
కల్యాణరాజ్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకుంటున్న చిరంజీవి
నర్మెట వరంగల్ : వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శిగా మండలంలోని వెల్దండకు చెందిన కంతి చిరంజీవిని నియమించినట్లు పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారం కల్యాణ్‌రాజ్ చేతుల మీదుగా చిరంజీవి నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని, తన నియామకానికి సహకరించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్‌కు కృతజ్ణతలు తెలిపారు. కార్యక్రమంలో బచ్చన్నపేట మండల శాఖ అధ్యక్షుడు తాడెం బాలకిషన్, నాయకులు కొరిమి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment