
వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి
ఒంగోలు : ప్రకాశం జిల్లాపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అగ్రనేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. బుధవారం వైవీ విలేకరులతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండా చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు మూలనపడ్డాయని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు.
రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేస్తానని బాబు చెప్పడం మరో మోసానికి పాల్పడటమేనని వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇప్పటి వరకు ప్రతిపాదనలు పంపకుండా నాటకాలు ఆడుతున్నారని బాబుపై మండిపడ్డారు. ఈ నెల 10 తర్వాత పశ్చిమ ప్రకాశంలో పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. ప్రభుత్వ మోసాన్ని ప్రజలకు వివరిస్తానని తెలిపారు. తాను జిల్లాలో నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయించినా నేటికీ పనులు ప్రారంభించలేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment