Relay strike
-
ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర
అగనంపూడి (గాజువాక): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో అంతిమ విజయం కార్మికులదే అని ఉక్కు పోరాట కమిటీ చైర్మన్, సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్.నరసింగరావు అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం రిలే దీక్షా శిబిరం నుంచి దువ్వాడ రైల్వేస్టేషన్, కణితి, వడ్లపూడి ప్రధాన రహదారుల మీదుగా రిలే దీక్షా శిబిరం వరకు పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో ఉద్యమం జాతీయ ఉద్యమంగా మారనుందని చెప్పారు. ఢిల్లీ పెద్దలను కదిలించే స్థాయిలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు పాల్గొనాలని కోరారు. వైఎస్సార్టీయూసీ ప్రధాన కార్యదర్శి వై.మస్తానప్ప, ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ..స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు జరుగుతున్న కుట్రను జాతీయస్థాయిలోని బీజేపీయేతర పార్టీల పార్లమెంటరీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. -
యాజమాన్యం వేధిస్తోందంటూ టీచర్ దీక్ష
అనంతపురం : గార్లదిన్నె మండలంలోని ఓ ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం తన విషయంలో తీవ్ర ఇబ్బందులు పెడుతోందంటూ హిందీ పండిట్ బి.సోమశేఖర్ బాబు వాపోతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ చేయించి న్యాయం జరిగేలా చూడాలని ఆయన గత పది రోజులుగా డీఈఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాడు. 1989 జనవరి 6న తాను సదరు స్కూల్లో టీచర్‌గా చేరానన్నాడు. 2005లో అనారోగ్యంతో సెలవు పెట్టానని.. తర్వాత వెళితే చేర్చుకోలేదన్నారు. చెప్పాపెట్టకుండా సెలవు పెట్టాడంటూ తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. తనను విధుల్లోకి తీసుకుని తర్వాత విచారించమని స్వయంగా విద్యాశాఖ ఆర్జేడీ, కమిషనర్, డీఈఓ నుంచి ఉత్తర్వులు వచ్చినా అమలు చేయలేదని ఆరోపించారు. ఈ క్రమంలో 2012లో తిరిగి తీసుకున్నా జీతాలు లేవన్నారు. ఇప్పటిదాకా తనకు మెమో ఇవ్వలేదన్నారు. సస్పెండ్ చేయలేదన్నారు. 2016 డిసెంబర్లో తన పోస్టులను ప్రభుత్వానికి సరెండర్ చేశారన్నారు. తనకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఎస్ఆర్ కూడా ఇవ్వడం లేదన్నారు. తాను వేరేచోటుకు పోస్టింగ్ చేయించుకునే ప్రయత్నం చేస్తుంటే అధికారులుపై ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. అధికారులు కూడా పాఠశాల యాజమాన్యానికి మద్ధతు తెలుపుతున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. సదరు ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం వివరణ మరోలా ఉంది. టీచర్ సోమశేఖర్ బాబు చెప్పా పెట్టకుండా విధులకు సంవత్సరాల పాటు డుమ్మా కొట్టాడని, ఈ విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామంటున్నారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని భావించే ఆ పోస్టును ప్రభుత్వానికి సరెండర్ చేశామని చెబుతున్నారు. -
'గద్వాలను జిల్లాగా ప్రకటించాలి'
గద్వాల (మహబూబ్‌నగర్ జిల్లా) : గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే డి.కె.భరతసింహా రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని పేరుమైదానంలో జిల్లా సాధన సమితి సంఘం చేపట్టిన రిలే దీక్షలు 20 వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం నాయీబ్రాహ్మణుల రిలే దీక్షకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు గద్వాలకు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మావతి, జానకిరాములు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ డీలర్లకు కాంగ్రెస్ మద్దతు
విజయవాడ : తమ డిమాండ్ల సాధనకు రేషన్ డీలర్లు చేపట్టిన ఆందోళనలకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. రేషన్ డీలర్లు విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద గత కొన్నిరోజులుగా రిలే దీక్షలు సాగిస్తున్నారు. ఆదివారం వారి దీక్షా శిబిరాన్ని ఏపీ పీసీసీ కార్యదర్శి రఘువీరారెడ్డి సందర్శించారు. వారికి తమ పార్టీ తరఫున సంపూర్ణ తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. డిమాండ్ల సాధనకు రేషన్ డీలర్లు చేస్తున్న పోరుకు వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు.