఎలాంటి విధానం పెట్టినా పని చేస్తామన్నారు. కనీస వేతనంగా రూ.20 వేలు ఇవ్వాలని, డీడీ కట్టేందుకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, గ్రూపు ఇన్సూరెన్స్ చేయాలన్నారు. సమావేశంలో సంఘం డివిజన్ అధ్యక్షుడు పెనుగొండ వీరభద్రప్రసాదరావు, నాయకులు బానోత్ శంకర్, గోపాల్‌రావు, రమేష్, జయశ్రీ, వెంకటేశ్వర్లు, ఎండీ. అబీబుద్దీన్, తేజావత్ లక్ష్మా, సోమిరెడ్డి, వెంకటనారాయణ, మలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement