district president
-
బీజేపీలో ‘జిల్లా అధ్యక్ష లొల్లి’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకానికి ముందే లొల్లి షురూ అయ్యింది. నియామక ప్రక్రియకు సంబంధించి అనుసరిస్తున్న విధానంపై పార్టీ నాయకులు, కార్య కర్తలు చిర్రుబుర్రుమంటున్నారు. కొన్ని జిల్లా ల్లోనైతే ఏకంగా ఈ ప్రక్రియను తప్పుబడుతూ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు పంపేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్, మెదక్ పరిధిలోని జిల్లాలు, హైదరాబాద్, ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నట్టుగా కొందరు పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జిల్లా అధ్యక్షుల నియామకం సందర్భంగా అభిప్రాయసేకరణలో వెల్లడైన వ్యక్తులను కాకుండా ఇతరులకు అధ్యక్షులుగా అవకాశం కల్పించారని కొందరు నేతలు ఉదహరిస్తున్నారు. అప్పట్లో కొందరిని జిల్లా అధ్యక్షులుగా నియమించడంపై కేడర్ కొట్టుకుందని, బహిరంగంగానే విమర్శలు గుప్పించారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర పార్టీ నేతలు జిల్లాల్లో పర్యటించి కేడర్ నుంచి చేపడుతున్న అభిప్రాయసేకరణ, దాని ఆధారంగా జాతీయ పార్టీకి పంపుతున్న ఆశావహుల జాబితాలపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. కొందరు అభిప్రాయ సేకరణ జరపకుండానే.. కొన్ని జిల్లాల పరిశీలకులుగా వెళుతున్న కొందరు స్వతంత్రంగా వ్యవహరించకుండా, నిజమైన అభిప్రాయసేకరణ జరపకుండా ఎవరి ప్రభావానికో లోనై ఆశావహుల జాబితాను సిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో పర్యటించిన పరిశీలకులు పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అధ్యక్షుడి నియామకంపై పూర్తిస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపకుండానే జాబితాలు సిద్ధం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారి కార్లలోనే కొందరు పరిశీలకులు తిరగడంతోపాటు వారికి సంబంధించిన ఫామ్‌హౌస్‌లలో కూర్చొని ఆశావహుల జాబితాను తయారు చేస్తున్నారని మరికొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ మంది జిల్లా అధ్యక్షుడిగా కోరుకుంటున్న వ్యక్తి పేరు కాకుండా తమకు నచ్చిన వారి పేర్లతో లిస్ట్ సిద్ధం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుల నియామకానికి ఒక్కో జిల్లా నుంచి ఐదేసి మంది పేర్లతో జాబితాలు తయారు చేసి పంపించాలన్న జాతీయ నాయకత్వం ఆదేశాలను సైతం కొందరు నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే వాదనలు వస్తున్నాయి. రాష్ట్ర నేతలు సమర్పించిన జాబితాల ఆధారంగా ఒకట్రెండు రోజుల్లోనే జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశాలున్నాయి. దీంతో సమర్థులైన వారికి ఈ పదవి లభిస్తుందా లేదా అనే ఆందోళనను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. సంస్థాగతంగా చూస్తే. తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ పరంగా మొత్తం 38 జిల్లాలుగా విభజించారు. హైదరాబాద్ నగరాన్ని నాలుగు జిల్లాలుగా (హైదరాబాద్ సెంట్రల్, మలక్‌పేట–భాగ్యనగర్, గోషామహల్– గోల్కొండ, మహంకాళి సికింద్రాబాద్) రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లాలు, మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్, రూరల్ జిల్లాలు, ఇలా వివిధ జిల్లా శాఖలున్నాయి. -
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు నేతలతో వైఎస్ జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీలో సంస్థాగత మార్పులు కొనసాగుతున్నాయి. తాజా రాజకీయ పరిణామాలను చర్చించడంతోపాటు జిల్లాల అధ్యక్షుల ఎంపిక కోసం పార్టీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బుధవారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నేతలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జగన్ భేటీ అయ్యారు. సాయంత్రంలోపు ఆయా జిల్లాల కొత్త అధ్యక్షుల పేర్లతో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్ నివేదిక! -
YSRCPలో కీలక పదవులకు నియామకాలు
తాడేపల్లి, సాక్షి: వైస్సార్సీపీలో కీలక పదవులకు నియామకాలు జరిగాయి. రెండు జిల్లాలకు అధ్యక్షులతో పాటు కీలక విభాగాలకు నియామకాలు చేస్తూ గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదలయ్యింది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలనుసారం.. కర్నూలు జిల్లాకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాలకు పార్టీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్‌రెడ్డిని నియమించారు. ఇక.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (లీగల్ వ్యవహారాలు) మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. అలాగే.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణ మూర్తి (చిట్టి బాబు), పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది. -
వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షునిగా పిన్నెల్లి
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షునిగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ప్రస్తుతం కూడా ఆయనే జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి వ్యవహరిస్తారు. చదవండి: (వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..) -
గ్రేటర్ జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులు వీరే.. ముగ్గురూ ముగ్గురే..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు టీఆర్ఎస్ జిల్లా శాఖలకు అధ్యక్షులొచ్చారు. సుదీర్ఘకాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న అధ్యక్షుల పేర్లను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మరో రెండేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలకు అనుగుణంగా గులాబీ బాస్ కొత్త సారథులను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. పార్టీ సారథ్య బాధ్యతలను నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నవారికి అప్పగిస్తారని భావించినా.. అంచనాలు తలకిందులు చేస్తూ మూడు జిల్లాలకు ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలనే ఖరారు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో రెండు ఎమ్మెల్యేలకు, ఒకటి ఎమ్మెల్సీకి దక్కాయి. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నియమితులయ్యారు. ఇక త్వరలోనే జిల్లా, డివిజన్ల పూర్తిస్థాయి కమిటీలు పూర్తి చేయనున్నట్లు భావిస్తున్నారు. (క్లిక్: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే) ముగ్గురూ ముగ్గురే.. ► అధ్యక్షులుగా నియమితులైనవారు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నవారే. గోపీనాథ్, కిషన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మాగంటి గోపీనాథ్ 1985లో తెలుగుయువత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1987లో హుడా డైరెక్టర్‌గా, 1988 వినియోగదారుల ఫోరం తొలి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్ఎస్లోకి రాకముందు టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ► మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రెండు పర్యాయాలు టీడీపీ నుంచి, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేసిన మంచిరెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా.. నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ తదితర హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ► కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శంభీపూర్ రాజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న ఆయనకు గులాబీ దళపతికి సన్నిహితుడిగా పేరుంది. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ పదవి లభించింది. అదృష్టంగా భావిస్తున్నా పార్టీ సభ్యత్వ నమోదు నుంచి అధిష్టానం అప్పగించిన ఏపనైనా నిబద్ధతతో, సిస్టమేటిక్‌గా చేస్తున్నా. ఎంతో కీలకమైన, రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. హైకమాండ్ ఆదేశాలకనుగుణంగా.. అందరినీ కలుపుకొని నడుచుకుంటాను. – మాగంటి గోపీనాథ్ సమన్వయంతో పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం ఎమ్మెల్యేలు, క్యాడర్‌తో సమన్వయంతో పనిచేస్తా. గతంలోనూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవముంది. నాపై నమ్మకముంచి బాధ్యతలప్పగించిన అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా. మరింత కష్టపడి పనిచేస్తా. పార్టీ బలోపేతానికి పాటు పడతా. – మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తిరుగులేని మెజార్టీకి కృషి కేసీఆర్, కేటీఆర్‌ల ఆశయాలకనుగుణంగా పని చేస్తా. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతా. వార్డు, డివిజన్, పట్టణ, మండల, జిల్లాస్థాయిలో పార్టీకోసం పనిచేసే వారికి తగిన పదవులు లభించేలా చూస్తా. అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అభ్యర్థులు తిరుగులేని మెజార్జీతో గెలిచేలా కృషి చేస్తా. – శంభీపూర్ రాజు -
పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం
సాక్షి, పెద్దపల్లి: పార్టీలో క్రమశిక్షణ లోపించిందని అధిష్టానానికి పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ లేఖ రాశారు. దీంతో ఆ పార్టీలో ముసలం రాజుకుంది. తనకు తెలియకుండానే పార్టీ మీటింగ్‌లు పెడుతున్నారని సోమారపు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగలేనని లేఖలో పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం జిల్లా అధ్యక్షుడిగా వేసిన కమిటీని అధిష్టానం ఆమోదించని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: మాజీ కౌన్సిలర్ దారుణ హత్య -
బీజేపీలో.. పదవుల ముసలం..!
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అంతంత మాత్రంగా ప్రభావం ఉన్న బీజేపీని ఆ పార్టీలోని వర్గపోరు మరింత బలహీనం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం మూడు వర్గాలుగా విడిపోయిన జిల్లా బీజేపీలో పదవుల కోసం లొల్లి మొదలైందని అంటున్నారు. ము న్సిపల్ ఎన్నికల వరకు అంతా కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించిన బీజేపీలో ఆ తర్వాత పరిణామాలతో అభిప్రాయభేదా లు ఏర్పడ్డాయి. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన కంకణా ల శ్రీధర్‌రెడ్డి ఏకపక్షంగా జిల్లా కార్యవర్గాన్ని నియమించుకున్నారన్న అసంతృప్తి గొడవలకు దారి తీస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లా మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ప్రస్తుత అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి వర్గాలుగా జిల్లా బీజేపీ విడిపోయిందన్న చర్చ జరుగుతోంది. కొత్త అధ్యక్షుడిగా శ్రీధర్‌రెడ్డి నియామకం అయిన తర్వాత పార్టీ సమావేశాలు నిర్వహించడంలో, వివిధ కార్యక్రమాల నిర్వహణకు సీనియర్లను ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రానికి వచ్చే సందర్భంలో సీనియర్లకు కనీస సమాచారం లేకుండా కొందరిని కోటరిగా పెట్టుకుని వారు చెప్పినట్లుగా నడచుకుంటున్నారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. అందరినీ కలుపుకొనిపోయి పార్టీని బలోపేతం చేయకుండా తమకు నచ్చని వారిని పక్కన పెట్టేసి, పార్టీని బలహీన పర్చేలా జిల్లా అధ్యక్షుడే వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇక, జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలు, ప్రజా సమస్యలపై ఎలాంటి ఆందోళనలు, పో రాటాలు చేయకుండా కేవలం ప్రెస్మీట్లతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వివాదం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అంతా కలిసి పనిచేయాల్సిన పార్టీ నాయకత్వం అభిప్రాయభేదాలతో ఎవరికి వారు అన్నట్లు వ్యవహరిస్తుండడం, ఆందోళన కలిగిస్తోందని బీజేపీ తటస్థ శ్రేణులు పేర్కొంటున్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సారి నల్లగొండ– ఖమ్మం– వరంగల్ ఎమ్మెల్సీ స్థానంపై పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ సంస్థాగత గ్రూపుల లొల్లి విజయావకాశాలను ప్రశ్నార్థకం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పే పార్టీ నాయకత్వం మూడు గ్రూపులుగా విడిపోయి అంతర్గత పోరుతో రచ్చకెక్కడం పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తోంది. ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తప్ప ఇతర సీనియర్ నాయకులు ఒక్కరు కూడా పాల్గొనకపోవడం చూస్తుంటే అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందని పార్టీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరుతో తాము సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నా ఏ మాత్రం మార్పు రావడంలేదని నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి వద్దకు పంచాయితీ ! గతంలో ఎన్నడూ లేనివిధంగా అంతర్గత పోరు రచ్చకెక్కుతుండడంతో తటస్థ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పోరాడాల్సిన పార్టీ జిల్లా నాయకత్వం గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు అపనమ్మకంతో వ్యవహరిస్తున్నరన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మాజీ జిల్లా అధ్యక్షుడి ఇంటికి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నావా అంటూ ఏకంగా జిల్లా అధ్యక్షుడు జిల్లా కేంద్రానికి చెందిన ఓ నాయకుడితో మాట్లాడిన మాటల ఆడియో పార్టీ నేతలను ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆడియోలో ఇరువురి మధ్య మాటల, తూటాలు పేలాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షుడి ఏకపక్ష నిర్ణయాలపై అసమ్మతి నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడు ఈనెల 8వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారని, ఆయన రాగానే జిల్లా పార్టీలో జరిగిన ఏకపక్ష నిర్ణయాలు, అధ్యక్షుడి తీరును వివరించేందుకు వ్యతిరేకవర్గం సిద్ధమవుతోందని చెబుతున్నారు. -
బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందకు బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొత్త టీమ్ తయారీలో నిమగ్నమయ్యారు. తాజాగా ఏడు జిల్లాలకు కొత్త అధ్యుక్షులను నియమించారు. అయితే బీజేపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాత్రం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుచరుడు రావుల శ్రీధర్ రెడ్డి మధ్య భారీస్థాయిలో పోటీ నెలకొని ఉండటంతో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాల వారీగా కొత్తగా నియమితులైన అధ్యక్షుల వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా - ప్రతాప్ రామకృష్ణ మెదక్ జిల్లా - గడ్డం శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా - దూది శ్రీకాంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా - ఎర్ర శేఖర్ (మాజీ శాసనసభ్యులు) వనపర్తి జిల్లా - డాక్టర్ అద్దుల్ రాజ వర్ధన్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా - పెద్దిరాజు రామచందర్ రావు ములుగు జిల్లా - చింతలపూడి భాస్కర్ రెడ్డి చదవండి: కల్వకుర్తి గులాబీ పార్టీలో ఆధిపత్య పోరు -
డాక్టర్ నగేష్‌కే వైఎస్సార్సీపీ జిల్లా పగ్గాలు
కొత్తపల్లి(కరీంనగర్): వైఎస్సార్సీపీ జిల్లా పగ్గాలను కరీంనగర్‌కు చెందిన డాక్టర్ కే.నగేష్‌కు పార్టీ అధిష్టానం అప్పగించింది. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన ఆయన కరీంనగర్ నగర అధ్యక్షుడిగా, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా, రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించారు. వృత్తిరీత్యా వైద్యుడైన నగేష్‌కు అమరావతిలో జరిగిన ఏపీ ప్లీనరీ సమావేశాలు, హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగించే అవకాశాన్ని అధిష్టానం కల్పించింది. ప్లీనరీలో నగేష్ ప్రసంగం పార్టీ అధినాయకత్వాన్ని, శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంది. మిడ్‌మానేరు ప్రాజెక్టు సమస్యపై, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా జిల్లా పర్యటనకు వచ్చిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సహకారం అందించారు. దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మితమైన రాజీవ్ గృహకల్ప సముదాయాలు శిథిలావస్థకు చేరడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. పేదలకు అండగా నిలవడమే లక్ష్యంగా నగేష్ విశేషంగా కృషి చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యం : డాక్టర్ నగేష్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించనున్నట్లు నూతనంగా నియామకమైన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కే.నగేష్ తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికవ్వడం తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ఆర్ అడుగుజాడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకెళ్లడంలో జగన్ ముందుం టారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగా ణలో కూడా పార్టీ బలోపేతానికి అధిష్టానం దృష్టి సారిస్తే సంతోషంగా ఉంటుందని అన్నారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన గట్టు శ్రీకాంత్‌రెడ్డికి, అందుకు సహకరించిన వైఎస్ జగన్, తదితర నేతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. -
బీజేపీ రథసారథి ఎవరు?!
భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి ఎవరనేది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఖాళీ అయిన ఆ స్థానంలో అధిష్టానం ఎవరిని నియమిస్తుందనేది హాట్‌టాపిక్ మారింది. ఆ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగిన కొత్త శ్రీనివాస్‌రెడ్డి ఈనెల 23న రాజీనామా చేసి గులాబీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా సారథి నియామకం అనివార్యంగా భావిస్తున్న అధిష్టానం కొత్త అధ్యక్షుడి వేటలో పడింది. జిల్లాలో నాలుగు స్థానాల నుంచి అభ్యర్థులను పోటీ దింపేందుకు పావులు కదుపుతున్న బీజేపీ ఇప్పటికే రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్‌కు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ను ప్రకటించగా, మానకొండూరు (ఎస్సీ) నియోజకవర్గానికి గడ్డం నాగరాజును ఖరారు చేశారు. ఇదే సమయంలో హఠాత్తుగా శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవిని భర్తీ చేసేందుకు అధిష్టానం యోచిస్తుండగా, ఈ పదవి కోసం ఐదుగురు ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా ఐదుగురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో కొత్త శ్రీనివాస్‌రెడ్డితో పోటీ పడిన సీనియర్ నేత బాస సత్యనారాయణ పేరు ఈసారి ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్న ఆయనకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే విధంగా మరో సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమళ్ల ఆంజనేయులు కూడా జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీలో యువ నాయకత్వానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే ప్రస్తుతం జిల్లా కమిటీలో కీలకంగా ఉన్న మరో ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన జిల్లా ఉపాధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో 2000 నుంచి 2005 వరకు పూర్తి కాల కార్యకర్తగా, ఏబీవీపీ జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేసి ఉపాధ్యక్షుడిగా మూడోసారి వ్యవహరిస్తున్న కృష్ణారెడ్డి పార్టీ పెద్దలతో ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ నుంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న కొట్టె మురళీ కృష్ణ కూడా జిల్లా పగ్గాల కోసం పయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం. విద్యార్థి దశగా ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీలలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఆయన ప్రస్తుతం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ముందస్తు ఎన్నికల ప్రచారంలో కూడా కీలకంగా పని చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న గుజ్జ సతీష్ కూడా జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా.. ఎన్నికల నేపథ్యంలో సీనియర్లకు అవకాశం ఇవ్వాలనుం కుంటే బాస సత్యనారాయణ, కోమళ్ల ఆంజనేయులలో ఒకరికి అవకాశం దక్కనుండగా, యువ నాయకత్వం కావాలనుకుంటే పార్టీలో పూర్తిస్థాయి కార్యకర్తలుగా ఉన్న కృష్ణారెడ్డి, మురళి, సతీష్‌లలో ఒకరి పార్టీ పగ్గాలు అందే అవకాశం ఉందన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ప్రతిష్టాత్మకం.. రాష్ట్ర కమిటీ పరిశీలనలో అధ్యక్షుడి ఎంపిక.. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపేందుకు సిద్ధమైన బీజేపీ కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలపై దృష్టి సారించింది. జిల్లాలో పార్టీకి మరింత ఊపు తెచ్చేందుకు ఈనెల 10 అంబేద్కర్ స్టేడియంలో అఖిల భారత అధ్యక్షుడు అమిత్‌షాతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, కూటమి పార్టీలను టార్గెట్‌గా చేసి మాట్లాడారు. దీంతో జిల్లాలో బీజేపీ క్యాడర్లో ఉత్సాహం రెట్టించింది. ఇదే సమయంలో ప్రకటించిన తొలి జాబితాలో తనకు అవకాశం కల్పించకపోగా, వివక్ష చూపుతున్నారన్న కారణాలతో కొత్త శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడారు. వచ్చే నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న దరిమిలా జిల్లా కొత్త అధ్యక్షుని నియామకం తప్పనిసరిగా మారింది. కాగా.. ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, ప్రకటనపై సోమవారం హైదరాబాద్‌లో ముఖ్య నేతలతో సమావేశమైన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడి నియామకంపైనా చర్చించినట్లు తెలిసింది. -
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శిగా చిరంజీవి
నర్మెట వరంగల్ : వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శిగా మండలంలోని వెల్దండకు చెందిన కంతి చిరంజీవిని నియమించినట్లు పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారం కల్యాణ్‌రాజ్ చేతుల మీదుగా చిరంజీవి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని, తన నియామకానికి సహకరించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్రాజ్కు కృతజ్ణతలు తెలిపారు. కార్యక్రమంలో బచ్చన్నపేట మండల శాఖ అధ్యక్షుడు తాడెం బాలకిషన్, నాయకులు కొరిమి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు లీడర్ల కరువు..!
సాక్షి, కొత్తగూడెం: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ఓటర్ల జాబితాపై కసరత్తు జరుగుతోంది. మరోవైపు సాధారణ ఎన్నికల వేడి కూడా క్రమంగా రగులుకుంటోంది. పార్టీ శ్రేణులను సమన్వయ పరుచుకుంటూ దిశానిర్దేశం చేయాల్సిన సమయంలో సారథ్యాన్ని నియమించకపోవడంతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలకు తప్ప మిగిలిన అన్ని పార్టీలకు జిల్లా అధ్యక్షులు, కమిటీలను నియమించుకున్నాయి. ఆయా పార్టీలు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నికల పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజాక్షేత్రంలోకి దూకి కార్యక్రమాలపై దృష్టిపెట్టాయి. శాసనసభ అభ్యర్థుల టికెట్ల వ్యవహారం, స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు మిగతా పక్షాలు వ్యూహరచన చేస్తుండగా, అధికార ప్రతిపక్షాల్లో సమన్వయపరిచేవారే కరువయ్యారు. టీఆర్ఎస్లో ఏవీ నియోజకవర్గ కమిటీలు? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా కమిటీలను రద్దు చేసి ఏడాదిన్నర గడిచింది. వాటి స్థానంలో నియోజకవర్గ కమిటీలు నియమిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. నామినేటెడ్ పదవులు రాకపోయినా సంస్థాగత పదవులు వస్తాయని కేడర్ ఎదురుచూస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం కొత్తగూడెం శాసనసభా స్థానంలోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. వలసలను భారీగా ప్రోత్సహించడంతో అన్ని పార్టీల నుంచి రాష్ట్ర, జిల్లా, మండల, స్థానిక నాయకులు ఇబ్బడిముబ్బడిగా టీఆర్ఎస్లో చేరారు. జిల్లాలో ఒక ఎంపీ, ముగ్గురు శాసనసభ సభ్యులు, వారి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఖమ్మం లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయి నాయకులు టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఇక్కడ సమన్వయంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. 2017 అక్టోబరులో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ జిల్లాకు చెందిన డాక్టర్ తెల్లం వెంకట్రావుకు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడంతో పాటు అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల సమన్వయకర్తగా నియమించారు. కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి నియోజకవర్గాలకు డోర్నకల్‌కు చెందిన నూకల నరేష్‌రెడ్డిని సమన్వయకర్తగా నియమించారు. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మహబూబాబాద్‌కు చెందిన తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలను సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించారు. కాగా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే లేని చోట్ల నియోజకవర్గ ఇన్చార్జి ఆధ్వర్యంలో నియమించాల్సిన కమిటీలను ఇప్పటివరకు నియమించలేదు. కాంగ్రెస్‌లో ఏడాదిన్నర నుంచి అదిగో.. ఇదిగో.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ డీసీసీ నియామకం.. ఇదిగో.. అదిగో అంటూనే ఏడాదిన్నర గడిపింది. డీసీసీ నియామకం కొద్దిరోజుల్లోనే అంటూ జిల్లా ఆవిర్భావం నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ నియామకం జరగలేదు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకుడు ఎడవల్లి కృష్ణ, పీసీసీ ప్రధాన కార్యదర్శి, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఎవరికి వారు తమ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. 2017 మే నెలలో భద్రాద్రి డీసీసీ విషయమై ఏఐసీసీ నేతలు రామచంద్ర కుంతియా, దిగ్విజయ్‌సింగ్, కొప్పుల రాజు, పీసీసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారని, ప్రకటనే తరువాయి అని ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. రానున్న సాధారణ, స్థానిక ఎన్నికలు, ఎత్తులు, పొత్తులు, ఎత్తులు, టికెట్ల వ్యవహారంపై కీలక నాయకులు దృష్టి సారించడంతో డీసీసీ అంశం మరింత వెనక్కు వెళ్లినట్లైంది. -
టీడీపీని వీడే ప్రసక్తే లేదు
చిన్నశంకరంపేట(మెదక్): టీడీపీని వీడే ప్రసక్తే లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏకే గంగాధర్‌రావు స్పష్టం చేశారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై పూర్తి విశ్వాసంతో టీడీపీలోనే కొనసాగనున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడ్డ టీడీపీ ఎప్పుడు వారి సంక్షేమం కోసం పనిచేస్తుందన్నార -
అవకాశమా.. అవమానమా!
- జిల్లా అధ్యక్షుడిగా సోమిశెట్టి పేరు ప్రకటించని పార్టీ అధిస్ఠానం - మినీ మహానాడు నిర్వహణకు దూరం - ఆఖరి నిమిషయంలో చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు నిర్వహణ సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లును ఊరిస్తూ ఊసురుమనిపిస్తోంది. గతంలో జిల్లా పార్టీ మొత్తం సోమిశెట్టి పేరునే ప్రతిపాదించగా... అకస్మాత్తుగా శిల్పా చక్రపాణి రెడ్డిని అధిష్టానం నియమించింది. ఇప్పుడు సోమిశెట్టినే జిల్లా అధ్యక్షుడు అంటూ స్వయంగా పార్టీ ఇన్చార్జీలు పేర్కొన్నప్పటికీ చివరి నిమిషయంలో ఆయన పేరును ప్రకటించకపోవడం గమనార్హం. వాస్తవానికి మినీ మహానాడును అధ్యక్ష పదవి హోదాలో సోమిశెట్టినే నిర్వహించాలని మొదట్లో వర్తమానం వచ్చింది. ఇందుకోసం ఆయన కూడా అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే, కొన్ని గంటల్లో మినీ మహానాడు ప్రారంభం కాబోతుండగా... మొత్తం నిర్వహణ అంతా చక్రపాణి రెడ్డినే చేపట్టాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. దీంతో సోమిశెట్టి మిన్నకుండిపోయారు. తెరపైకి బీసీ, రెడ్డి వర్గీయులు వాస్తవానికి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న చక్రపాణి రెడ్డికి శాసన మండలి చైర్మన్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో జిల్లా అధ్యక్షుడి మార్పు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వరరెడ్డిల పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే, ఇందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేయలేదు. అదేవిధంగా జిల్లాలోని నేతలందరూ సోమిశెట్టికే ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. అదే సందర్భంలో అటు కర్నూలు పార్లమెంటు ఇన్చార్జ్ సుజనా చౌదరి కూడా సోమిశెట్టికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నట్టు వర్తమానం పంపారు. మినీ మహానాడును కూడా సోమిశెట్టి ఆధ్వర్యంలోనే చేపట్టాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా జిల్లా అధ్యక్ష హోదాలో సోమిశెట్టి అందరికీ మినీ మహానాడు వర్తమానం కూడా పంపారు. నగరం మొత్తం ఆయన పేరుతో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అయితే, చివరి నిమిషయంలో మళ్లీ చక్రపాణి రెడ్డినే నిర్వహించాలని కబురు రావడంతో అందరూ అవాక్కయ్యారు. అయితే, అన్ని జిల్లాలతో పాటు కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి కూడా ప్రకటిస్తారని..అది సోమిశెట్టికే వస్తుందని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అయితే, రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉందని మరో వర్గం వాదిస్తోంది. మొత్తం మీద గతంలో మాదిరిగానే ఆయనకు మొండిచేయి చూపిస్తారా? పట్టం కడతారో చూడాల్సి ఉంది. -
టీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా రవీంద్రనాయక్
అనంతపురం రూరల్ : గిరిజన విద్యార్థి ఫెడరేషన్(టీఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడిగా ఆర్. రవీంద్రనాయక్‌ను ఎంపిక చేశారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి అక్కులప్ప నాయక్ జిల్లా కమిటీని ప్రకటించారు. కార్యదర్శిగా సుంకన్న, ఉపాధ్యక్షుఽలుగా గోపాల్‌నాయక్, హరి, హనుమంతునాయక్, సహాయ కార్యదర్శిగా రఘునాథ్ నాయక్, కోశాధికారిగా లోకేష్ నాయక్‌లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. -
బీజేపీలో తారాస్థాయికి వర్గపోరు
అధ్యక్ష పదవి కోసం క్యాంపులు కాషాయ పార్టీకి క్రమశిక్షణ సమస్యలు నేడు జిల్లా అధ్యక్ష ఎన్నిక సాక్షి, వరంగల్: భారతీయ జనతా పార్టీలో గ్రూపులు మొదలయ్యాయి. కాషాయ పార్టీ నేతలు పదవుల కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్ష ఎన్నిక మంగళవారం జరగనుండగా.. ఆ పదవి దక్కించుకునేందుకు పలువురు నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. పదవి కోసం పోటీ పెరగడంతో దిగజారుడు వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ముఖ్యనేతలు పలువురు ఏకంగా క్యాంపు రాజకీయాలు నడిపిస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవిని ఎన్నికునే ఓటు హక్కు ఉన్న ఆఫీసు బేరర్లను క్యాంపులకు తరలించి ’సంతృప్తి’ పరుస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఇలాంటి పరిస్థితి రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిద్ధాంత పార్టీగా చెప్పుకునే బీజేపీలో క్యాంపు రాజకీయాల ధోరణలు రావడంపై కమలం పార్టీ ప్రతిష్టకు ఇబ్బందులు తెస్తున్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాలకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ అర్భన్ జిల్లా అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు రావు పద్మ, చాడ శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్ పోటీపడుతున్నా రు. బీజేపీలో జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. అధ్య్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్న ఇద్దరు నేత లు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. ఎప్పుడూ లేని విధంగా డబ్బు, మద్యంతో ప్రత్యేకంగా క్యాంపులలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అధ్యక్ష పదవిని ఆశిస్తు న్న నేతలు ఒక్కో ఓటరుకు రూ.10 వేల వరకు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. అధ్యక్ష పదవిని ఆశిస్తు న్న ఓ నేత... ఓటర్ల సంఖ్యను 94 నుంచి 124 కు పెంచినట్లు చెబుతున్నారు. ఓటర్లను తమ వారిగా అనుపించుకునేందుకు హన్మకొండలోని రెండు ప్రదేశాల్లో ప్రత్యేకంగా క్యాంపు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఓటింగ్‌పై ఆసక్తి... జిల్లాలో నగరంలోని 58 డివిజన్ లతో పాటు హసన్ ప ర్తి, కమలాపురం, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఐనవోలు, వేలేరు మండలాలు ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని డివిజన్ల బీజేపీ అధ్యక్షులు, మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రస్తుత జిల్లా కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు... లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గ కన్వీనర్లు, రాష్ట్ర కమిటీ ఆఫీసు బేరర్లు, రాష్ట్ర కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షుల్లో జిల్లాకు చెందిన వారికి జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం 124 ఓట్లు ఉన్నాయి. హన్మకొండలోని మహేశ్వరీ గార్డెన్ లో మంగళవారం ఉదయం 10 గంటలకు జరిగే జిల్లా అధ్యక్ష ఎన్నికలకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి ఎన్నిక ఇంచార్జీగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర నేతలు శ్యాంసుందర్, నందకుమార్‌లు ఎన్నిక ప్రక్రియకు హాజరవుతున్నారు. కొత్త కమిటీ ఎన్నికపై సమావేశం జరగతుంది. అందులో ఓటు హక్కు కలిగిన వారి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత అధ్యక్షుడి ఎన్నికపై నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అధ్యక్ష పదవిని ఆశించేవారు ఓటింగ్‌కు పట్టుబడితే ఎన్నికల ఇంచార్జీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
డీసీసీకి పోటాపోటీ l
ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిని కలుస్తున్న ఆశావహులు కందనూలు కాంగ్రెస్‌లో రసవత్తర రాజకీయాలు సాక్షి, నాగర్‌కర్నూల్ : కందనవోలు కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్ష పదవి కోసం చురుగ్గా పావులు కదులుతున్నాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవిని త్వరలో భర్తీ చేస్తుండటంతో తమకు అవకాశం కల్పించాలంటూ ఆయా నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికోసం వారంరోజుల నుంచి వారు గాంధీ భవన్లో పైరవీలు ప్రారంభించారని సమాచారం. జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. కొల్లాపూర్‌లో పార్టీ బలహీనంగా ఉందని, పూర్వవైభవం తీసుకురావాలంటే ఈ ప్రాంతం వారికే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి హర్షవర్ధన్‌రెడ్డి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిసింది. అలాగే ఇదే నియోజకవర్గానికి చెందిన కోడేరు మండల నాయకుడు జగన్మోహన్రెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఇక నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లికి చెందిన దిలీపాచారి ఈ పదవి కోసం పావులు కదుపుతున్నారు. గతంలో తనకు నాగర్‌కర్నూల్ అసెంబ్లీ టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, చివరి నిమిషంలో దామోదర్‌రెడ్డికి టికెట్ కేటాయించారని, అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికైనందున తనకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆయన పట్టుబడుతున్నారు. జిల్లాలో తొలిసారిగా మహిళకు అవకాశం కల్పించాలని నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీ సభ్యురాలు కొండా మణెమ్మ అడుగుతున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నానని, పార్టీ ప్రయోజనాల కోసం కష్టించి పనిచేస్తానని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా వివాదరహితుడైన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణను డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని మరోవర్గం డిమాండ్ చేస్తున్నా అందుకు ఆయన సుముఖంగా లేరని మరికొందరు చెబుతున్నారు. ఈ విషయం మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ వరకు వెళ్లడంతో దామోదర్‌రెడ్డినే ఆ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం ఈసారి యువతకు అవకాశం కల్పించాలని సూచించారని ఈ నేపథ్యంలో చురుగ్గా పనిచేసే వారికే పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది. ఏదిఏమైనా టీఆర్ఎస్ విధానాలపై నిరసనలు వ్యక్తం చేయడమేగాక పార్టీ కేడర్‌కు అండగా ఉండే నాయకుడికే అవకాశం వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
వర్షాల కారణంగా ‘రైతు భరోసా యాత్ర’ వాయిదా
– వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వెల్లడి కర్నూలు(ఓల్డ్‌సిటీ): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో ఈనెల 28 నుంచి నిర్వహించ తలపెట్టిన రైతు భరోసా యాత్ర వాయిదా పడినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో అధిక వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత భరోసా యాత్ర తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. -
రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడిగా రామారావు
బోట్‌క్లబ్ (కాకినాడ) : జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడిగా వైడీ రామారావు శుక్రవారం రెడ్‌క్రాస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కోశాధికారిగా శివరామకృష్ణ, కార్యదర్శిగా సీహెచ్ నరసింహారావు, కార్యవర్గ సభ్యులుగా సోముప్రసాద్, పి.సత్యనారాయణ, జి. మహాలక్ష్మి, పి.రఘరామారావు బాధ్యతలు స్వీకరించారు. తొలుత రెడ్‌క్రాస్ వ్యవస్థాపకులు జేన్హెన్రీడునన్ట్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైడి రామారావు మాట్లాడుతూ జిల్లాలోని రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తామన్నారు. -
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా రవి
వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా కొత్తపేట గ్రామానికి చెందిన బొచ్చు రవి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ శుక్రవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తన నియామకానికి సహ కరించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మతిన్‌కు రవి కృతజ్ఞతలు తెలిపారు. -
డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
∙రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్‌బాబు కురవి : ప్రభుత్వం రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రేషన్‌డీలర్ల సంక్షే మ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలో డివిజన్ సం ఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీల ర్లకు నెలకు రూ.3700 ఆదాయం వస్తుందని, నెలకు ఖర్చు రూ.8700 వస్తున్నందున ఎలా బతకాలని ప్రశ్నించారు. ఒక్కో డీలర్‌కు 80 క్వింటాళ్ల బియ్యం వస్తే 2 నుంచి 3 క్వింటాళ్ల బియ్యం తక్కువగా వస్తున్నాయన్నారు. నెలకు భారీ ఎత్తున నష్టం వస్తున్నట్లు తెలిపారు. డీలర్లు రోజు కూలీకి వెళ్లాల్సిన దుస్థితి నెల కొందన్నారు. ప్రభుత్వం ఎలాంటి విధానం పెట్టినా పని చేస్తామన్నారు. కనీస వేతనంగా రూ.20 వేలు ఇవ్వాలని, డీడీ కట్టేందుకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, గ్రూపు ఇన్సూరెన్స్ చేయాలన్నారు. సమావేశంలో సంఘం డివిజన్ అధ్యక్షుడు పెనుగొండ వీరభద్రప్రసాదరావు, నాయకులు బానోత్ శంకర్, గోపాల్‌రావు, రమేష్, జయశ్రీ, వెంకటేశ్వర్లు, ఎండీ. అబీబుద్దీన్, తేజావత్ లక్ష్మా, సోమిరెడ్డి, వెంకటనారాయణ, మలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
యాదవ మహాసభ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా రాములు
హన్మకొండ చౌరస్తా : అఖిల భారత యాదవ మహాసభ రైతు విబాగం జిల్లా అద్యక్షుడిగా ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మారబోయిన రాములు యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మహాసభ జిల్లా అద్యక్షుడు గిరబోయిన రాజయ్య తెలిపారు. హన్మకొండలోని సంఘం కార్యాలయంలో గురువారం రైతు సంఘం ఎన్నికలు నిర్వహించినట్లు చెప్పారు. ఉపాధ్యక్షులుగా గెంటె కొమురయ్య, గుండెబోయిన నాగయ్య, కాడబోయిన నర్సయ్య, మర్రి గట్టయ్య, ప్రధాన కార్యదర్శులుగా మండల సత్యనారాయణ, రేక దర్గయ్య, కార్యదర్శులుగా నర్రావుల సింహాద్రి, జిల్లెల్ల రాజు, బొద్దు వెంకన్న, మేకల గోపాల్, మాన్క రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వివరించారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి
కుత్బుల్లాపూర్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా కుత్బుల్లాపూర్ నియోజవకర్గం కొంపల్లి గ్రామానికి చెందిన బెంబడి శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డి ఆది నుంచి దివంగత వైఎస్సార్ అనుచరుడిగా కొనసాగుతూ వచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కుంటానని, జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పార్టీని బలోపేతం చేస్తానని శ్రీనివాస్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. -
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బొక్క నర్సింహారెడ్డి?
ఒకటిరెండు రోజుల్లో అధికారిక ప్రకటన మణికొండ: భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడిగా కందుకూరు మండలానికి చెందిన బొక్క నర్సింహారెడ్డి ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. సోమవారం రాజేంద్రనగర్ మండలం నార్సింగ్‌లో జిల్లా ముఖ్యనాయకులంతా ఏకాభిప్రాయ సాధనకు సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు జిల్లా అధ్యక్షుడి రేసులో ఉండగా సమావేశానికి వచ్చిన అత్యధికులు నర్సింహారెడ్డికే మద్దతు తెలిపినట్టు సమాచారం. బాలాపూర్‌కు చెందిన శంకర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నానికి చెందిన అర్జున్‌రెడ్డి, కందుకూరుకు చెందన బొక్క నర్సింహారెడ్డిలు అధ్యక్ష పదవికోసం పోటీపడ్డారు. అయితే సమావేశానికి హాజరైన 47మంది ముఖ్యనాయకుల్లో 40మంది నర్సింహారెడ్డినే సూచించినట్టు సమాచారం. -
బీజేపీ జిల్లా సారథి ఎవరో?
ఈనెల 29న బీజేపీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక రేసులో కేశ్‌పల్లి ఆనందరెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి.. హైకమాండ్ చెప్తే మళ్లీ ఓకే అన్న గంగారెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకులుగా వెంకటరమణి.. రెండు రోజుల ముందు అభిప్రాయసేకరణ జోరందుకున్న ‘సంస్థాగత’ సందడి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో ‘సంస్థాగత’ సందడి జోరందుకుంది. రెండు నెలల కిందటే జరగాల్సిన జిల్లా అధ్యక్షుని ఎన్నిక ఈ నెల 29న జరగనుంది. ఆ పార్టీ అధిష్టానం సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వెంకటరమణి జిల్లా కమిటీ ఎన్నికలకు ఇన్‌చార్జీగా వ్యవహరించనుండగా.. జిల్లాకు చెందిన జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కొత్త అధ్యక్షుని ఎన్నికలో కీలకపాత్ర పోషించనున్నారు. 29న జిల్లా కమిటీ ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ జిల్లా సారథి ఎవరనేది పార్టీ వర్గాల్లో అప్పుడే చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందే 27న పార్టీ సీనియర్లు, పదాధికారుల సమావేశమై కొత్త అధ్యక్షుని ఎన్నికపై అభిప్రాయ సేకరణ చేయనున్నారని తెలిసింది. మొత్తంగా కొత్త అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే నినాదాన్ని కొందరు సీనియర్లు తెరపైకి తీసుకు వస్తుండగా.. పార్టీ కోసం అధిష్టానం సూచనల ప్రకారం పనిచేస్తున్న వారు పోటీకి సిద్ధమవుతున్నారు. పార్టీ కేడర్ మద్దతుతో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి గడ్డం(కేశ్‌పల్లి) ఆనందరెడ్డి ఈ సారి జిల్లా అధ్యక్షపదవికి గట్టీగా ప్రయత్నాలు చేస్తుండగా, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్చార్జి బాణాల లక్ష్మారెడ్డి కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి కూడా అధిష్టానం ఆదేశిస్తే రెండోసారి కొనసాగేంగుదుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంటుండటం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘సంస్థాగతం’పై దృష్టి సారించిన అధిష్టానం 2014 ఎన్నికల్లో జిల్లాలో ఆశించిన మేరకు ఓట్లు రాకున్నా.. కేంద్రంలో నరెంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రావడం ఆ పార్టీ కేడర్‌లో ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో సంస్థాగతంగా బలపడేందుకు అధిష్టానం ఆదేశానుసారం కమలనాథులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అక్టోబర్ వరకు సభ్యత్వ నమోదు పూర్తిచేసి, డిసెంబర్ నెలాఖరు వరకు గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎన్నికలు నిర్వహించాలని భావించారు. ఈ నేపథ్యంలో 2015 ఆగస్టు నుంచి ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లాలో కొంతమంది ఇన్చార్జీలు మాత్రమే చురుగ్గా పాల్గొన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో కీలకంగా వ్యహరిస్తారనే పేరున్న నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందుకు సాగలేదు. జిల్లాలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 1.18 లక్షల సభ్యత్వం నమోదైతే.. ఒక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే 46,850 సభ్యత్వం నమోదు చేశారు. జిల్లాలో చాలా గ్రామాల్లో బూత్ కమిటీలు, మండల కమిటీలు ఇంకా వేయాల్సి ఉండగా.. నిజామాబాద్ రూరల్ బూత్ కమిటీలు, మండల కమిటీలు నెలరోజులు కిందటే పూర్తయి, శిక్షణ తరగతులు కూడ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే వేగం ఉంటే ఇప్పటికే అన్ని కమిటీలు పూర్తయ్యేవి. అయినప్పటికీ వచ్చే నెలలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగనున్నందున, ముందుగానే అన్ని జిల్లా కమిటీలను వేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు నెలల ఆలస్యంగానైనా ఈ నెల 29న జిల్లా అధ్యక్షుని ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. త్వరితగతిన సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయడంపై అధిష్టానం దృష్టి సారించగా... జిల్లా కమిటీ ఎన్నికలు ఆ పార్టీ కేడర్‌లో చర్చకు తెరలేపాయి. పదాధికారులతో ఆశావహుల మంతనాలు సభ్యత్వ నమోదు సమయంలో ఈ సారి జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఉండబోదని, కొత్త వారికే అవకాశం వస్తుందన్న చర్చ జరిగింది. తీరా ఎన్నికలు జరిగే సమయం సమీపించడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతుండటం పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పల్లె గంగారెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో తనవంతు కృషి చేశారు. ఆయన హయాంలోనే 2014 సార్వత్రిక ఎన్నికలు రాగా.. పార్టీ కోసం పనిచేసిన అందరికీ టిక్కెట్లు రావాలని పొత్తులను గట్టిగా వ్యతిరేకించారు. అయినా అధిష్టానం నిర్ణయం మేరకు పొత్తులతో పోటీ చేయాల్సి రాగా.. ఆ తర్వాత ఆయన రెండోసారి అవకాశం వచ్చినా జిల్లా అధ్యక్షునిగా కొనసాగేందుకు విముఖత చూపారు. అయితే ఈ నెల 29న జిల్లా కమిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిష్టానం తానే ఉండాలని భావిస్తే రెండోసారి కొనసాగుతానంటూ పల్లె గంగారెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుం డటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా వుండగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండోసారి కొనసాగలేనని గంగారెడ్డి తరచూ ప్రస్తావించడంతో.. ఇదే సమయంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న గడ్డం(కేశ్‌పల్లి) ఆనందరెడ్డి జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఇదే క్రమంలో జిల్లా కేంద్రంలో రైతు ధర్నాలు, పార్టీ కార్యక్రమాలు జరిగినా రూరల్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలను పిలిపించడం, జాతీయ, రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రుల పర్యటనలు, సభలు విజయవంతం చేయడం కోసం జిల్లా అధ్యక్షుడి సూచన మేరకు ఆనందరెడ్డి గట్టిగా కృషి చేశారు. మొదటి నుంచి జిల్లా అధ్యక్ష పదవి లక్ష్యంగా పనిచేస్తున్న ఆయన ఈ సారి పోటీలో ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్చార్జి బాణాల లక్ష్మారెడ్డి కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ముగ్గురు నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేయగా, 27న జరిగే పదాధికారుల అభిప్రాయ సేకరణలో తమ పేరును ప్రతిపాదించాలని ఎవరికీ వారుగా ఫోన్లలో కోరుతుండటం.. జిల్లా అధ్యక్షుని ఎన్నికలు రసకందాయంలో పడినట్లేనన్న చర్చ జరుగుతుంది.