ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఒంగోలు క్లాత్ మార్కెట్ అసోసియేషన్ హాల్లో బుధవారం ఆంధ్రకేసరి సేవా సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణులకు వైఎస్సార్ ఎలా అండగా ఉన్నారో జగన్ కూడా అలాగే ఉంటారని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు వైఎస్సార్ సీపీకి మద్దతిచ్చి, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి రాగానే పేద బ్రాహ్మణులందరికీ ఇళ్ల స్థలాలిస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్ హయాంలో ఈబీసీలకు ప్రాధాన్యమిచ్చిన విషయాన్ని బాలినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డికి, అసెంబ్లీ అభ్యర్థి అయిన తనకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్ సీపీ బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి కోన రఘుపతి మాట్లాడుతూ.. బ్రాహ్మణులకు వైఎస్సార్ ఎంతో సేవ చేశారని కొనియాడారు.
బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటా శంకరశర్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీలో బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైవీ సుబ్బారెడ్డి, బాలినేనిని గెలిపించేందుకు బ్రాహ్మణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కోటా శంకరశర్మను ఘనంగా సన్మానించారు. దక్షిణామూర్తి, గొల్లాపల్లి సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. తదనంతరం బాలినేని, వైవీ సుబ్బారెడ్డిని గజమాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
బ్రాహ్మణుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లాపల్లి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నేలబొట్ల సదాశివయ్య, ఉదయగిరి సీతారామాచార్యులు, దక్షిణామూర్తి, చీమలమర్రి సుబ్బారావు, టీవీఎల్ సుబ్రహ్మణ్యం, ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, రావిపూడి గిరిజారావు, మద్దులూరి హరిప్రేమనాథ్, జీ రంగనాథ్, ముక్తినూతలపాటి వాసు, మైనంపాటి సాయి పాల్గొన్నారు.యువ లాయర్లు ఎన్ శ్రీనివాసప్రసాద్, పీవీ రాఘవరావు, పీ రత్నాకర్, ఎం శ్రీధర్, భద్రేశ్వరరావు తదితరులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని సమక్షంలో పార్టీలో చేరారు.
బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
Published Thu, Apr 24 2014 4:36 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM
Advertisement
Advertisement