=రేషన్ డీలర్లకు ఆదేశాలు
=భారీగా తరలించాలని హుకుం
=వివాద రహితంగా ఉండాలని సూచనలు
=సమైక్య ఆందోళనలు తలెత్తకుండా బందోబస్తు
మంత్రి అరుణకుమారి, ఎంపీ శివప్రసాద్ పాల్గొనే రచ్చబండ సభలకు జనాలను తరలించాలని రేషన్ డీలర్లను రెవెన్యూ అధికారులు హుకుం జారీ చేసినట్లు సమాచారం. అత్యవసరంగా డీలర్ల సమావేశం ఏర్పాటు చేసి తరలింపునకు అయ్యే ఖర్చు భరించడంతో పాటు సమస్యలపై నిలదీయకుండా ముందే ఒప్పించాలని ఆదేశించినట్లు తెలిసింది.
సాక్షి, తిరుపతి : తిరుపతి రూరల్ మండలంలో జరిగే రచ్చబండ సభలకు జనాలను భారీగా తరలించాలని రేషను డీలర్లకు రూరల్ ఎంఆర్‌వో కార్యాలయూధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రతి డీలర్ 20 నుంచి 30 మందిని తీసుకుని రావాలని హు కుం జారీ చేసినట్లు సమాచారం. తిరుపతి రూరల్ ఎమ్మార్వో కార్యాలయంలో శుక్రవారం ఉదయం రేషను డీలర్ల అత్యవసర సమావేశం జరిగింది. రూరల్‌లో 46 మంది రేషను డీలర్లు ఉన్నారు. సమావేశం అంటే ఏదో ముఖ్యమైన విషయం ఉంటుందని అందరూ సమావేశానికి హాజరయ్యూరు. అయితే సమావేశంలో అధికారులు చెప్పింది విని ఉసూరుమన్నారు.
శనివారం ఉదయం తిరుచానూరురోడ్డులోని అర్బన్ హట్ లో జరిగే రచ్చబండ సమావేశానికి జనాలను తరలించాలని అధికారులు ఆదేశించారు. ఒక్కో డీలరు 20 నుంచి 30 మందిని తీసుకుని రావాలని నిబంధన విధించినట్లు తెలిసింది. ఖర్చులను కూ డా డీలర్లే భరించాల్సి ఉంటుంది. ఆటో చార్జీలు, అవసరమైతే వారికి భోజన ఖర్చులు కూడా వీరే భరించాలి. అర్బన్ హట్‌లో జరిగే ఈ రచ్చబండకు మంత్రి గల్లా అరుణ కుమారి, తెలుగు దేశం పార్టీ ఎంపీ శివప్రసాద్ హాజరు కానున్నారు.
ఇక్కడికి వచ్చే ప్రజలు రచ్చబండలో తిరగ బడకుండా ఉండాలని, అధికారులకు సహకరించాలని సూచనలి చ్చారు. నాయకుల చెప్పింది వినాలి తప్ప, ఎదురు ప్రశ్నలు వేయరాదని కూడా తీసుకుని వచ్చే వారికి తెలియజేయూలని అధికారులు సూచించినట్లు తెలిసింది. ఇళ్లు నిర్మించలేదని, రేషను కార్డులు కావాలని కోరే వారు కేవలం వినతి పత్రాలు ఇచ్చి సరిపెట్టుకోవాలని, మంత్రిని లేదా ఎంపీని గట్టిగా ప్రశ్నించరాదనే కూడా హుకుం జారీ చేసినట్లు సమాచారం. అనంతరం ఈ విషయూలపై డీలర్లందరితో డీలర్ల సం ఘం అధ్యక్షుడు మునికృష్ణారెడ్డి చర్చినట్లు తెలిసింది. ఇలా ఉండగా, రచ్చబండ సభల వద్ద ధర్నాలు, ఆందోళనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసులను కూడా బందోబస్తుకు నియ మించనున్నారని తెలిసింది.
రేషన్ డీలర్లకు ఆదేశాలు
Published Sat, Nov 16 2013 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement