సాక్షి, విజయవాడ : కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలతో విజయవాడలోని రైల్వే ట్రైనింగ్ సెంటర్‌లో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లు, కొత్త లైన్‌లు, రైళ్లు ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్ తదితరులు హన్‌రయ్యారు. ఈ సందర్భంగా అమరావతికి రాయలసీమ నుంచి రైల్వే కనెక్టివిటీ పెంచేలా అదనపు రైళ్ళ కోసం సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ప్రస్తావించారు. అలాగే టీడీపీ ఎంపీలు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
ఎంపీలంటే కరివేపాకు..
రైల్వే జోన్ విషయంలో ఎంపీలు ఏమీ చేయలేరని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి...దించమంటే దించాలని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎంపీలంటే కూరలో కరివేపాకు అని, రైల్వే జోన్‌పై చెప్పాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అని అన్నారు. మనిషికి కొంచెం భయం ఉంటే అన్ని వస్తాయని, భయం లేకపోతే విచ్చలవిడి తనం వస్తుందని జేసీ పేర్కొన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుకు అసవరాన్ని, సందర్భాన్ని బట్టి మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment