raily
-
ఎంపీలతో రైల్వే అధికారుల భేటీ
సాక్షి, విజయవాడ : కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలతో విజయవాడలోని రైల్వే ట్రైనింగ్ సెంటర్లో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లు, కొత్త లైన్లు, రైళ్లు ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్ తదితరులు హన్రయ్యారు. ఈ సందర్భంగా అమరావతికి రాయలసీమ నుంచి రైల్వే కనెక్టివిటీ పెంచేలా అదనపు రైళ్ళ కోసం సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రస్తావించారు. అలాగే టీడీపీ ఎంపీలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఎంపీలంటే కరివేపాకు.. రైల్వే జోన్ విషయంలో ఎంపీలు ఏమీ చేయలేరని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి...దించమంటే దించాలని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎంపీలంటే కూరలో కరివేపాకు అని, రైల్వే జోన్‌పై చెప్పాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అని అన్నారు. మనిషికి కొంచెం భయం ఉంటే అన్ని వస్తాయని, భయం లేకపోతే విచ్చలవిడి తనం వస్తుందని జేసీ పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు అసవరాన్ని, సందర్భాన్ని బట్టి మోదీ అపాయింట్మెంట్ ఇస్తారన్నారు. -
ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం
కలెక్టర్ నీతూప్రసాద్ ర్యాలీ ప్రారంభం ముకరంపుర : ‘ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం–పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే నినాదాన్ని తూచ తప్పకుండా పాటించి భావితరాలకు బంగారు బాటలు వేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. కమాన్‌చౌరస్తా వద్ద జ్యోతిష్మతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. విద్యార్థులు కరపత్రాలు, స్టిక్కర్లను అతికిస్తూ, బట్టసంచులు పంపిణీ చేస్తూ అవగాహన ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ ‘పాలిథీన్ ప్రళయాన్ని ప్రతిఘటిద్దాం’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. పాలిథీన్ ఉత్పత్తులు ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నాయన్నారు. మార్కెట్లో ఏదైన వస్తువు కొనుగోలులో ప్లాస్టిక్ కవర్ల వాడకం స్థానంలో బట్ట, కాగితం సంచులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు వేల సంవత్సరాలైనా భూమిలో కరిగిపోదని, వాననీరు భూమిలో ఇంకకుండా అడ్డుపడుతుందన్నారు. నగరంలోని మురికి కాలువల్లో పాలిథీన్ కవర్లు పేరుకుపోయి డ్రెయినేజీ ప్రవాహానికి అడ్డుతగులుతున్నాయన్నారు. కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, కళాశాల మీడియా కోఆర్డినేటర్ విశ్వప్రకాశ్ బాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.ఆర్ నసీర్, బ్రిగేడ్ కో ఆర్డినేటర్ రాధికారెడ్డి, హెచ్వోడీలు కొండ శ్రీనివాస్, శ్యాంప్రసాద్, టి.ప్రవీణ్‌కుమార్, అధ్యాపకులు జి.శ్రీధర్, సమ్మయ్య, రామకృష్ణ, జయశ్రీ, జ్యోతిప్రభ, నీలిమ, మహేశ్ పాల్గొన్నారు. -
రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
జగిత్యాల అర్బన్ : రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చౌకధరల దుకాణం డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డీలర్లు బుధవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. డీలర్లకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ వర్తింపజేయాలని, 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని, హెల్త్‌కార్డులు, డబుల్బెడ్రూం పథకం వర్తింపజేయాలని కోరారు. సబ్‌కలెక్టర్ కార్యాలయ ఏవో రాజేశ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్వర్‌పాషా, డివిజన్ అధ్యక్షుడు రవి, కార్యనిర్వహణ అధ్యక్షుడు లక్ష్మణ్, జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు నగేశ్ పాల్గొన్నారు.