
మాట్లాడుతున్న రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శేఖర్‌రావు
టేకులపల్లి: రెండున్నరేళ్ల పాటు జిల్లాలోని రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి ఎంతగానో కృషి చేశానని, మళ్లీ తనకు అవకాశం ఇస్తే పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం కోసం పోరాడుతానని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊకే శేఖర్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల క్రితం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు నియమించడం జరిగిందని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేశారని పేర్కొన్నారు.
ఈనెల 22న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని 23 మండలాలు 321 రేషన్ డీలర్లు సహృదయంతో ఆలోచించి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. డీలర్లకు రావాల్సి పాత బకాయిల్లో సగం సాధించామని, మధ్యాహ్న భోజనం బకాయిలు యాబై శాతం సాధించామని తెలిపారు. గౌరవ వేతనం సాధించేంత వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు ఆంగోలు సంతులాల్, జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీర రామ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగులోత్ హేమచందర్, బాణోతు భాస్కర్, వాంకుడోత్ వెంకటేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment