విజయవాడ : తమ డిమాండ్ల సాధనకు రేషన్ డీలర్లు చేపట్టిన ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. రేషన్ డీలర్లు విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద గత కొన్నిరోజులుగా రిలే దీక్షలు సాగిస్తున్నారు. ఆదివారం వారి దీక్షా శిబిరాన్ని ఏపీ పీసీసీ కార్యదర్శి రఘువీరారెడ్డి సందర్శించారు. వారికి తమ పార్టీ తరఫున సంపూర్ణ తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. డిమాండ్ల సాధనకు రేషన్ డీలర్లు చేస్తున్న పోరుకు వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు.