- కలెక్టర్ నీతూప్రసాద్
- ర్యాలీ ప్రారంభం
ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం
Published Wed, Aug 24 2016 11:23 PM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
ముకరంపుర : ‘ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం–పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే నినాదాన్ని తూచ తప్పకుండా పాటించి భావితరాలకు బంగారు బాటలు వేయాలని కలెక్టర్ నీతూప్రసాద్ కోరారు. కమాన్‌చౌరస్తా వద్ద జ్యోతిష్మతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. విద్యార్థులు కరపత్రాలు, స్టిక్కర్లను అతికిస్తూ, బట్టసంచులు పంపిణీ చేస్తూ అవగాహన ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ ‘పాలిథీన్ ప్రళయాన్ని ప్రతిఘటిద్దాం’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. పాలిథీన్ ఉత్పత్తులు ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నాయన్నారు. మార్కెట్లో ఏదైన వస్తువు కొనుగోలులో ప్లాస్టిక్ కవర్‌ల వాడకం స్థానంలో బట్ట, కాగితం సంచులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు వేల సంవత్సరాలైనా భూమిలో కరిగిపోదని, వాననీరు భూమిలో ఇంకకుండా అడ్డుపడుతుందన్నారు. నగరంలోని మురికి కాలువల్లో పాలిథీన్ కవర్లు పేరుకుపోయి డ్రెయినేజీ ప్రవాహానికి అడ్డుతగులుతున్నాయన్నారు. కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, కళాశాల మీడియా కోఆర్డినేటర్ విశ్వప్రకాశ్ బాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.ఆర్ నసీర్, బ్రిగేడ్ కో ఆర్డినేటర్ రాధికారెడ్డి, హెచ్‌వోడీలు కొండ శ్రీనివాస్, శ్యాంప్రసాద్, టి.ప్రవీణ్‌కుమార్, అధ్యాపకులు జి.శ్రీధర్, సమ్మయ్య, రామకృష్ణ, జయశ్రీ, జ్యోతిప్రభ, నీలిమ, మహేశ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement