
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు సమ్మె విరమణకు అంగీకరించని నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. గ్రామాల్లోని ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) మహిళా సంఘాలతో సరుకుల పంపిణీ చేయించేలా ఏర్పా ట్లు చేస్తోంది. ఈ నెల 28 వరకు డీలర్లకు డెడ్‌లైన్ విధించడంతో అంతవరకు వేచిచూసిన తర్వాత తగిన ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ జిల్లా డీఎస్‌వోలు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 28 నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా ల వారీగా కార్యాచరణ సిద్ధం చేసుకురావాలని ఆదేశించారు. అదే రోజున గ్రామాల వారీగా సరుకుల పంపిణీ చేసే ప్రాంతాన్ని గుర్తించడం, మహిళా సంఘాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సరుకుల పంపిణీకి డీలర్లు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
సరుకులు అందించడం బాధ్యత..
ఈ నెల 28 వరకు మీ–సేవ కేంద్రాల్లో రేషన్ సరుకుల కోసం డబ్బులు చెల్లించి, ఆర్‌ఓ (రీలీజ్ ఆర్డర్) తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని పౌర సర ఫరాల శాఖ మంగళవారం డీలర్లకు విజ్ఞప్తి చేసింది. పేదలకు నిత్యావసర సరుకులను సకాలంలో అం దించాల్సిన కనీస బాధ్యత రేషన్ డీలర్లపై ఉందని పేర్కొంది. తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థ కం ట్రోలర్ ఆర్డర్ 2016 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం, నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించి, వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. నిర్దేశిత గడువులోగా డబ్బులు చెల్లించని డీలర్లను తొలగిస్తామంది. సకాలంలో సరుకులు ఇవ్వడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment