రేషన్‌ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి | govenrment recgnised the ration dealers | Sakshi
Sakshi News home page

రేషన్‌ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Published Wed, Aug 3 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

govenrment recgnised the ration dealers

 జగిత్యాల అర్బన్‌ : రేషన్‌ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చౌకధరల దుకాణం డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డీలర్లు బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. డీలర్లకు జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేల్‌ వర్తింపజేయాలని, 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్‌ ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, డబుల్‌బెడ్‌రూం పథకం వర్తింపజేయాలని కోరారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఏవో రాజేశ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్వర్‌పాషా, డివిజన్‌ అధ్యక్షుడు రవి, కార్యనిర్వహణ అధ్యక్షుడు లక్ష్మణ్, జగిత్యాల డివిజన్‌ అధ్యక్షుడు నగేశ్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement