YSRCPలో కీలక పదవులకు నియామకాలు | ys jagan appoints two new district president for ysrcp | Sakshi
Sakshi News home page

YSRCPలో కీలక పదవులకు నియామకాలు.. పొన్నవోలుకు ఆ బాధ్యతలు

Published Thu, Sep 5 2024 6:16 PM | Last Updated on Thu, Sep 5 2024 6:38 PM

ys jagan appoints two new district president for ysrcp

తాడేపల్లి, సాక్షి:  వైస్సార్‌సీపీలో కీలక పదవులకు నియామకాలు జరిగాయి. రెండు జిల్లాలకు అధ్యక్షులతో పాటు కీలక విభాగాలకు నియామకాలు చేస్తూ గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదలయ్యింది.  

పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలనుసారం.. కర్నూలు జిల్లాకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాలకు పార్టీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్‌రెడ్డిని నియమించారు. 

 

ఇక.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (లీగల్ వ్యవహారాలు) మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. అలాగే.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణ మూర్తి (చిట్టి బాబు), పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement