ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు చెక్ పడింది. జిల్లాలో ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (ఈ-పీడీఎస్) విధానం ద్వారా ఆగస్టు నెలకు సంబంధించిన నిత్యావసర సరుకుల కోటా కేటాయింపు జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న రాతపూర్వ విధానానికి చెక్ పడింది. ఈ-పీడీఎస్ విధానంతో పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి నేరుగా మండలాల తహశీల్దార్లకు ఆన్‌లైన్‌లోనే కోటా కేటాయింపు జరుగుతుంది.
సంబంధిత రేషన్ డీలర్లు తహశీల్దార్ల నుంచే కోటా సరుకులు తీసుకోవాలి. అయితే సరుకుల కేటాయింపు అనంతరం డైనమిక్ కీ రిజిస్ట్రార్‌ను ప్రతి నెల 15 నుంచి 18వ తేదీలోగా కమిషనరేట్ నుంచి విడుదల అవుతుంది. కీ రిజిస్ట్రార్ ప్రకారమే సరుకులు ఎంత మందికి ఇవ్వచ్చు. ఎంత అలాట్‌మెంట్ వచ్చింది అనే వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇక నుంచి బియ్యం, చక్కెరతోపాటు ఇతర తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఈ-పీడీఎస్ విధానం ద్వారా కేటాయిస్తారు. సెప్టెంబర్ నుంచి కిరోసిన్ కోటాను కూడా ఈ-పీడీఎస్ విధానం ద్వారా కేటాయించనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ-పీడీఎస్ విధానం తీసుకొచ్చింది. ఈ విధానాన్ని అమలు చేసి అక్రమాలకు చెక్ పెట్టనుంది. ఇక నుంచి ప్రతి మండలానికి కమిషనరేట్ నుంచి సరుకుల కేటయింపు జరుగనుంది. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి నేరుగా ఎంఎల్‌ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి డీలర్లకు రేషన్ సరుకులు సరఫరా అయ్యేవి. ఇదంతా రాతపూర్వకంగా కొనసాగేది. దీంతో బియ్యం, నూనె, చక్కెర తదితర సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలేవి. ప్రభుత్వానికి రూ.కోట్ల నష్టం వాటిల్లేది. దీనికితోడు ప్రజలకు సరుకులు అందేవికావు.
81,700 రేషన్ కార్డులు తొలగింపు
జిల్లాలో 81,700 రేషన్ కార్డులను తొలగించారు. ఈ-పీడీఎస్ డాటా బేస్‌లో రేషన్ కార్డులను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేశారు. ఈ డాటాబేస్ పరిధిలోని లేని రేషన్ కార్డులను బోగస్‌గా గుర్తించి తొలగించారు. జిల్లాలో ఆధార్ అనుసంధానం 85.77 శాతం పూర్తయింది. ఈ నెల 15లోగా అనుసంధానం పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఇది వరకే అధికారులకు ఆదేశాలు అందాయి. ఫలితంగా ఈ-పీడీఎస్‌లో ఉన్న కార్డులకు మాత్రమే సరుకులు కేటాయింపు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
‘రేషన్’ అక్రమాలకు చెక్
Published Wed, Aug 13 2014 1:14 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement