శీలం ఖరీదు రూ.2 లక్షలు | Man put chastity lock on his girlfriend in Khammam District | Sakshi
Sakshi News home page

శీలం ఖరీదు రూ.2 లక్షలు

Published Mon, Nov 18 2013 8:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM

శీలం ఖరీదు రూ.2 లక్షలు

శీలం ఖరీదు రూ.2 లక్షలు

* పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ఇల్లెందు: ప్రేమించానని మాయమాటలు చెప్పి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు చివరకు ఆ యువతిని వదిలించుకునేందుకు రూ. 2లక్షల ఖరీదు కట్టిన సంఘటన ఇది. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం బొల్లినగర్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలివీ...

ఇల్లెందు మండలం బొల్లినగర్‌కు చెందిన ఓ యువతి అదే ఏరియాకు చెందిన ఎం.వెంకటేశ్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరికీ తల్లిదండ్రులు లేరు. సదరు యువకుడికి ఖమ్మంలో ఉండే అతని మామ సాయం అందిస్తుండగా ఇల్లెందులో ఉంటున్నాడు. ఆ యువతి డీఎంఎల్‌టీ కోర్సు ఇటీవలే పూర్తి చేసింది. వీరి ప్రేమకు వెంకటేశ్ మామ అభ్యంతరం చెప్పటంతో నాలుగు నెలల క్రితం ఎవరికీ తెలియకుండా యువతి ఇంట్లోనే పసుపుతాడు కట్టి పెళ్లి చేసుకున్నాడు.

నాలుగు నెలలు కాపురం చేసిన తర్వాత యువతి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు పంచాయితీ పెట్టించాడు. దీంతో పెద్దలు యువతికి రూ. 2లక్షలు ఇప్పించేందుకు తీర్మానించారు. పంచాయితీ జరిగిన రెండు రోజుల తర్వాత ఆ యువతి తనకు భర్తే కావాలంటూ ఇల్లెందు పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement