బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బొక్క నర్సింహారెడ్డి? | BJP district president bokka narsinha Reddy | Sakshi
Sakshi News home page

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బొక్క నర్సింహారెడ్డి?

Published Tue, Mar 15 2016 3:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా  బొక్క నర్సింహారెడ్డి? - Sakshi

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బొక్క నర్సింహారెడ్డి?

ఒకటిరెండు రోజుల్లో అధికారిక ప్రకటన
మణికొండ: భారతీయ జనతాపార్టీ  జిల్లా అధ్యక్షుడిగా కందుకూరు మండలానికి చెందిన బొక్క నర్సింహారెడ్డి ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. సోమవారం రాజేంద్రనగర్ మండలం నార్సింగ్‌లో జిల్లా ముఖ్యనాయకులంతా ఏకాభిప్రాయ సాధనకు సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా జిల్లాలో ముగ్గురు వ్యక్తులు జిల్లా అధ్యక్షుడి రేసులో ఉండగా సమావేశానికి వచ్చిన అత్యధికులు నర్సింహారెడ్డికే మద్దతు తెలిపినట్టు సమాచారం. బాలాపూర్‌కు చెందిన శంకర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నానికి చెందిన అర్జున్‌రెడ్డి, కందుకూరుకు చెందన బొక్క నర్సింహారెడ్డిలు అధ్యక్ష పదవికోసం పోటీపడ్డారు. అయితే సమావేశానికి హాజరైన 47మంది ముఖ్యనాయకుల్లో 40మంది నర్సింహారెడ్డినే సూచించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement